గోవా,బ్యాంకాక్ ని మైమరిపించే టూరిస్ట్ ప్లేస్..హైదరాబాద్ కు కొద్ది దూరంలోనే..కేక అంతే

హైదరాబాద్ లో నివసించే ప్రజలు వీకెండ్ లో లేదా సెలవుల సమయంలో దగ్గర్లోని ఏదైనా ప్లేస్ కి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అనంతగిరి హిల్స్, చార్మినార్ బజార్, గోల్కొండ,సిద్దిపేట చేరువు. వాస్తవానికి తెలంగాణలో అది కూడా హైదరాబాద్ కి 150 కి.మీ దూరంలో అద్భుతమైన టూరిజం ప్లేస్ ఉంది. చాలామందికి దీని గురించి తెలియదు. అదే వైజాగ్ కాలనీ.

ఇక్కడకి ఒక్కసారి వెళ్లారంటే గోవా,బ్యాంకాక్ అక్కర్లేదు..ఇది చాలురా బాబు అన్నంత ఫీలింగ్ వస్తుందని అక్కడికి వెళ్లి వచ్చిన పర్యాటకులు చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందిన విజయేందర్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇటీవల తన ఫ్యామిలీ,ఫ్రెండ్స్ తో కలిసి వైజాగ్ కాలనీని సందర్శించి అక్కడి విశేషాలను, ఆయన అనుభవాలను విజయేందర్ రెడ్డి బోల్డ్ స్కై తెలుగుతో పంచుకున్నారు.

unexplored mini island near hyderabad software engineer shares his experient visiting vizag colony

వైజాగ్ కాలనీ ఎక్కడ ఉంది
నల్లొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని చందంపేట,నేరేడుగొమ్మ మండలాల్లో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ కలిసి ఉంటుంది. చందంపేట మండలంలో ఈ వైజాగ్ కాలనీ ఉంది.

ఇక్కడ ఏంటీ స్పెషల్

నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఇక్కడ ప్రవహిస్తుంది. ఇక్కడకి వెళ్తే ఏదో లడఖ్ కి వెళ్లినట్లుగా,గోవా వెళ్లినట్లుగా ఫీలింగ్ వస్తుందని విజయేందర్ రెడ్డి చెప్పారు. ఇక్కడ పర్యాటకుల సదుపాయం కోసం బోటింగ్ ఉందని చెప్పారు. ఒక బోటులో 10మంది వరకు ఎక్కడానికి వీలు ఉంటుందని..1 గంట పాటు బ్యాక్ వాటర్స్ లో బోటులో తిప్పి దగ్గర్లోని ఐలాండ్ కు తీసుకెళ్లి కొద్దిసేపు అక్కడ తిరిగేందుకు వదులుతారని విజయేందర్ రెడ్డి చెప్పారు. 1 గంట సమయం తర్వాత మళ్లీ బోటులో తిరిగి తీసుకెళ్తారని చెప్పాడు. ఇందు కోసం ఒక్కో బోటుకి రూ. 1000 వసూలు చేస్తారు. అయితే ఎక్కవ సమయం సేపు ఐలాండ్ లో ఆగాలి అంటే దీనికి కొంచెం ఎక్కువ మనీ తీసుకుంటారని చెప్పాడు.

పార్టీలు,ఫుడ్ కి ప్రత్యేకంగా

అయితే ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే భోజనం, డ్రింక్స్ వంటి మొత్తం స్థానికంగా ఉండే ఇళ్లలోని వ్యక్తులే ఏర్పాట్లు చేస్తారు. ఫుడ్ ఏది కావాలో అప్పటికప్పుడు చెప్పినా వండి ఇస్తారు,ముందుగానే వాళ్లకి ఫోన్ ద్వారా చెప్పినా కూడా మీరు వెళ్లే టైంకి రెడీ చేసి పెడతారని విజయేందర్ రెడ్డి చెప్పారు. ఇక్కడ చేపలు బాగా ఫేమస్ అని, బ్యాక్ వాటర్స్ లో పట్టిన చేపలు ఫ్రెష్ గా ఉంటాయని ,వాటితో స్థానికులు రెడీ చేసి ఇచ్చే కర్రీ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. బోటులోనే లైవ్ లో ఫిష్ లు పట్టి కర్రీ చేసి కూడా చేస్తారని, ఇందుకోసం కొంచెం ఎక్స్ ట్రా మనీ తీసుకుంటారని విజయేందర్ రెడ్డి చెప్పారు. నాటుకోడి మాంసం కూడా ఇక్కడ లభిస్తుందని, బోటింగ్ సమయంలో బోటులో కూర్చొని ఫుడ్ ని ఆస్వాదించడం అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందని తెలిపారు.

unexplored mini island near hyderabad software engineer shares his experient visiting vizag colony

మైండ్ రిల్సాక్
వీకెండ్ టైంలో ఇక్కడికి రావడం తనకు చాలా అద్భుతమైన ఫీలింగ్ ఇచ్చినట్లు విజయేందర్ రెడ్డి చెప్పారు. వారంలో 5 రోజులు ఆఫీసులో పడిన కష్టం అంతా ఇక్కడికి వచ్చాక 5 నిమిషాల్లోనే మర్చిపోయినట్లు చెప్పారు. ఈ ప్లేస్ కి హైదరాబాద్ నుంచి కారులో అయితే 2 గంటల్లోనే చేరుకోవచ్చని, ఖర్చు తక్కువ,ఆనందం ఎక్కువ అని తెలిపారు.

ఖర్చు ఎంత
హైదరాబాద్ లో ఒక ఫ్యామిలీ మాల్ కి వెళ్లి సినిమా చూసినంత ఖర్చుతో వైజాగ్ కాలనీ వెళ్లి రావచ్చని విజయేందర్ రెడ్డి చెప్పారు. ఈ ప్లేస్ కి ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి ఎంజాయ్ చేసి రావడానికి రూ.5వేల లోపే ఖర్చవుతుందని చెప్పారు. వైజాగ్ కాలనీకి ఉదయం లేదా సాయంత్రం సమయంలో వెళ్లేటట్లయితే దారిలో గౌడన్నలు తాటిచెట్ల మీద నుంచి కల్లు తీస్తూ కనబడుతుంటారని..వారి దగ్గర లభించే ఫ్రెష్ కల్లు తాగుతూ ఫ్యామిలీ,ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయవచ్చని చెప్పారు.

నైట్ స్టేయింగ్

వైజాగ్ కాలనీలో నైట్ స్టే చేయడానికి కూడా సదుపాయలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ టెంటెడ్ అకాండేషన్ కూడా ఉందని..ఒక్క టెంటులో ముగ్గురు వ్యక్తులు ఉండవచ్చని..టెంటుకి ఒక రాత్రికి రూ.1000 వసూలు చేస్తారని చెప్పారు. వసతి సౌకర్యాలు,ఫుడ్ ఏర్పాట్లు వంటి మరిన్ని వివరాల కోసం స్థానికంగా నివసించే శ్రీనివాస్ అనే బోటు యజమాని ఫోన్ నెంబర్..9390598072కు కాల్ చేసి అడగచ్చు.

Desktop Bottom Promotion