Latest Updates
-
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.!
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.!
నేటి ఆధునిక జీవనశైలిలో సంపాదన పెరిగే కొద్దీ సౌకర్యాలు, వసతులు పెరిగాయి. హోదాకు అనుగుణంగా ఆర్భాటాలు పెరిగాయి. నెలకు రూ. లక్ష సంపాదించినా ఈఎంఐలు లేకుండా బతకడం కష్టమంటే అతిశయోక్తి కాదు. పోటీ ప్రపంచంలో ఒకరితో పోల్చుకుంటూ మన జీవన విధానాన్ని మార్చుకుంటున్నాం. కానీ ఈ మహిళ అందుకు విరుద్ధం. చదువు లేదు, ఉద్యోగం లేదు. కుటుంబాన్ని పోషించడం కోసం ఇళ్లలో పని చేస్తున్నారు. అలాగని ఈమె సంపాదనని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే. ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగులే ఖంగు తినేలా నెలకు రూ. 60,000 ఆర్జిస్తున్నారు. అయితే ఈ సంపాదనని ఆమె ఎంత తెలివిగా వాడుకుంటున్నారో ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని తెలిపారు. ఆ వివరాలు తెలుసుకుంటే ఈనాటి తరానికి అది తప్పనిసరిగా ఆదర్శం అవుతుంది.

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో తన ఇంట్లో పనిచేసే మహిళ జీతం, జీవితం గురించి ఓ కార్పొరేట్ ఉద్యోగి శివ్ మిట్టల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ వివరాల ప్రకారం మహిళ తన ఇంటితో పాటు మరో 5- 6 ఇళ్లలో పనిచేస్తున్నారు. ఈ మొత్తం పనితో నెలకు రూ. 60వేలు సంపాదిస్తున్నారు. అయితే ఈ డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎలా పొదుపు చేస్తున్నారనేది ముఖ్యం. ఇది తెలుసుకుని ఉన్నత స్థాయి ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారట. ఆమె ద్వారా డబ్బు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటున్నామని మిట్టల్ వెల్లడించారు.

సంపాదనలో ఖర్చు, పొదుపు ఇలా
సదరు మహిళలో నెలలో కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే సెలవు తీసుకుంటూ.. కఠోరంగా శ్రమిస్తూ నెలకు రూ. 60,000 సంపాదిస్తున్నారు. ఆ సంపాదనలో నెలకు రూ. 10,000 అద్దెకి చెల్లిస్తున్నారు. ఇంకా కూతురిని మంచి స్కూల్‌లో చదివిస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్వగ్రామంలో రూ. 6లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసి నెలనెలా వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు. ఆమె తన సంపాదనని కుటుంబం కోసం ఖర్చు చేస్తున్న విధానం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు శివ్ మిట్టల్ తెలిపారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

"మనం మన సంపాదనతో ఖరీదైన ఫోన్లు, కార్లు, బ్రాండెడ్ బట్టల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నాం. కానీ ఈ మహిళ అలాంటి అనవసరమైన ఖర్చులు పెట్టుకోలేదు. ఇంకా ఆమెకు పీఎఫ్ గానీ, ఇన్సూరెన్స్ సౌకర్యం గానీ లేదు. అయినా తన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఆమెకు స్పష్టంగా తెలుసు. తన కూతురి భవిష్యత్తును సురక్షితం చేయడం, ఆమె కోసం కష్టపడటమే ఆమెకు ఉన్న ఏకైక ఆశయం, కల.’

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
శివ్ మిట్టల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందులో ఒక నెటిజన్.. మన ఆర్భాటాలకు డబ్బు చేస్తామనేది వాస్తవమే. కానీ మనకి కార్పొరేట్ ఉద్యోగాలు అందించే వైద్య భద్రత ఉంది. వీరికి అలాంటి సౌకర్యం లేదు. చేతి నుంచి డబ్బు ఖర్చు చేసి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి. లేదంటే ఒక్క అనారోగ్యం వచ్చినా వారి పొదుపు మొత్తాన్ని హరించివేస్తుంది. ఈ క్రమంలో ఈ రెండింటినీ పోల్చలేమని వెల్లడించారు.



Click it and Unblock the Notifications
