Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఈ టెక్నిక్ పాటిస్తే అనుకున్నది సాధిస్తారు..! విదేశాల్లో పాపులర్ అవుతున్న ట్రిక్..!
సీక్రెట్ అనే పుస్తకంలో లా ఆఫ్ అట్రాక్షణ్ గురించి చాలా బాగా వివరించారు. ఈ సిద్ధాంతం ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని బాగా సంపాదించింది. అనుకున్నది ఎలా సాధించవచ్చో ఆధ్మాత్మిక విధానంలో మనకు ఈ విషయాలను తెలిపింది. లా ఆఫ్ అట్రాక్షన్‌ను ఉపయోగించుకోవడానికి ఎన్నో టెక్నిక్స్ వచ్చాయ్. రీసెంట్‌గా మానిఫెస్టేషన్ టెక్నిక్ వచ్చింది. ఇది 555 టెక్నిక్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్‌కు పర్ఫెక్ట్ గైడ్‌లైన్స్ వున్నాయ్. మనం చేసే పనిమీద మనకి సరైన నమ్మకం కలుగుతుంది. మన మైండ్ ఈ పనిచేయగలమని అవగాహన పెంచుకుంటుంది. ఏదైనా చేయగలననే పొటెన్షియల్ సామర్ధ్యం మనలో ఉంది అనే ఆలోచనను మనకు మనమే కల్పించుకోవడమే ఈ టెక్నిక్.

అసలు ఈ 555 టెక్నిక్ ఏంటి. ఇది ఎవరైనా సరే ఈజీగా ఫాలో అవగలిగే ఒక మానిఫెస్టేటివ్ టెక్నిక్. మనము అనుకున్నది ఏదైనా 5 రోజుల్లో సాధించగలిగేదే ఈ టెక్నిక్. ఐదు రోజుల్లో మీరు సాధించాలనుకునే కోరికను రాసుకోవాలి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఒక పుస్తకంపై 55 సార్లు ఐదు రోజులు రాస్తూ వుంటే అనుకున్నది సాధిస్తారు.
ఈ ప్రపంచంలో అన్నింటికీ ఒక వైబ్రేషన్ వుంటుంది. మన ఆలోచనలకు కూడా ఒక వైబ్రేషన్ వుంటుంది. ఎప్పుడైతే మన ఆలోచనల వైబ్రేషన్ మనకు కావాల్సిన కోరక యొక్క వైబ్రేషన్‌కు మ్యాచ్ అవుతుందో ఆ కోరికను తీర్చుకునే శక్తి మనకు వస్తుంది. ఈ 5 రోజులు మీ మైండ్‌ను మీ కోరికమీద మాత్రమే ట్యూన్ చేయడం మీరు చేయాలి. ఏం చేయాలో తెలియని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీ కోరిక ద్వారా దారి చూపడం. 555 టెక్నిక్‌ను స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

మీ కోరిక ఏంటో ముందు తెలుసుకోవాలి. ఐదు రోజులూ మీరు ఇదే కోరిక గురించి ఆలోచించాలి. ఆ కోరిక మీకు చాలా ఉపయోగకరమైనది అయ్యుండాలి. కోరికను ఒక అఫర్మేషన్‌లో రాయాలి. మీతో మీరు చెప్పుకోవడానికి రాయడానికి ఉపయోగపడే ఒక బలమైన స్టేట్‌మెంట్. మీలో కాన్ఫిడెన్స్ పెరగాలని మీరు అనుకుంటున్నారు. నేను చాలా బలమైన మనిషిని, ఏదైనా సాధించకలిగే మనిషిని అని రాయాలి. ఇలా రాయడం వల్ల దాన్ని మన సబ్‌కాన్షియస్ మైండ్ నమ్ముతుంది.
మీ కోరకలు రాయడానికి కూడా కొన్ని నియమాలు వున్నాయ్. అవి.. మీ కోరిక చిన్నదిగా వుండాలి, కృతఘ్నత వుండాలి, సాధిస్తే బాగుంటుందనే ఉత్సాహం వుండాలి. ఇలా మీ కోరిక ఏదైనా సరే నియమాలను లోబడి వుండాలి. ఈ కోరికను సాధించడానికి మీరు రోజు కేటాయించే సమయం కేవలం 15 నిమిశాలు మాత్రమే. మీ కోరికను 55 సార్లు ప్రతీ రోజూ క్రమం తప్పుకుండా రాయాలి. ఇది రాసేటప్పుడు పూర్తి స్పృహలో వుండాలి. ఆలోచన, ధ్యాస ఎక్కడా తప్పకూడదు.
రాస్తున్న మొదటి రోజు వున్న హుషారు రెండవ రోజు వుండదు. కారణం ఏదైనా రాయకుండా అస్సలు వుండకూడదు. ఈ టెక్నిక్ చేస్తున్నంతసేపూ ఎవ్వరికీ చెప్పవద్దు. ఇలా ఐదు రోజులు రాసిన తరువాత మీకు మీ కోరికను సాధించుకోగలను అనే నమ్మకం మీలో పెరుగుతూ వస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ మారుతుంది. విదేశాల్లో ఇలాంటి టెక్నిక్లను ఎప్పటి నుంచో ఉపయోగిస్తూ వస్తున్నారు. రాసిన తరువాత ఇది జరుగుతుందా లేదా అని అతిగా ఆలోచించకుండా మీ పని మీరు చేసుకొని పోతూ వుండాలి.



Click it and Unblock the Notifications