Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హిందూ సాంప్రదాయంలో 8 రకాల వివాహాలుంటాయి.. అవేంటో తెలుసా?
8 రకాల వివాహాలు ఏమిటి, ప్రస్తుతం ఎలాంటి వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎలాంటి పెళ్లి పద్ధతిని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సాంప్రదాయంలో మొత్తం 8 రకాల వివాహాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. హిందూ మతాన్ని అనుసరించే వారు ఈ రకమైన వివాహాలు చేసుకుంటున్నారు. పురాణాల ప్రకారం అష్టవిధ వివాహాలు ఆచరణలో ఉన్నప్పటికీ వాటిలో నాలుగు రకాల వివాహాలు మాత్రమే ప్రసిద్ధి చెందాయి.

8 రకాల వివాహాలు ఏమిటి, ప్రస్తుతం ఎలాంటి వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎలాంటి పెళ్లి పద్ధతిని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్రహ్మ వివాహం:
బ్రహ్మ వివాహ పద్ధతిలో పురుషుడు బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసిన తర్వాత వివాహానికి సిద్ధమైనట్లుగా భావిస్తారు. వధువు వైపు, వరుడు వైపు కుటుంబ నేపథ్యానని పరిగణనలోకి తీసుకుని ఈ వివాహం జరిపిస్తారు. వధువు తండ్రి అబ్బాయికి వేదాల పరిజ్ఞాం ఉందని నిర్ధారించుకుంటారు. అలా బ్రహ్మ వివాహం జరిపిస్తారు. ఈ పద్ధతిలో వధూవరులు ఇద్దరూ ఒకే మతానికి, ఒకే కులానికి చెందినవారై ఉండాలి. ఇద్దరికి 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి. ఈ రకమైన వివాహంలో వరకట్న వ్యవస్థలో జాడలు ఎక్కడా లేవు. మిగతా వివాహ పద్ధతులతో పోలిస్తే బ్రహ్మ వివాహాన్ని అత్యున్నతమైనదిగా భావిస్తారు.

2. దైవ వివాహం:
వధువు పరిపూర్ణ వ్యక్తి లేదా తెలివైన వ్యక్తి అని నిర్ధారించుకుని పెళ్లికి సిద్ధపడుతుంది. ఈ వివాహ పద్ధతిలో వధువు కుటుంబం పేదవారుగా ఉంటారు. వరుడి కుటుంబం ఉన్నత స్థితిలో ఉంటారు. పెద్దింటి వారికి ఇవ్వాలన్న అమ్మాయి తల్లిదండ్రుల కోరిక ఫలిస్తుందని పెద్దలు చెబుతారు.

3. ప్రజాపత్య వివాహం:
ప్రజాపత్య వివాహ పద్ధతిలో వధువు వయస్సు చాలా తక్కువగా ఉంటుంది. వీటిని ఒకరకమైన బాల్య వివాహాలు అని కూడా అంటారు. ఇందులో వధువు వయస్సు తక్కువగా ఉంటే వరుడు ఆమె కంటే చాలా పెద్దవాడై ఉంటాడు లేదంటా ఆమె వయస్సు వాడే ఉంటాడు. ప్రజాపత్య వివాహ పద్ధతిలో వధువు ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. తల్లిదండ్రులు బలవంతపెట్టి అయినా వివాహం జరిపిస్తారు. ఈ వివాహ పద్ధతిలో వధువును వరుడికి కాకుండా అతని తండ్రికి అప్పజెబుతారు. అత్తమామల ఇంట్లో కూతురిగా బతకాలని దీవించి పంపిస్తారు.

4. గాంధర్వ వివాహం:
ఈ వివాహ పద్ధతిలో కుటుంబాల ఇష్టాయిష్టాలతో పని లేదు. వధూవరులకు ఒకరంటే ఒకరికి ఇష్టమైతే, వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలని కోరుకుంటే వివాహం చేసేసుకుంటారు. తల్లిదండ్రుల అంగీకారం ఉండాల్సిన అవసరం లేదు. గాంధర్వ వివాహంలో దేవతలనే తల్లిదండ్రులుగా భావించి వారి పేరు మీదుగా పెళ్లి జరిపిస్తారు. ఈ కాలంలో జరిగే ప్రేమ పెళ్లిళ్లకు గాంధర్వ వివాహాలు దగ్గరి పోలికగా చెప్పవచ్చు. పూర్వకాలంలో ఇలాంటి వివాహాలు ఎక్కువగా జరిగేవి. శకుంతల దుష్యంతుల వివాహం గాంధర్వ పద్ధతిలోనే జరిగింది.

5. ఆర్ష వివాహం:
ఈ వివాహ పద్ధతిలో ఆవుల దానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పెళ్లికి వధూవరులిద్దరి అంగీకారంతో పాటు ఇరు కుటుంబాల అంగీకారం ఉండాలి. ఈ పద్ధతిలో వధువు రుషులను పెళ్లి చేసుకుంటుంది. దీనికి బదులుగా వరుడు తన రెండు ఆవులను వధువు తల్లిదండ్రులకు ఇస్తాడు. ఇది ఒకరకమైన ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకోవడం లాంటిది.

6. అసుర వివాహం:
అసుర వివాహంలో వధువు ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఇదొక వ్యాపార లావాదేవిలా జరుగుతుంది. వధువును చూసిన వరుడు కొంత డబ్బు ఇచ్చి అమ్మాయిని కొనుక్కుంటాడు. తర్వాత వివాహం చేసుకుంటాడు. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ఇలా ధర చెల్లించి కొనుక్కుని వివాహం చేసుకుంటారు.
ప్రస్తుత కాలంలో ఇలాంటి వివాహాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. పేదలు, వివాహం చేయడానికి కూడా స్థోమత లేని కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ఎంచుకుని వారి కుటుంబాలకు ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు.

7. రాక్షస వివాహం:
ఈ వివాహ పద్ధతిలో ఇష్టాయిష్టాలతో పని లేదు. బలం, బలగంతోనే వివాహాలు జరుగుతాయి. వరుడు, వధువు కుటుంబంతో యుద్ధాలు చేసి, పోరాటాలు చేసి వారి ఓడించి వారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు, రుక్మిణీల వివాహం కూడా రాక్షస వివాహంగా పరిగణిస్తారు.

8. పైశాచ వివాహం:
పైశాచ వివాహంలో వధువు ఇష్టాన్ని పరిగణనలోకి తీసుకోరు. అమ్మాయిపై ఒత్తిడి తీసుకువచ్చి లేదంటే భయపెట్టి వివాహం చేస్తారు.
పైశాచ వివాహాలు ఈకాలంలోనూ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వధువుకు ఇష్టంలేకుండా చేసే వివాహాలు ఇప్పుడైనా, అప్పుడైనా ఎక్కువే.



Click it and Unblock the Notifications