Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఏపీ, తెలంగాణలో టాప్-6 బీర్లు ఇవే.. చివరిది మీరు కచ్చితంగా తాగి ఉండరు!
మద్యం ప్రియులకు అత్యంత ఇష్టమైనది బీర్. చాలా మంది దీనిని తాగడానికి ఇష్టపడుతుంటారు. పులియబెట్టిన బార్లీ, గోధుమలు, పండ్లు, కాఫీ, ఇతర సుగంధ ద్రవ్యాలతో ఈ బీర్‌ను తయారు చేస్తారు. మందు తాగేవారిలో చాలా మంది ఈ బీర్ తాగడానికే మొగ్గు చూపుతుంటారు. ఇందులో తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఉండడంతో పాటు పరిమితిలో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండడంతో దీనివైపు ఎక్కువమంది మొగ్గు చూపుతారు.
ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల బీర్లు అందుబాటులో ఉన్నాయి. గోధుమలు, బార్లీ, కాఫీ, ఆపిల్ పళ్ళ రసంతో తయారు చేసిన బీర్లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా ఉన్నాయి. అయితే ఈ స్టోరీలో ఏపీ, తెలంగాణలో టాప్ బీర్లు ఏమిటి? వాటి ధర ఎంత? ఎంత వరకు ఇవి అమ్ముపోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఏపీ, తెలంగాణలో టాప్ సిక్స్ బీర్లు
1.కింగ్ ఫిషర్
ఏపీ, తెలంగాణలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బీర్లలో కింగ్ ఫిషర్ బీర్లు నంబర్ వన్ స్థానంలో ఉంది. కేవలం ఏపీ, తెలంగాణలోనే కాదు భారత దేశం మొత్తంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బీర్లలో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ బీరును యునైటెడ్ బ్రూవరీస్ అనే సంస్థ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర తెలంగాణలో 150 నుంచి ఏపీలో 170 నుంచి ప్రారంభమవుతున్నాయి.
2.కరోనా
ఈ కరోనా ఎక్స్‌ట్రా ప్రీమియం బీర్లను మినరల్ వాటర్, మాల్టెడ్ బార్లీ, మొక్కజొన్న, ఈస్ట్ మిశ్రమంతో తయారు చేస్తారు. ఏపీ, తెలంగాణతో పాటు మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీర్లలో ఇది కూడా ఒకటి. ఇందులో ఆల్కహాల్ శాతం 5 నుంచి ఆరు శాతం వరకు ఉంటుంది. దీని ధర 200 నుంచి ప్రారంభమవుతుంది.
3.బడ్‌వైజర్
ఈ బీర్ కూడా ఏపీ, తెలంగాణలో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన బీర్‌గా ప్రాచుర్యం పొందింది. చాలా మంది ఈ బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు. దీనిని 21 రాత్రులు బేస్ట్ హాఫ్‌లు, బార్లీతో తయారు చేస్తారు. ఇందులో ఆల్కహాల్ శాతం 5 నుంచి ఆరు శాతం వరకు ఉంటుంది. దీని ధర ఏపీ తెలంగాణలో 220 నుంచి ప్రారంభమవుతుంది.
4.బీరా
అత్యంత ప్రజాదరణ పొందిన బీర్లలో బీరా బీర్లు నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ బీర్లు ఎక్కువగా ఆంధ్రాలో అమ్ముడుపోతుంటాయి. వీటిని మలబార్ హిల్స్ నుంచి సేకరించిన కాఫీ గింజలతో తయారు చేస్తారు. దీంతో పాటు వీటికి తోడు రై, మెలోనోను జత చేస్తారు. ఈ బీరులో ఆల్కహాల్ శాతం 4.5 శాతం నుంచి ఆరు శాతం వరకు ఉంటుంది. దీని ధర 150 నుంచి ప్రారంభమవుతుంది.
5.కార్ల్స్ బర్గ్
ఏపీ, తెలంగాణతో పాటు భారత దేశం మొత్తం ఈ బీరు అత్యంత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా తెలంగాణలో ఈ బీరును ఇష్టంగా తాగుతుంటారు. ఈ బీరును ఉత్తమమైన యూరోప్ హోప్‌లు, మాల్ట్‌తో తయారు చేస్తారు. అలాగే ఇందులో పండ్ల రసాలు, మసాలాలు కూడా వినియోగిస్తారు. ఈ బీరులో అయిదు నుంచి ఆరు శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. దీని ధర 200 నుంచి ప్రారంభమవుతుంది.
6.టుబర్గ్
ఈ టుబర్గ్ బీరును పులియబెట్టిన లాగర్, పువ్వులు, ధాన్యాలతో తయారు చేస్తారు. ఇది తెలంగాణకు చెందిన బ్రాండ్. తెలంగాణలోనే దీని తయారీ జరుగుతుంది. దీనిలో 4 నుంచి ఆరు శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. దీని ధర 150 నుంచి ప్రారంభమవుతుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కేవలం జ్ఞానాన్ని అందించేందుకే ఈ స్టోరీ ఇవ్వడం జరిగింది. మద్యపానాన్ని మేము ప్రోత్సహించడం లేదు.



Click it and Unblock the Notifications