Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కన్యత్వాన్ని వేలానికి పెట్టిన యువతి..ఎన్ని కోట్లు పలికిందో తెలుసా!
ఓ 22 యువతి తన కన్యత్వాన్ని అమ్ముకుంది. బ్రిటన్ లోని మాంచెస్టర్ కి చెందిన 22 ఏళ్ల లారా(laura) అనే స్టూడెంట్ ఆన్ లైన్ వేలంపాటలో తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టగా..కొనుగోలు చేసేందుకు భారీగా ఎగబడ్డాయి. వయస్సుతో సంబంధం లేకుండా మాకు మాకు అంటూ వేలంపాటలో ఎగబడ్డారు. అయితే ఇది ఎక్కడ జరిగింది అని ఆలోచిస్తున్నారా? ఇది జరిగింది బ్రిటన్ లో. ఓ ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్ సైట్ సీక్రెట్ గా ఈ వేలంపాట నిర్వహించగా ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపించారు. చివరిగా హాలీవుడ్ స్టార్ రూ.18 కోట్లకు లౌరా కన్యత్వాన్ని దక్కించుకున్నాడు. ఈ విషయంలో తాను ఏమీ పశ్చాత్తాప్పడటం లేదని,తన ఎంపిక కరెక్ట్ గా ఉన్నట్లు భావిస్తున్నానని లారా తెలిపింది.
ఒకవేళ అమ్మకుండా ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకోకుండా ఉండే అవకాశం ఉందని లారా తెలిపింది. ఇది తెలివైన నిర్ణయం అని.. ఇది తనకు సరైనదని తెలిపింది. తన భవిష్యత్తును భద్రంగా ఉంచుకోడానికి ఇదొక తెలివైన మార్గంగా తన చర్యను లారా సమర్థించుకుంది. చాలా మంది మహిళలు తమ కన్యత్వాన్ని కోల్పోవడం వల్ల ఆర్థికంగా లేదా మానసికంగా ప్రయోజనం పొందరని..ఏమీ పొందకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారని,కానీ తాను మాత్రం ఆర్థిక భద్రతను సాధించగలిగినట్లు చెప్పింది.

తన భవిష్యత్తును భద్రపరచుకోవడానికి,తన కెరీర్ లక్ష్యాల సాధనకు ఈ డబ్బును ఉపయోగిస్తానని లారా చెబుతోంది. నేను జీవితానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను..డబ్బు గురించి చింతించకుండా ఇప్పుడు నా ఆశయాలపై దృష్టి పెట్టగలను అని లారా చెప్పింది. ఈ నిర్ణయానికి మొదట్లో తన తల్లిదండ్రులు షాక్ అయ్యారని, కానీ తర్వాత వారు కూడా అంగీకరించారని లారా తెలిపింది. తాను స్వతంత్ర మహిళనని, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలో ఎవరూ చెప్పలేరని లారా తెలిపింది.
హాలీవుడ్ సెలబ్రిటీతో ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ముందు తనకు అగ్ర వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల నుండి ఆఫర్లు వచ్చాయని లారా చెప్పింది. ఒప్పందాన్ని పూర్తి చేయడానికి లారా తన కన్యత్వాన్ని నిర్ధారించడానికి కొనుగోలుదారు ముందు మెడికల్ టెస్ట్ చేయించుకుంది. మొత్తం ప్రక్రియను గోప్యంగా ఉంచారు.
భారతదేశం వంటి దేశాలలో వివాహ విషయాల్లో కన్యత్వాన్ని తరచుగా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు, కానీ పాశ్చాత్య సమాజాలలో కొంతమంది మహిళలు దీనిని విలువైన ఆస్తిగా చూడటం ప్రారంభించారు. లౌరా నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది కన్యత్వాన్ని అమ్ముకోవడం తప్పు అని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు అది పర్శనల్ ఛాయి అని కామెంట్లు పెడుతున్నారు. ఈ రోజుల్లో ప్రజలు తమ నైపుణ్యాలను,ప్రతిభను అమ్ముకుంటున్నారని కాబట్టి లారా డబ్బు సంపాదించడానికి తన దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
లారా కేసు నేటి ప్రపంచంలో వ్యక్తిగత ఎంపికలు, ఆర్థిక అవసరాలు, సాంస్కృతిక విలువలు ఎలా మారుతున్నాయో చూపిస్తుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. డబ్బుకోసం ఎంతకైనా దిగజారుతున్న రోజులివని.. ప్రేమ, పెళ్లి పేరుతో కొంతమంది ధనవంతులను మోసం చేస్తున్నారు.. వన్ నైట్ స్టాండ్ పేరుతో కొందరు అమ్మాయిలు రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోతున్నారని ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications