Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Prabhas: ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్..షూటింగ్ లో గాయపడ్డ రెబల్ స్టార్!
ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్. షూటింగ్ టైంలో రెబల్ స్టార్ ప్రభాస్ గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. హను రాఘవపూడి డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా..తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ చీలమండ దగ్గర గాయం అయింది. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.
కల్కి 2898 ఏడీ జనవరి 3న జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. దీంతో జపాన్ లో రిలీజ్ అయ్యే 'కల్కి 2989AD' సినిమా ప్రమోషన్స్ కి హాజరుకాలేకపోతున్నట్లు ప్రభాస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. కాగా,ప్రభాస్ కోలుకునే వరకు షూటింగ్స్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలాఉంటే ప్రభాస్ మరో క్రేజీ డైరెక్టర్‌తో ఓ కొత్త సినిమాకు కమిటైనట్లుగా వార్తలు వస్తున్నాయి. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ వాస్తవానికి నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ఎనౌన్స్ మెంట్ కూడా అయింది.. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ఆగినట్లుగా చిత్ర పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ వర్మ మరో సినిమా అది కూడా ప్రభాస్ తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి



Click it and Unblock the Notifications