Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా..
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలనే ఆరాటం నేటి యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎక్కడికెళ్లినా సరే, ఏంచేసినా సరే ఫోన్ కెమెరా ఆన్ చేయాలి, అందరి దృష్టిని ఆకర్షించేలా ఏదో ఒక విన్యాసం చేయాలి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైకులు కొట్టేయాలి. ఈ వైరల్ ఫీవర్ ఇప్పుడు పరాకాష్టకు చేరుకుని, మన సరిహద్దులు దాటి విదేశాల్లో సైతం భారతీయుల పరువు తీసే స్థాయికి దిగజారింది.

విదేశాలలో భారతీయ పర్యాటకుల వివాదాస్పద ప్రవర్తనకు సంబంధించిన మరో సిగ్గుచేటైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వియత్నాంలోని రద్దీగా ఉండే రాత్రి మార్కెట్ లో ఒక భారతీయ మహిళ కేవలం ఒక టవల్ మాత్రమే చుట్టుకుని డ్యాన్స్ చేయగా, ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆ మహిళ కేవలం ఒక తెల్ల టవల్ మాత్రమే ధరించి, DDLJ సినిమాలోని మేరే ఖ్వాబోం మే పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
డ్యాన్స్ చేస్తుండగా టవల్ పదేపదే జారిపోతుండగా, ఆ మహిళ చిరునవ్వుతో దాన్ని సర్దుకుంటూ ఉంది. చుట్టూ ఉన్న విదేశీ పర్యాటకులు, స్థానికులు అందరూ నిశ్చేష్టులయ్యారు. కొందరు ఆ దృశ్యాన్నిరికార్డ్ చేయడానికి తమ మొబైల్ ఫోన్‌లను బయటకు తీయగా, మరికొందరు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో దుమారం రేపింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కేవలం వ్యూస్ కోసం, ఫేమస్ అవ్వడం కోసం ఇంతలా దిగజారాలా? విదేశాలకు వెళ్ళినప్పుడు కనీసం మన దేశ సంస్కృతి, గౌరవాన్ని కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదా? అంటూ ఓ యూజర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి కొద్దిమంది చేసే పిచ్చి పనుల వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ పర్యాటకులకు చెడ్డపేరు వస్తోంది అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే సోషల్ మీడియాలో ఆ మహిళ చర్యను సమర్థిస్తున్న వారు కూడా కొందరున్నారు. ఆమెకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు, స్వేచ్ఛ ఆమెకు ఉన్నాయి. ఒక మహిళ శరీరాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు అంటూ నెట్టింట కొందరు వాదిస్తున్నారు. పదే పదే జారిపోతున్న టవల్‌ను సర్దుకుంటూ ఆమె డ్యాన్స్ చేయడం చూస్తుంటే, కేవలం వ్యూస్ కోసమే పక్కా ప్లానింగ్ తో ఈ వివాదాస్పద చర్యకు పాల్పడిందని మరికొందరు భావిస్తున్నారు.
నిజానికి, విదేశాల్లో భారతీయ పర్యాటకుల ప్రవర్తనపై విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదు. భారతీయులు పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారని, హోటల్స్ లో విపరీతంగా శబ్దాలు చేస్తారని, స్థానిక నియమాలను పాటించరని పలు దేశాలు బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల విదేశీ ఎయిర్‌పోర్టుల్లో డ్యాన్సులు చేయడం, రెస్టారెంట్లలో గుంపులుగా చేరి గర్బా ఆడటం వంటి వీడియోలు అనేకం వెలుగుచూశాయి. పర్యాటకం పైనే ఆధారపడి జీవించే వియత్నాం లాంటి దేశాల్లో ఇలాంటి విపరీత ధోరణులను అక్కడి ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
కొంతమంది ఆకతాయిలు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల, నిజమైన పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని ప్రభావం ఎంతలా ఉందంటే... కొన్ని దేశాల్లోని హోటళ్లు, టూర్ ఆపరేటర్లు భారతీయ బృందాలను ఆహ్వానించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రతి భారతీయుడిపై నిశితంగా నిఘా ఉంచే పరిస్థితి దాపురించింది.



Click it and Unblock the Notifications