Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
#NisChay Wedding : నిహారిక పెళ్లిలో కలర్ ఫుల్ డ్రస్సులతో కనువిందు చేసిన మెగా ఫ్యామిలీ మెంబర్స్...
నిహారిక వివాహ వేడుకలు మెగా కుటుంబసభ్యుల డ్రస్సింగ్ స్టైల్ అందరినీ తెగ ఆకట్టుకున్నాయి.
మన తెలుగు సంప్రదాయాల్లో పెళ్లి అనగానే అందరికీ గుర్తొచ్చేది.. నుదుటిన బాసికం, కళ్యాణ తిలకం, చెవులకు అందమైన కమ్మలు(జుంకీలు),
మెడలు ధగధగ మెరిసే బంగారు ఆభరణాలు, చమక్కుమని మెరిసే పట్టుచీర, నడుముకి వడ్డాణం, అందమైన పంచె కట్టు.. కాళ్లకు, చేతులకు గోరింటాకు, వధువు కాళ్లకు వెండి పట్టీలు, పాదాలకు పారాణితో పాటు మరెన్నో విషయాలు గుర్తొస్తాయి.
ఇలా వధూవరుల ఆహార్యం చూడగానే ఎంత బాగుందో అనిపించేంత అందంగా తయారవుతారు వధూవరులు. ఆ సమయంలో వారి కళ్లలో కనిపించే కాంతులు వేయి బల్బుల వెలుగుతో సమానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎందుకంటే చాలా మంది జీవితాల్లో ఒకే ఒక్కసారి వచ్చే మధురమైన ఘట్టం కళ్యాణం. కరోనా తగ్గుముఖం పడుతున్న కాలంలో పెళ్లిళ్లు చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి.
ఉదయ్ పూర్ ప్యాలెస్ లో
ఈ నేపథ్యంలో ప్రముఖుల పెళ్లిళ్లు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ లో కొణిదెల నిహారిక పెళ్లి కూడా ముగిసింది. తను జొన్నలగడ్డ చైతన్యతో మూడు ముళ్లు వేయించుకుంది. మెగా వారసురాలు అయిన నిహారిక వివాహ వేడుక రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఏడడుగుల బంధంతో
వీరి వివాహం సందర్భంగా ఉదయ్ విలాస్ రంగురంగుల పూలు, తోరణాలు, అందంగా అలంకరించిన మండపంలో వీరిద్దరూ ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు.

బంగారు వర్ణం దుస్తుల్లో
ఈ సందర్భంగా ముహుర్తం వేళ కొత్త పెళ్లికూతురు నిహారిక బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయింది. వధువుకు తగ్గట్టే వరుడు చైతన్య కూడా స్టైలీష్ దుస్తులతో పర్వాలేదనిపించాడు.

ఫొటోలు సోషల్ మీడియాలో
ఇక మెగా కుటుంబసభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు ధరించిన దుస్తులు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారిపోయాయి.

నూతన వధూవరులిద్దరికీ
వీరి వివాహ వేడుకను చూసిన నెటిజన్లు, ప్రముఖులు నూతన వధూవరులిద్దరికీ వివాహ శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరూ పాలు, నీళ్లలా కలకాలం హాయిగా జీవించాలని..

సంతోషం, ప్రేమ ఉండాలని..
వీరి జీవితంలో ఎప్పుడూ సంతోషం, ప్రేమ ఉండాలని కోరుకుంటూ పోస్టులు చేస్తున్నారు. మూడు రోజుల ఈ వివాహ వేడుకను నిర్వహించడానికి కొణిదెల, అల్లు కుటుంబాలతో పాటు, సన్నిహితులు, బంధువులు సోమవారం నుండే హైదరాబాద్ నుండి ఉదయ్ పూర్ వెళ్లారు.

ఫ్యాషన్ ట్రెండ్
అప్పటినుండే వీరి ఫ్యాషన్ ట్రెండ్ మొదలైంది. సోమవారం రాత్రి సంగీత్ వేడుకలో అల్లుఅర్జున తన అద్భుతమైన డ్రస్ తో హైలెట్ అయ్యారు. ఆ తర్వాత మెహందీ వేడుకలో బ్లాక్ డ్రెస్ లో రామ్ చరణ్ అద్భుతంగా కనిపించారు.

మెగా పవర్ స్టార్
ఇక మూడో రోజు మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింపుల్ డ్రెస్ తో వచ్చినప్పటికీ.. తన కుమారుడు అకీరా, ఆద్య అందరి కంటే హైలెట్ గా నిలిచారు.

అద్వితీయమైన ఘట్టం..
నిహారిక పెళ్లి సందర్భంగా ఉదయ్ విలాస్ హోటల్ దీపాల వెలుగులు, పూలతో అందంగా ముస్తాబవ్వటంతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఔట్ ఫిట్స్, పట్టుచీరలు, ధగధగా మెరిసే ఆభరణాల ఫొటోలతో అద్భుతంగా కనిపించారు.



Click it and Unblock the Notifications


