Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్లికాని పురుషులు తప్పకుండా చదవాల్సిన వార్త ఇది.. ఇప్పుడే తెలుసుకోండి! లేకపోతే సమస్య తప్పదు!
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు మారుతున్నాయి. జీవన విధానం పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలని అనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. పెళ్లి చేసుకుంటే ఖర్చులు పెళ్ళాం తిప్పలు, పిల్లలు అంటూ తమ జీవితాన్ని వారికే కేటాయించేయాల్సి వస్తుందని, అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే మంచిదని అనుకుంటున్నారు చాలా మంది బ్యాచిలర్స్.
అయితే పెళ్లి చేసుకోకుండా ఉన్న వారికంటే పెళ్లి చేసుకున్న వారికే జీవితకాలం ఎక్కువగా ఉంటుందట. పెళ్లి చేసుకున్న వ్యక్తులే ఎక్కువ కాలం బతుకుతారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? పెళ్లి చేసుకుంటే ఎందుకు ఎక్కువ కాలం బతుకుతారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చెడు అలవాట్లు దూరం..
ఏ మనిషికైనా బాధ్యత తెలిసినపుడే బాధ్యతగా ప్రవర్తిస్తాడు. తనపై ఒక బాధ్యత భారం ఉన్నప్పుడే అతను సరైన మార్గంలో వెళ్తాడు. అయితే ఒక పురుషుడికి పెళ్లితో ఆ బాధ్యత, భారం అనేది తెలిసివస్తుంది మన పెద్దలు చెప్తుంటారు. అనాదిగా ఇదే నమ్ముతుంటారు కూడా. పెళ్లి కాకముందు వరకు తనకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ స్నేహితులతో బలాదూర్ తిరుగుతూ.. సమయానికి ఆహరం తినకుండా ఉంటాడు. అయితే పెళ్లి అయిన తరువాత క్రమశిక్షణతో ఇంట్లోనే ఉంటాడు. భార్యను సాదెందుకు పనులకు వెళ్తాడు. సమయానికి భోజనం తింటాడు. ఈ క్రమంలో అతడికున్న చెడు అలవాట్లు, చెడు వ్యసనాలన్నీ దూరం అవుతాయి.
మద్యం బంద్..
ప్రస్తుత కాలంలో పార్టీలు చాలా సాధారణమైపోయాయి. ఏ చిన్న శుభకార్యమైనా, ఎంత పెద్ద విషాదకర వార్త అయినా.. చేదు వార్తను మర్చిపోవడానికి, మంచి వార్తను గుర్తు చేసుకుంటూ ఉండడానికి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. పార్టీల్లో మద్యం అనేది తప్పనిసరి. పెళ్లి కానీ పురుషులు.. సమయంతో సంబంధం లేకుండా, ఎవరితోనూ పట్టింపు లేకుండా తమకు ఇష్టమొచ్చినట్లు తాగుతుంటారు.
పెళ్లి అయిన తరువాత ఆ పరిస్థితులు మారిపోతాయి. భార్యకు సమాధానం చెప్పడం, తనను నమ్ముకొని తన కుటుంబం ఉందని గుర్తు చేసుకోవడంతో మద్యం జోలికి అస్సలే వెళ్లడు. ఒకవేళ వెళ్లినా మితంగానే తీసుకుంటాడు. దీని కారణంగా ఆరోగ్యం కూడా పాడవదు. నాలుగు కాలాల పాటు చల్లగా ఆరోగ్యంగా జీవిస్తాడు. ఇది కూడా పెళ్లి చేసుకున్న పురుషుల్లో జీవితకాలం పెరగడానికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు.
మరణాల ప్రమాదం తక్కువ..
పెళ్లి తరువాత పురుషుల్లో ముఖ్యంగా బాధ్యత పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి ప్రమాదకరమైన పనుల జోలికి వెళ్ళరు. తమను నమ్ముకొని తన కుటుంబం ఉండడంతో వివాహిత పురుషులు తమ ప్రాణాలను పణంగా పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో సాహసాలు చేయరు. అందుకే వారికి మరణాలు చాలా తక్కువ. పెళ్లి అయిన పురుషుల్లో మరణాల శాతం కేవలం 15% మాత్రమే.
మీ ఇష్టం..
ఒక వ్యక్తికి తన వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది అతని ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. తన ఇష్టాన్ని కాదని ఏ వ్యక్తి పెళ్లి చేసుకోలేడు. అయితే పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? చేసుకోకపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పడం మాత్రమే మా బాధ్యత. ఆపై మీ ఇష్టం.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం ఉండదు.



Click it and Unblock the Notifications