Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్‌లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
తండ్రి పవర్‌స్టార్ సినిమాకు ఫైట్ మాస్టర్.. విక్కీ కౌషల్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు..!
విక్కీ కౌషల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ బాలీవుడ్ నటుడి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలను తెలుసుకుందాం. తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్నారు విక్కీ కౌషల్. మే 16వ తేదీన విక్కీ 36 ఏళ్ల వయసులో అడుగుపెట్టనున్నారు.
విక్కీ కౌషల్ గురించి ఆసక్తికరమైన విషయాలు :
గ్లామర్ ఇండస్ట్రీలోకి రాకముందే విక్కీ కౌషల్ తన చదువును పూర్తి చేశాడు. 2009లో ముంబైలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. తరువాత యాక్టింగ్‌పై మక్కువతో నమిత్ కపూర్ అకాడమీలో చేరి నటనపై ట్రైనింగ్ తీసుకున్నాడు.
మంచి నటుడిగా గుర్తింపుపొందే ముందు అనురాగ్ కష్యప్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ (2012) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. యాక్టింగ్, దర్శకత్వంలో పాటు వీణను వాయించే నైపుణ్యం కూడా విక్కీకి ఉంది.

విక్కీ కౌషాల్ మొదటి సినిమా 20012లో లవ్ షువ్ తే చికెన్ కురానా. 2018 ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో 30 ఏళ్ల వయసున్న 30 మందిలో చోటు సంపాదించుకున్నాడు. అటు నటనతో పాటు ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేయడానికి డైట్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాడు.
విక్కీ కౌషాల్ సోదరుడు సన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తన సోదరుడి ఇండస్ట్రీలో తనవంతుగా సహకరిస్తున్నాడు. బాలీవుడ్‌లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నవారిలో ఒకడిగా గుర్తింపు పొందాడు.
వ్యక్తిగత విషయాలకు వస్తే విక్కీ కౌషల్ ముందుగా హర్లీన్ సేతితో డేటింగ్ చేసి తరువాత మాలవికా మోహన్‌ను ప్రేమించాడని రూమర్స్ వ్యాపించాయ్. కానీ 2021 డిసెంబర్ 9న కత్రినా కౌఫ్‌ను వివాహం చేసుకున్నారు.
విక్కీకౌషల్‌కు నీళ్లంటే భయం.. తన తొలి సినిమా 2015లో వచ్చిన మాసన్ మూవీ వరకు ఎలా ఈతకొట్టాలో కూడా తెలియదని సన్నిహితులు చెబుతారు. హారర్ సినిమాలు చూడటానికి కూడా విక్కీ కౌషల్ భయపడతాడట.
విక్కీ కౌషల్ తండ్రి శ్యామ్ కౌషల్ బాలీవుడ్‌లో యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాన్ సినిమాకు యాక్షన్ఱ డైరెక్టర్‌గా శ్యామ్ కౌషల్.
విక్కీ కౌషల్ 1988 మే 16న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. 2012 నుంచి సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2019లో ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ సినిమాకు గాను విక్కీ కౌషాల్‌కు నేషనల్ ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. ఇండస్ట్రీలోకి వచ్చిన 12 ఏళ్లలోనే టాప్ యాక్టర్ లిస్ట్‌లో చేరిపోయాడు.

అటు సినిమాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. కరోనా సమయంలో ప్రధానమంత్రి నిధికి రూ.1 కోటి ఆర్థిక సాయాన్ని అందించారు. సెకండ్ వేవ్ సమయంలో బాలీవుడ్ ఆర్టిస్టులకు రూ.2.5 లక్షల సహకారాన్ని అందించారు.
2021లో రిలీజ్ అయిన సర్దార్ ఉద్దమ్ సింగ్ సినిమా అతని కెరీర్‌లో ఉరి తరువాత మంచి పేరును సంపాదించుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉద్దం సింగ్ పాత్రలో కౌషల్ అందరినీ మెప్పించడు. ఈ సినిమాకోసం 15 కిలోల బరువును తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 2019లో రిలీజ్ అయిన ఉరి సినిమా కోసం ప్రత్యేకంగా 5 నెలలు మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాడు. దీంతో పాటు కరాటే కూడా నేర్చుకున్నాడు. షూటింగ్ సమయంలో గాయాలు కూడా అయ్యాయ్. ప్రపంచ వ్యాప్తంగా ఉరి భారీ కలెక్షన్లను సంపాదించింది.



Click it and Unblock the Notifications