Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
2026 బడ్జెట్ ఎఫెక్ట్..ఏది పెరుగుతుంది? ఏది తగ్గుతుంది?
కేంద్ర బడ్జెట్ 2026-27ను ఇవాళ(ఫిబ్రవరి 1,2026) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన 2026 కేంద్ర బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు.. ఇది మన రోజువారీ ఖర్చులను, జీవనశైలిని నేరుగా ప్రభావితం చేసే అనేక కీలక మార్పులను తనలో నింపుకుంది.
ఎలక్ట్రానిక్స్ నుండి మందుల వరకు, విదేశీ ప్రయాణాల నుండి విలాసాల వరకు.. ఈ బడ్జెట్ ప్రకారం ఏది పెరుగుతుంది,ఏది తగ్గుతుందో ఇక్కడ చూడండి.

విదేశీ ప్రయాణాలు,విద్య
మీ పిల్లలను విదేశాల్లో చదివించాలనుకుంటున్నారా? లేదా కుటుంబంతో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ బడ్జెట్ మీకు శుభవార్త అందించింది. విదేశీ టూర్ ప్యాకేజీలు, విదేశీ విద్య చెల్లింపులపై వసూలు చేసే టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(TCS) రేట్లను ప్రభుత్వం తగ్గించింది.
దీనివల్ల విదేశీ విద్య పూర్తిగా చౌకగా మారకపోయినా, ముందస్తుగా పన్ను రూపంలో కట్టాల్సిన భారీ మొత్తాలు తగ్గుతాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా కాస్త వెసులుబాటును కల్పిస్తుంది.
ఆన్ లైన్ షాపింగ్,ఇంపోర్ట్స్
విదేశాల నుంచి వ్యక్తిగత వస్తువులను తెప్పించుకునే వారికి ఇది నిజంగా జాక్ పాట్. వ్యక్తిగత దిగుమతులపై ఇప్పటివరకు ఉన్న 20 శాతం కస్టమ్స్ సుంకాన్ని భారీగా 10 శాతానికి తగ్గించారు.
మీరు విదేశాల నుండి ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు లేదా బహుమతులు ఆర్డర్ చేసినప్పుడు కస్టమ్స్ అధికారుల పన్ను బాదుడును చూసి ఇక భయపడాల్సిన పనిలేదు.
ఎలక్ట్రానిక్స్
స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఫ్రిజ్ లు, ఓవెన్ ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై కస్టమ్స్ సుంకాన్ని హేతుబద్ధీకరించారు. దీనివల్ల కంపెనీలకు తయారీ ఖర్చు తగ్గుతుంది.
ఫలితంగా పోటీ మార్కెట్ లో వినియోగదారులకు తక్కువ ధరకే కొత్త మోడల్ ఫోన్లు, గృహోపకరణాలు లభించే అవకాశం ఉంది. ధరలు అమాంతం తగ్గకపోయినా, కొత్తగా పెరగకుండా కళ్లెం వేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఆరోగ్యంపై భరోసా
ఈ బడ్జెట్ లో అత్యంత మానవీయ కోణం ఇదే. 17 రకాల ప్రాణాంతక క్యాన్సర్ మందులు, అరుదైన వ్యాధుల ట్రీట్మెంట్ లో వాడే ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయించారు.
దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతూ, మందుల ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలకు ఇది ఎంతో పెద్ద ఊరట. ట్రీట్మెంట్ ఖర్చులను అందుబాటులోకి తేవడంలో ఇది కీలక ముందడుగు.

గ్రీన్ ఎనర్జీ..సోలార్,EVలకు ప్రోత్సాహం
భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీల తయారీకి అవసరమైన పరికరాలపై పన్ను మినహాయింపులు ఇచ్చారు.
ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, పెట్రోల్, డీజిల్ ధరల మంట నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఎలక్ట్రిక్ వాహనాలను, సోలార్ విద్యుత్ ను మరింత చేరువ చేస్తుంది.
చెడు అలవాట్లు,విలాసాలకు మాత్రం మోత
మరోవైపు ప్రభుత్వం కొన్నింటిపై కఠినంగా వ్యవహరించింది. మద్యం, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెరగనున్నాయి. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఖరీదైన వాచీలు, ఇతర లగ్జరీ వస్తువుల ధరలు కూడా ప్రియం కానున్నాయి.
నిత్యావసరాలకు మినహాయింపులు ఇచ్చి, విలాసాలకు వాత పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉంది.
ట్రేడర్లకు షాక్,కఠిన నిబంధనలు
స్టాక్ మార్కెట్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(F&O)ట్రేడింగ్ చేసేవారిపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) భారం పడనుంది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ను తగ్గించాలన్నది సర్కార్ ప్లాన్.
అంతేకాకుండా ఆదాయాన్ని తప్పుగా చూపించినా, ఆస్తుల వివరాలు దాచినా ఇకపై భారీ జరిమానాలు తప్పవు. పన్ను నిబంధనల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఇది సూచిస్తోంది.
బడ్జెట్ తీర్పు ఏంటి?
2026 బడ్జెట్ సామాన్యుడి వాలెట్ ను తెలివిగా రీ డిజైన్ చేస్తోంది. ఇది మందులు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి అవసరమైన వాటికి రాయితీలు ఇస్తూనే.. విలాసాలు, స్పెక్యులేషన్లపై పన్నులు పెంచింది.



Click it and Unblock the Notifications