Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆ దేశంలో ప్రజలు బూడిదతో స్నానం చేస్తారు.. ఎందుకంటే?
ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ స్నానం చేస్తూ ఉంటాము. అదే ఒక్కరోజు స్నానం చేయకపోతే ఒళ్ళంతా వాసన వచ్చేస్తుంది. అదే రెండు లేదా మూడు రోజు స్నానం చేయకుండా ఉంటే.. ఇక అంతే పిచ్చెక్కిపోతుంది. అయితే ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నట్లే ఎన్నో రకాల ఆచారాలు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా మంది ఇప్పటికీ స్నానం చేయడానికి ఇసుక, బూడిద వాడుతున్నారు.
కొందరైతే పదుల రోజులు స్నానం చేయకుండా ఉంటున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఇలాంటి వింత పద్దతులను పాటించే దేశాలు ఏంటి, ఆ ప్రజలు ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

అరుదుగా స్నానం చేయడం..
- మన దేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇథియోపియాలాంటి కొన్ని దేశాల్లో నీటి కొరత అధికంగా ఉంటుంది. దీని కారణంగా అక్కడి ప్రజలు వారానికి లేదా పదిరోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు
- నేపాల్‌లో హిమాలయాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. దీని కారణంగా అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు పది రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు.
- నీళ్లు లేకపోవడం వల్ల స్నానం చేయకపోవడం సహజమే. కానీ పుపువా న్యుగినియాలోని కొన్ని గిరిజన తెగలు నది ప్రవాహం ఉన్నప్పటికీ స్నానం చేయడానికి ఆసక్తి చూపరు. కొందరు ఆసక్తి ఉన్నవారు 15 రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు.
ప్రత్యామ్నాయ పద్ధతులు..
- భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉండే గిరిజన ప్రజలు.. స్నానం చేసేసమయంలో సబ్బుకు బదులుగా మట్టిని వినియోగిస్తూ ఉంటారు. దీనివల్ల క్రీములు చనిపోవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని భావిస్తుంటారు.
- ఆఫ్రికాలో నీటి కొరత కొంచెం అధికంగానే ఉంటుంది. దీని కారణంగా ఆ ఖండంలోని చాలా తెగల ప్రజలు.. స్నానం చేసేటప్పుడు ఇసుక లేదా బూడిదను వాడుతుంటారు.
- అమెజాన్ అడవుల్లో కొన్ని తెగల ప్రజలు నివసిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రజలకు నీటి వనరు పుష్కలంగా ఉన్నప్పటికీ, మొక్కల ఆకుల ద్వారానే శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు.
మతపరమైన, సాంస్కృతిక స్నానాలు..
- మన దేశంతో పాటు కొన్ని దేశాల్లో మతపరమైన సాంస్కృతిక స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఆ విధంగానే టిబెట్‌లో బౌద్ధులు కూడా ఎక్కువగా మతపరమైన స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తారు.
- ఆఫ్రికాలో కొన్ని తెగలు స్నానాలు చేయకుండా ఉంటారు. అయితే కొంతమంది ప్రజలు మాత్రం స్నానం చేయడం అనేది పవిత్రంగా భావిస్తారు. స్నానం చేయడం పాశ్చాత్య సంస్కృతి అని భావిస్తూ ఉంటారు. సాంప్రదాయ పద్దతుల ద్వారా స్నానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
- మన దేశంలోని అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు.. స్నానం చేయడం అనేది ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావిస్తూ ఉంటారు. రోజూ స్నానం చేయడాన్ని ఒక దినచర్యగా పాటిస్తుంటారు.
గమనిక: పైన పేర్కొన్నట్లు ప్రతీ దేశంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయని మేము చెప్పడం లేదు. పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా ఈ విషయాలను మీకు అందించడం జరిగింది. వీటిని కచ్చితంగా మీరు నమ్మండి అని మేము చెప్పడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications