Latest Updates
-
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు!
టూత్ పేస్ట్‌తో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయా, ఇది తెలిస్తే వేలకు వేలు సేవ్ చేసుకుంటారు
పళ్ళు తోముకోవడానికి సాధారణంగా చాలా మంది టూత్ పేస్ట్‌లు వాడుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పళ్ళ పుల్లని వినియోగిస్తారు. అయితే టూత్ పేస్ట్‌ను కేవలం పళ్ళు శుభ్రం చేసుకోవడానికే కాకుండా ఇతర విషయాల్లో కూడా వినియోగించొచ్చు. ఇవి కొన్ని రకాల వస్తువులను శుభ్రం చేయడంలో చాలా బాగా పని చేస్తాయి. ఇందులోని మూలికలు వస్తువులపై ఉండే కఠినమైన జిడ్డును కూడా వదిలించగలుగుతాయి. అయితే ఈ టూత్ పేస్ట్‌తో ఎలాంటి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు? దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వెండి ఆభరణాలు:
వెండి ఆభరణాలు మరియు పాత్రలు కాలక్రమేణు నల్లబడుతుంటాయి. ఇవి మళ్లీ మెరుస్తున్నాయో లేదో ప్రయత్నించడానికి టూత్‌పేస్ట్‌ని ఉపయోగించవచ్చు. కొద్దిగా టూత్‌పేస్ట్‌ను పాడయిన బ్రష్‌తో వెండి ఆభరణాలపై రుద్ది, తర్వాత టూత్ బ్రష్ లేదా మృదువైన క్లాత్‌తో సున్నితంగా తుడవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగి, క్లాత్‌తో తుడవండి. కచ్చితంగా మురికి పోతుంది.

సింక్ మరియు కుళాయిని శుభ్రం చేయడం:
బాత్రూమ్ సింక్లు మరియు ట్యాప్‌లపై పేరుకుపోయిన మురికి, మరకలను టూత్‌పేస్ట్‌తో సులభంగా తొలగించవచ్చు. ఇందుకోసం, సింక్‌లో పేరుకుపోయిన మురికి మీద టూత్‌పేస్ట్ పూయాలి. తరువాత బ్రష్ లేదా స్క్రబ్బర్‌తో రుద్దించి, నీటితో శుభ్రం చేసి ఆరబెట్టండి.
అద్దాలు మరియు గాజు:
గాజు అద్దాలు, కిటికీలు లేదా ఇతర గాజు ఉపరితలాలపై నీటి మరకలు, దుమ్ము పడటం సాధారణం. వాటిని శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు. మరకలను పోగొట్టడానికి, గాజు ఉపరితలంపై టూత్‌పేస్ట్ పూయండి. దాన్ని క్లాత్ లేదా స్పాంజ్‌తో సున్నితంగా రుద్దండి. అనంతరం, స్పాంజ్‌తో తుడిచి, ఆరబెట్టండి. ఈ విధంగా, టూత్‌పేస్ట్ అనేది చాలా ఉపయోగకరమైన శుభ్రపరిచే ఉత్పత్తిగా పనిచేస్తుంది. అయితే, రంగు లేదా జెల్ ఆధారిత టూత్‌పేస్ట్‌ను ఉపయోగించకూడదని జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకంటే ఇవి మరిన్ని మరకలను కలిగించవచ్చు.



Click it and Unblock the Notifications
