Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Tollywood Stars AI Images: టాలీవుడ్ స్టార్స్ సాధువులైతే ఎలా ఉంటారంటే..
ఇప్పుడు ఎక్కడ చూసినా AI హవా నడుస్తోంది. రంగంతో సంబంధం లేకుండా అన్నింటా ఏఐ అనే పదం తెగ వినిపిస్తోంది. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి కృత్రిమ మేధ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఒక వైపు చాట్ జీపీటీ లాంటి AI(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) తో ఉద్యోగాలు పోతాయన్న భయాందోళనలు ఉన్నప్పటికీ.. అది చేసే అద్భుతాలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లాంటి ఏఐలు అవి ఇస్తున్న సమాచారం, వివరిస్తున్న తీరు, చేస్తున్న అద్భుతాలు ఎన్నో.
కవితలు రాయడం నుంచి బొమ్మలు గీయడం, ఊహాత్మక సంఘటనలు వివరిస్తే ఫోటోలు రెడీ చేసి ఇవ్వడం లాంటివి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అలాగే కొన్ని రోజులుగా సినీ తారలు, క్రీడా ప్రముఖల ఫోటోలను మార్ఫింగ్ చేసి చేస్తున్న అద్భుతాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి. రొనాల్డో లాంటి వారు గల్లీలో తిరుగుతుండటం, పెద్ద పెద్ద సెలబ్రిటీలు స్లమ్ లో కనిపించడం లాంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అలాంటి కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. టాలీవుడ్ సినీ ప్రముఖులు సన్యాసులుగా మారితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఏఐ ఫోటోలు సృష్టించింది. వాటిని ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన అకౌంట్ లో పోస్టు చేయగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. వాటిని మీరూ చూసేయండి..
1. రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సన్యాసిలా మారితే ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. గడ్డంతో మెడల్లో మాలలతో ఒంటిపై మాసిపోయిన కాషాయ రంగు చొక్కాతో ఎలా ఉంటాడో అని ఏఐ ఊహించి ఈ ఫోటోను సృష్టించింది.

(Image: Instagram/wild.trance)
2. అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్యాసిలా మారితే.. భుజాల మీదుగా వచ్చే జుట్టు, నెరసిన పొడవాటి గడ్డంతో, మెడలో మాలలతో ఇలా ఉంటాడన్నమాట.

(Image: Instagram/wild.trance)
3. జూనియర్ ఎన్టీఆర్
మెడలో పెద్ద సైజు, చిన్న సైజు మాలలతో, నెరసిన గడ్డంతో.. నుదుటిపై పెద్ద బొట్టుతో కనిపిస్తాడట.

(Image: Instagram/wild.trance)
4. ప్రభాస్
ఎక్కడ ఉన్నా వాడు రాజేరా.. బాహుబలిలో ఓ డైలాగ్ ఇది. ప్రభాస్ ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా డార్లింగ్ అంతే. కావాలంటే సాధువులా మారిన ప్రభాస్ ను చూస్తే.. సాధువులా కాకుండా డార్లింగ్ లాగే కనిపిస్తున్నాడు.

(Image: Instagram/wild.trance)
5. మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు సన్యాసి లుక్ అదిరిపోయింది. పొడవాటి జుట్టు, గడ్డంతో, మెడలో వివిధ రంగుల మూసలతో, కాషాయ వస్త్రాలు వేసుకుని కనిపిస్తున్నాడు.

(Image: Instagram/wild.trance)
6. రానా దగ్గుబాటి

(Image: Instagram/wild.trance)
7. విజయ్ దేవరకొండ

(Image: Instagram/wild.trance)
8. చిరంజీవి

(Image: Instagram/wild.trance)
9. వెంకటేష్

(Image: Instagram/wild.trance)
10. నాగార్జున

(Image: Instagram/wild.trance)
11. ప్రకాశ్ రాజ్

(Image: Instagram/wild.trance)



Click it and Unblock the Notifications