Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ఉమా తెలుగు ట్రావెలర్..ప్రయాణికులకు పండగే!
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణ ప్రియులకు అత్యంత సుపరిచితమైన పేరు ఉమా తెలుగు ట్రావెలర్. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలను మన కళ్ల ముందు ఉంచుతూ ప్రయాణానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని అందిస్తూ లక్షలాది మందికి మార్గదర్శకుడిగా నిలిచారు. కేవలం వ్లాగర్ గానే కాకుండా, ఒక నమ్మకమైన స్నేహితుడిలా ప్రతీ ఒక్కరి ప్రయాణ కలను నిజం చేయాలనే తపనతో ఆయన ఇప్పుడు ఒక కొత్త ముందడుగు వేశారు. tripate పేరుతో ట్రావెల్ కంపెనీ పెట్టాడు.
గత 5 ఏళ్లుగా తనకు మిత్రుడుగా ఉన్న తమిళ ట్రెక్కర్ యూట్యూబ్ ఛానెల్ ని నడుపుతున్న బోనీ అనే వ్యక్తితో కలిసి చెన్నైలో ఈ ట్రావెల్ కంపెనీని ఉమా పెట్టాడు. గ్రూప్ టూర్ మేనేజర్లు, వీసా ఎక్స్ పర్ట్స్ తో సహా మొత్తం 10 మంది స్టాఫ్ ని కూడా ఈ కంపెనీ నియమించుకున్నారు. సంవత్సరాలుగా ప్రపంచంలోని ఎన్నో దేశాలు పర్యటించిన ఉమా, సామాన్య ప్రయాణికులు ఎదుర్కొనే సవాళ్లను దగ్గర నుంచి గమనించారు. వీసా ప్రక్రియలోని సంక్లిష్టత, సరైన బస దొరకకపోవడం, బడ్జెట్ కు తగిన ప్రణాళిక వేసుకోలేకపోవడం, స్థానిక ప్రదేశాలపై అవగాహన లేకపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు చాలా మందిని ప్రయాణాలకు దూరం చేస్తున్నాయని గ్రహించారు.

తన అనుభవాన్ని రంగరించి ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారంగా నమ్మకమైన సేవలను అందించాలనే సంకల్పంతో ట్రావెల్ కంపెనీకి ఉమా శ్రీకారం చుట్టారు. భాషతో సంబంధం లేకుండా ఎవ్వరైనా తమ కంపెనీ అందించే సర్వీస్ లను ఉపయోగించుకోవచ్చని ఉమా చెబుతున్నారు.
Tripate అందించే ప్రధాన సేవలు
అన్ని దేశాలకు విజిటింగ్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, బిజినెస్ వీసాలకు సంబంధించిన సర్వీసులను ఉమా స్థాపించిన ట్రిప్పేట్(tripate)కంపెనీ అందిస్తుంది. వీఎఫ్ఎస్ కి సంబంధించిన అపాయింట్ మెంట్స్, వీసాకు సంబంధించిన డాక్యుమెంట్స్ విషయంలో, అప్లికేషన్ పూర్తి చేయడం వంటి అన్నీరకాల సేవలను తమ కంపెనీ అందిస్తుందని ఉమా చెప్పారు. పాస్ పోర్ట్ అప్లయ్ చేసే సర్వీసుని కూడా తమ కంపెనీ అందిస్తుందన్నారు. దీనికి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా తమ కంపెనీ వెబ్ సైట్,కస్టమర్ కేర్ నెంబర్ 9709708777ని సంప్రదించవచ్చని చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో తన మిత్రుడు బోనీతో కలిసి గ్రూప్ టూర్స్ ని ప్రారంభించబోతున్నట్లు ఉమా చెప్పాడు. తక్కువ బడ్జెట్ లో విదేశాలకు ప్రయాణించాలనుకునేవాళ్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తామంటున్నారు. స్వయంగా తామే గ్రూప్ టూర్స్ కి ప్రయాణికులను తీసుకెళ్తామని, తమతో వస్తే ప్రయాణికులకు మరింత జాలీగా ఉంటదని అంటున్నారు. ఒక నమ్మకమైన వ్యక్తి పర్యవేక్షణలో, ఆయన అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకున్న ప్రయాణ ప్రణాళికలతో ప్రపంచాన్ని చుట్టిరావాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. ఇక మీ ప్రపంచయాత్ర కలను సాకారం చేసుకోవడానికి ఒక నమ్మకమైన మార్గదర్శి తోడుగా ఉన్నట్లే



Click it and Unblock the Notifications