Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చెంట్ గురించి ఈ విషయాలు తెలుసా..?
అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చెంట్ ఎవరు ? ఆమె ఆస్థుల విలువ, కంపెనీల గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. అనంత్ అంబానీ రాధికా పెళ్లి వేడుక సందర్భంగా దేశంలో అంతటా ఇప్పుడు వీరి పెళ్లి గురించిే తీవ్ర చర్చ జరుగుతోంది. ఈరోజు జులై 12న వీరి వివాహం మూడు రోజుల వరకు కొనసాగుతోంది. ఈ పెళ్లికి సుమారు 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు ప్రపంచంలో వున్న సెలబ్రెటీలు, రాజకీయ నాయకులందరూ అనంత్ రాధికా అంబానీల పెళ్లివేేడుకకు హాజరయ్యారు. మరి రాధికా మర్చెంట్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను చెబుతున్నాం.

రాధికా మర్చెంట్ 1994, డిసెంబర్ 19వ తేదీన విరేన్ మర్చంట్ దంపతులకు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో జన్మించారు. రాధికా మర్చెంట్ తండ్రి విరేన్ మర్చెంట్ పెద్ద వ్యాపారి. ఆయనకు కొన్ని వేల కోట్ల ఆస్థి వుంది. ఎన్‌కోర్ హెల్త్ కేర్ కంపెనీకి విరేన్ మర్చంట్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌కోర్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్‌కోర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, మొదలగు కంపెనీలకు డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. రాధికా తల్లి షైలా మర్చంట్ కూడా ఎన్‌కోర్ హెల్త్ కేర్ సంస్థలకు మ్యానేజింగ్ డెరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌కోర్ వెంచర్స్‌లో పార్ట్‌నర్‌గా కూడా ఆమె కొనసాగుతున్నారు.
రాధికా మర్చంట్ పెరిగిందంతా ముంబైలోనే. అక్కడే ఆమె చదువు కూడా పూర్తైంది. వ్యాపార కుటుంబం కావడం వల్ల రాధికా మర్చెంట్‌కు చిన్నప్పటి నుంచే పెద్ద వ్యాపారవేత్త కావాలని కోరిక వుండేది. అమెరికాలోనే న్యూయార్క్ యూనివర్సిటీ పొలికల్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీని పూర్తి చేశారు. తరువాత 2016లో ముంబైకు తిరిగి వచ్చి బిజినెస్ మెలకువలను నేర్చుకున్నారు. అదే సంవత్సరంలో ఎన్‌కోర్ హెల్త్‌కేర్ డైరెక్టర్లలో ఒకరుగా ఎంపికయ్యారు. కంపెనీలో కొత్త స్ట్రాటజీలను ప్రవేశపెట్టి వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్లారు.

రాధికా మర్చెంట్ మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఎనిమిది సంవత్సరాల పాటు ఆమె భరతనాట్యాన్ని నేర్చుకున్నారు. రాధికా మర్చెంట్‌కు జంతువులంటే చాలా ఇష్టం. జంతు సంరక్షణకు సంబంధించిన ఒక సంస్థను కూడా ఆమె నడుపుతున్నారు. సామాజిక సేవలంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. ఒక ఎన్జీవో ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.
రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ చిన్న వయసు నుంచే మంచి స్నేహితులు, కొన్నాళ్ల తరువాత ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చారు. అనంత్ అంబానీ కన్నా రాధికా మర్చంట్ వయసులో 4 నెలలు పెద్దకావడం గమనార్హం.



Click it and Unblock the Notifications