Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అనంత్ అంబానీ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..? పైకి కనిపించేంత అమాయకుడు కాదు..!
అనంత్ రాధికా అంబానీల పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం. అనంత్ అంబానీ చాలా లావుగా, చిన్నపిల్లాడి మనస్తత్వం, ఏ ప్రత్యేకతలు లేని వాడిగా కనిపిస్తాడు. చూడగానే అంత అందగాడు కాదు, మాటలతో కూడా ఆకట్టుకోలేడని అనుకుంటారు. ఐపీఎల్ మ్యాచులను ఎక్కువగా చూస్తూ అనంత్ అంబానీ మనకు కనిపిస్తాడు. అనంత్ అంబానీ అనగానే అందరూ లైఫ్ సెటిల్ అనుకుంటారు. తండ్రి కోటీశ్వరుడు కాబట్టి ఏ పనీ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. సినీతారలతో కలిసి డిన్నర్ చేసేయొచ్చు, ఏదేశమంటే ఆ దేశం తిరిగేయొచ్చు అని అనుకుంటారు.

అనంత్ అంబానీ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు. సమాజంపైన అతనికి అవగాహన కూడా చాలా విస్తృతంగా వుంది. చాలా మంది ధనవంతులు వివాహం కోసం విదేశాలకు వెళ్లిపోతుంటే అనంత్ అంబానీ మాత్రం తన సొంత ఊరైన గుజారాత్‌లోని జామ్‌నగర్‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. మాతృభూమి, కర్మ భూమిని తాను ఎప్పుడూ మర్చిపోనని అంటున్నాడు. అనంత్‌లో తరచి చూస్తే బాధ్యగల మంచి మనిషి మనకు కనిపిస్తాడు.
జామ్‌నగర్‌లోని 3వేల ఎకరాల్లో ఒక సంరక్షణా కేంద్రాన్ని నెలకొల్పాడు. ఈ కేంద్రంలో వేటగాళ్ల చేతిలో దెబ్బతిన్న వన్యప్రాణులకు ఇక్కడ చికిత్సను అందిస్తున్నాడు. వాటికి పునరావాసాన్ని కూడా కల్పిస్తున్నాడు. ఈ సంరక్షణా కేంద్రానికి స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ వంతారా అని నామకరణం కూడా చేశాడు. జామ్ నగర్‌లోని రిలాయెన్స్ రిఫైనరీలో జూను నెలకొల్పటంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ సంరక్షణా కేంద్రంలో సుమారు 200ల ఏనుగులు, 100 రకాలు జంతువులు వున్నాయ్. వీటిని జాగ్రత్తగా చూసుకోవడానికి 3వేల మంది సిబ్బంది వున్నారు. ఈ జూ తన తల్లిదండ్రుల కలల రూపమని అనంత్ అంబానీ స్వయంగా అన్నాడు. ఈ జూ సంరక్షణ విషయంలో చేపట్టాలసిన పనులు ఇంకా చాలా వరకు వున్నాయని అన్నాడు.
జంతు సంరక్షణతో పాటు అనంత్ అంబానీలో ఇంకా చాలా మంచి గుణాలు వున్నాయ్. మాతృ భూమి అంటే అనంత్ అంబానీకి చాలా ప్రేమ, అభిమానం. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారు తమ పెళ్లిల్లను విదేశాల్లో ఘనంగా చేసుకోవాలని నిర్ణియించుకుంటారు, కానీ అనంత్ అంబానీ మాత్రం తన పెళ్లిని జామ్‌నగర్‌లోనే చేసుకోవాలని నిర్ణియించుకున్నాడు. జామ్ నగర్ అనేది కేవలం ఊరు మాత్రమే కాదని ఇది తన తండ్రి జన్మభూమి, తనకు కర్మ భూమి అని చెప్పుకొచ్చాడు.

దేవుడు మతం లాంటి విషయాల్లో కూడా అనంత్ కు మంచి అవగాహన వుంది. భగవద్గీతను తొమ్మిది సార్లు చదివానని, దేవుడు అంతటా వుంటాడని తాను బలంగా నమ్ముతానని ఒక ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ తెలిపాడు. సనాతన ధర్మాన్ని ఆచరించే కుటుంబంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నట్టు అనంత్ అంబానీ చెప్పాడు.
పైకి అందరికీ కనిపించే అనంత్ వేరు లోపల వున్న అనంత్ వేరు అని మనకు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ చేపట్టే సేవా కార్యక్రమాలను ముందు తీసుకెళ్లడంలో అనంత్‌కు మించి ఇంకెవ్వరూ వుండరనే విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పవచ్చు. అనంత్ అంబానీ అనంతమైన సేవా కార్యక్రమాలను మున్ముందు మరెన్నో చేపట్టాలని కోరుకుందాం.



Click it and Unblock the Notifications