Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Donald Trump: వైల్డ్ ఫైర్..ఈ ఏజ్ లో కూడా రఫ్ఫాడిస్తున్న ట్రంప్ తినే ఫుడ్ ఇదే
రెండు నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ సోమవారం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారత ప్రభుత్వం తరపున విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.
ట్రంప్ వయస్సు ప్రస్తుతం 78 ఏళ్లు. అయినప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటారు. వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. టెంపరితనం కూడా కొంచెం ఎక్కువే ఉంది. అయితే ఎనిమిది పదుల వయస్సుకి దగ్గరపడుతున్నా ట్రంప్ లో ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది, ఆయన ఏం తింటారు అంటూ తరచుగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. ఇంత వయస్సు వచ్చా కుర్రాళ్లని మంచిన ఎనర్జీతో ఉండే డొనాల్డ్ ట్రంప్ ఆహార ప్రాధాన్యతలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ కి ఇష్టమైన వంటకాలేంటో ఇక్కడ చూడండి.

ట్రంప్ కి ఇష్టమైన ఫుడ్,డ్రింక్ ఇదే
ట్రంప్ సహజంగా నే ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడతాడు. డైట్ కోక్, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ ని అమితంగా ఇష్టపడతాడు ట్రంప్. అవి తినడానికి ట్రంప్ ఎప్పుడూ ఆసక్తి చూపెడుతుంటాడు. సాధారణంగా ట్రంప్ బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోడు. ఒకవేళ తినాలనుకుంటే మాత్రం పంది మాంసాన్ని గుడ్లతో కలిపి తినడానికి ఇష్టపడతాడు. తొందరలో ఉంటే మాత్రం పాలతోపాటు కలిపిన తృణధాన్యాలయినా లాగించేస్తాడు. ట్రంప్ కి మెక్ డొనాల్డ్స్ లో తయారయయ్యే ఫాస్ట్ ఫుడ్ అంటే బోలెడంత ఇష్టం. ఎన్నికల ప్రచారంలో అయితే ఆయన దాదాపుగా మెక్ డొనాల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ మీదనే గడిపేవాడు. అక్కడి ఎగ్ మెఫిన్స్ అంటే ట్రంప్ కి అత్యంత ఇష్టం. మెక్ డొనాల్డ్స్ తో చేసే ఫిష్ శాండ్విచ్ అన్నా, చాక్లెట్ షాక్ అన్న ట్రంప్ అమితమైన ఇష్టం.
ట్రంప్ కి అత్యంత ఇష్టమైన మరో ఫాస్ట్ ఫుడ్ జాయింట్ KFC. కేఎఫ్ సీలోని చికెన్ బకెట్ తోనే చాలాసార్లు తన లంచ్ ని కానిచ్చేస్తుంటాడు ట్రంప్. ఆ చికెన్ బకెట్ తో పాటుగా డైట్ కోక్ ని కలిపి తాగుతూ తెగ ఆస్వాదిస్తుంటాడు. టీ, కాఫీ,మందు అలవాట్లు లేని ట్రంప్.. డైట్ కోక్ ని మాత్రం లీటర్ల కొద్దీ తాగుతాడు.
నోరు ఎప్పుడూ కరకరలాడాల్సాందే
ఎక్కువగా మాంసాన్ని ఇష్టపడే ట్రంప్ అప్పుడప్పుడు సీ ఫుడ్ పై కూడా మనసు పారేసుకుంటారు. ఎప్పుడో ఒకసారి రొయ్యలు, చేపలను తినేందకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అయితే ఇది చాలా రేర్ గా జరుగుతుంది. ట్రంప్ కి ఎప్పుడు నోరు కారకరలాడుతూనే ఉండాలంట. అందుకే ఎక్కువగా ఆలుగడ్డ చిప్స్ ని తింటుంటాడు. లేస్ పొటాటో చిప్స్ ని అధికంగా తింటుంటాడు. ఇక భోజనం చేసిన తర్వాత ట్రంప్ కి చెర్రీ తో పాటుగా వెనిల్లా ఐస్ క్రీం తినడమంటే ఇష్టం. దీంతోపాటుగా డిజర్ట్ గా ఆయనకు మరో ఇష్టమైన ఐటెం చాక్లెట్ కేక్.



Click it and Unblock the Notifications