Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శృంగారం తరువాత మీ భాగస్వామితో ఇలా చేయాలి.. లేకపోతే..!
దాంపత్య జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యం. అయితే చాలా మందికి శృంగారానికి ముందు భాగస్వామిని ఎలా ముగ్గులోకి దించాలనేది తెలుసు. కానీ సంభోగం తరువాత ముసుగేసుకుని ఏమీ పట్టనట్టు పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సంభోగం తరువాత కూడా భాగస్వామితో మాట్లాడాలని, పలు కార్యక్రమాలు చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ పెరగడంతో పాటు, భాగస్వామిలిద్దరూ సంతోషంగా ఫీల్ అవుతారని తెలిపారు. అయితే శృంగారం తరువాత ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమగా ఉండాలి
శృంగారంలో సంభోగం తరువాత వెంటనే పడుకుంటే.. ఆ అలవాటును మానుకోవాలి. సంభోగం తరువాత మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడాలి. మీ భాగస్వామిని ప్రేమగా కౌగిలించుకొని, ఇద్దరి అనుభూతులను పంచుకోవాలి. ఒకరికొకరు తమ అభిప్రాయాలను పంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి బంధం కూడా బలపడుతుందని పేర్కొంటున్నారు.

కంఫర్ట్ జోన్‌లో ఉంచండి
శృంగారంలో సంభోగం అయిపోయిన తరువాత చాలామంది తమ భాగస్వామిపై పెత్తనం చెలాయించడం, వారిని పట్టించుకోకపోవడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామిని సంభోగం తరువాత కంఫర్ట్ జోన్‌లో ఉంచాలని సూచిస్తున్నారు.
ఈ సమయంలో శారీరక ఆరోగ్యంతో పాటు, తనతో సంతృప్తిగా ఉన్నారా లేదా ఇతర ఏదైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాల గురించి చర్చించుకోవచ్చు. ఒకవేళ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం, మీతో సంతృప్తికరంగా లేకపోతే, మీ భాగస్వామిని సంతృప్తి పరిచేందుకు మీరు చేయాల్సిన పనులపై ద్రుష్టి సారించడం వంటివి మీరు చేయొచ్చు.
పగలు అయితే..
సాధారణంగా శృగారం రాత్రిపూట చేస్తే.. పైన చెప్పిన విధంగా మాట్లాడుకోవడం బాధలు పంచుకోవడం వంటివి చేయొచ్చు. అదే పగలు పూట అయితే అవి కాకుండా వేరే పనులు చేసుకోవచ్చు. ఇద్దరూ కలిసి సరదాగా సినిమాలు చూడడం, సంగీతం ఎంజాయ్ చేయడం, విషయాలను నెమరేసుకుంటూ మాట్లాడుకోవడం వంటివి చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామిలో మీపై నమ్మకంతో పాటు ప్రేమ కూడా పెరుగుతుంది. మిమ్మల్ని మరింత దగ్గరగా చేస్తుంది.
శరీరానికి మాత్రమే కాదు..
శృగారం అనేది కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు, మనసుకు సంబంధించింది కూడా. మానసికంగా సంతోషంగా ఉంటేనే శృంగారంలో మంచి అనుభూతులను పొందుతారు. అలాంటప్పుడు మీ భాగస్వామిని మానసికంగా సంతోషంగా ఉంచుకునే బాధ్యత మీపై ఉంటుంది. అలా ఉంచేందుకు పైన పేర్కొనబడిన విషయాలను పాటిస్తే మానసికంగా సంతోషంగా ఉండడంతో పాటు మీ ఇద్దరి మధ్య ప్రేమ, బంధం పెరుగుతుంది. ఏదైనా సమస్యను కలిసి పరిష్కరించుకోగలిగే అన్యోన్యత బిల్డ్ అవుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచినా అంశాలన్నీ కేవలం మాకు ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇందులో మేము ఎలాంటి నిపుణుల సలహాలు తీసుకోలేదు. కావున ఇందులో పేర్కొనబడిన అంశాలను మీరు పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications