Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
2025లో భారతీయులు గూగుల్ లో ఎక్కువగా వెతికిన టాప్ 10 వంటకాలు
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. సాధారణంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే ముందు ఈ ఏడాది మొత్తంలో జరిగిన హైలెట్స్ ను తెలుసుకునేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది గూగుల్ కంపెనీ ఇయర్ ఇన్ సెర్చ్(Year in Search 2025)రిపోర్ట్ విడుదల చేసింది
అయితే గూగుల్ విడుదల చేసే ఇయర్ ఇన్ సెర్చ్ రిపోర్ట్ కేవలం గణాంకాల చిట్టా మాత్రమే కాదు, అది ఆ ఏడాది ప్రజల ఆలోచనలకు, అభిరుచులకు అద్దం పడుతుంది. ఇయర్ ఇన్ సెర్చ్ 2025 రిపోర్ట్ ప్రకారం..2025లో భారతీయులు గూగుల్ లో అత్యధికంగా వెతికిన టాప్ 10 వంటకాలు ఏవో ఇక్కడ చూడండి.

ఇడ్లీ
భారతీయులకు అత్యంత ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది ఇడ్లీనే. సులభంగా జీర్ణమయ్యే గుణం, ఆరోగ్యకరమైన ఆవిరి వంటకం కావడం వల్ల ఇడ్లీ ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో నిలిచింది. చట్నీ, సాంబార్ తో తినే ఈ దక్షిణాది వంటకం దేశవ్యాప్తంగా వంటింట్లో రారాజుగా వెలుగొందుతోంది.
పోర్న్ స్టార్ మార్టిని
భారతీయులు దేశీ వంటకాలతో పాటు అంతర్జాతీయ రుచులను కూడా ఆస్వాదిస్తున్నారు. వోడ్కా, ప్యాషన్ ఫ్రూట్ తో చేసే పోర్న్ స్టార్ మార్టిని అనే కాక్ టెయిల్ రెసిపీ కోసం గూగుల్ లో తెగ వెతికారు.
మోదక్
మన సంస్కృతిలో పండుగలకు, పిండి వంటలకు విడదీయరాని బంధం ఉంది. వినాయకుడికి ఇష్టమైన మోదక్ తయారీ కోసం గూగుల్ లో వెతికేందుకు మహారాష్ట్రతో పాటు దేశమంతటా విపరీతమైన ఆసక్తి కనిపించింది.
తెకువా
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఛత్ పూజ సందర్భంగా చేసే తేకువా (గోధుమ పిండి, బెల్లంతో చేసే బిస్కెట్ లాంటి వంటకం) కోసం కూడా గూగుల్ లో భారీగా సెర్చ్ చేశారు. ఇక దక్షిణాది పండుగల్లో, ముఖ్యంగా వినాయక చవితికి చేసుకునే ఆవిరి కుడుములు కూడా ట్రెండింగ్ లో నిలిచింది.
ఉగాది పచ్చడి
తెలుగు వారి తొలి పండుగ ఉగాదికి చేసే ఉగాది పచ్చడి టాప్ సెర్చ్ లలో ఉండటం మన సంప్రదాయంపై ఉన్న గౌరవానికి నిదర్శనం. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి, జీవితంలోని అన్ని అనుభవాలను స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ వంటకం కోసం నెటిజన్లు పెద్ద ఎత్తున గూగుల్ ను ఆశ్రయించారు.
బీట్ రూట్ కంజీ
ఉత్తరాదికి చెందిన బీట్ రూట్ కంజీ..ఆవాలు, నీటితో పులియబెట్టి చేసే పానీయం. దీనిలోని ప్రోబయోటిక్ లక్షణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయన్న కారణంతో ఇది వైరల్ అయ్యింది.

తిరువతిరై కాళి
తమిళనాడులో తిరువతిరై పండుగ నాడు శివుడికి నైవేద్యంగా పెట్టే తిరువతిరై కాళి (బియ్యం, బెల్లం, యాలకులతో చేసే స్వీట్) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇది ప్రాంతీయ వంటకాలపై ప్రజలకు ఉన్న మక్కువను సూచిస్తుంది.
యార్క్ షైర్ పుడ్డింగ్
బ్రిటన్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన యార్క్ షైర్ పుడ్డింగ్ (గుడ్లు, పిండి, పాలతో చేసే వంటకం) ఎలా తయారు చేయాలనే కుతూహలం కూడా గూగుల్ సెర్చ్ లో కనిపించింది.
గోండ్ కటిరా
గోండ్ కటిరా అనేది ఒక వంటకం కాకపోయినా, వేసవిలో శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన పదార్థంగా దీని కోసం వెతికారు. ఇది పానీయాలు మరియు డెజర్ట్‌లలో వాడే ఒక సహజమైన గమ్.

కొలుకట్టై
ఇక దక్షిణాది పండుగల్లో, ముఖ్యంగా వినాయక చవితికి చేసుకునే ఆవిరి కుడుములు లేదా కొలుకట్టై కూడా టాప్ 10లో నిలిచింది.
మొత్తంగా చూస్తే 2025లో భారతీయులు ఒకవైపు అమ్మమ్మల నాటి పద్ధతులు, సంప్రదాయ పండుగ వంటకాల కోసం వెతుకుతూనే, మరోవైపు కొత్త రకం కాక్‌టెయిల్స్,అంతర్జాతీయ వంటకాలను ప్రయత్నించడానికి వెనుకాడలేదు.



Click it and Unblock the Notifications