Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
భవిష్యత్తులో మీకు క్యాన్సర్ వస్తుందో రాదో ఈ AI చెప్పేస్తుంది.. ఎలా తెలుసుకోవాలంటే?
ఈ ఆధునిక కాలంలో రోజురోజూకు సాంకేతికత పెరుగుతుంది. ఇంటర్నెట్, AI వంటి అంశాలు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఇప్పటికే AIతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టిస్తున్నారు. ఏది కావాలన్నా AIతో క్షణాల్లోనే సృష్టించేస్తున్నారు. మెడికల్ రిపోర్టులు పరిశీలించడం నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్‌లకు ప్లానింగ్ వేయడం, ఎంతో కష్టమైన కోడింగ్ రాయడం.. వీడియోలను సినిమాల రూపంలో సృష్టించడం వంటివి AI చేసేస్తోంది.
అలాగే, ఎంతో ప్రమాదకర వ్యాధి అయిన క్యాన్సర్ భవిష్యత్తులో మనిషికి వస్తుందా లేదా? భవిష్యత్తులో వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది AI ఇట్టే చెప్పేస్తుంది. అయితే ఏ విధమైన AIలు క్యాన్సర్ గురించి చెప్తున్నాయి? ప్రస్తుతం ఎలాంటి AI మార్కెట్‌లో అందుబాటులో ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఏ AI క్యాన్సర్ గురించి చెప్తుందంటే?
క్యాన్సర్‌తో పాటు ఇతర వ్యాధులను గుర్తించేందుకు అలాగే మెడికల్ రిపోర్టులను అనలైజ్ చేసేందుకు ఇప్పటికే మార్కెట్‌లో కొన్ని AI బాట్స్ ఉన్నాయి. అలాంటిదే బోస్టన్‌లోని మాస్ జనరల్ బ్రిగమ్‌లో AI ఇన్ మెడిసిన్ ప్రోగ్రాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AI వైద్య సమాచారాన్ని ఏవిధంగా అనలైజ్ చేయగలవు అనేది పరీక్షించారు. ఈ పరీక్షలో AI వైద్య సమాచారాన్ని సింథసైజ్ చేశాయని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే రోగుల నుంచి వచ్చిన కొన్ని క్లినికల్ ప్రశ్నలకు మాత్రం అవి సమాధానం ఇవ్వలకేపోయాయని చెప్పుకొచ్చారు.
చాట్ జీపీటీ 3.5
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యాధునిక AI మోడల్ చాట్ జీపీటీ 3.5.. వివిధ రకాల క్యాన్సర్‌లకు ప్రాథమిక చికిత్సను అందించగలవని ఆ కార్యక్రమంలో కనుగొన్నారు. ఒక వ్యక్తి శరీరంలో మొదటి దశ క్యాన్సర్ ఉంటే.. దానిని AI సులభంగా గుర్తించి, దానికి తగిన చికిత్సను కూడా అందించగలుగుతుందని, ఇది AI చరిత్రలోనే అద్భుతమైన ఘట్టమని చెప్పుకొచ్చారు.
5 సంవత్సరాల ముందే క్యాన్సర్‌ను గుర్తిస్తుంది!
అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల కాలంలో ఓ AI మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఈ AI మోడల్ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి అయిదు సంవత్సరాల ముందు రొమ్ము క్యాన్సర్‌ను గుర్తిస్తుంది. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి అయిదు సంవత్సరాల ముందు AI దానిని ఎలా గుర్తిస్తుంది, ఎలాంటి పరిశోధన అది చేస్తుంది అనేది ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా Xలో షేర్ చేశారు. ఒకవేళ ఇది వినియోగంలోకి వస్తే మనిషికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications