Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
BIGG BOSS-8: బిగ్‌బాస్-8 విన్నర్ నిఖిల్‌కు ఎన్ని డబ్బులు వచ్చాయో తెలుసా?.. నిఖిల్ తెలుగు వాడు కాదా?
తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్ నిలిచారు. ఇంట్లో మొత్తం 105 రోజులు ఉన్న నిఖిల్ 21 మంది కంటెస్టెంట్లను వెనక్కి బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచారు. ఫినాలేలో తనకు గట్టి పోటీని ఇచ్చిన గౌతమ్‌ను ఓడించి 54 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీతో పాటు మారుతి సుజుకి కారు, ట్రోఫీని సొంతం చేసుకున్నారు. అసలు ఇంతకీ ఈ నిఖిల్ ఎవరు? ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చారు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిఖిల్ ఎవరంటే?
నిఖిల్ పూర్తి పేరు నిఖిల్ మాలియక్కల్. ఇతను కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించారు. నిఖిల్ తండ్రి ఒక జర్నలిస్ట్. తల్లి కన్నడ నటి. తల్లిదండ్రులిద్దరూ మీడియా ఇండస్ట్రీలో ఉండడంతో నిఖిల్‌కు కూడా నటనపై ఆసక్తి పెరిగింది. దీంతో స్కూల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అలాగే డ్యాన్స్ పోటీల్లో పాల్గొనడం, నటనలో పాల్గొనడం వంటి చేశేవారు. ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో విద్యను పూర్తి చేసిన నిఖిల్.. నటనపై తన అభిరుచిని పదును పెట్టుకుంటూ వచ్చారు.

వెండితెర పరిచయం
విద్య పూర్తయిన తరువాత నిఖిల్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. కానీ ఉద్యోగంలో ఆసక్తి లేకపోవడంతో ఉద్యోగాన్ని వదిలేసి.. ఇండస్ట్రీలో తన జీవితాన్ని వెతుక్కోవాలని వేట మొదలుపెట్టారు. నిజానికి నిఖిల్ ఇండస్ట్రీకి డ్యాన్సర్ అవుదామని వచ్చారు. ఈ క్రమంలోనే పలు ఈవెంట్‌లు కూడా నిర్వహించారు. దీంతో పాటు విలన్‌గా నటించాలని ప్రయత్నించారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్నట్లు కన్నడకు చెందిన ఊటీ చిత్రంతో వెండితెరకు పరిచయమన్నారు. ఆ మూవీలో సహాయనటుడిగా కీలకమైన పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు.
మలుపు తిప్పిన తెలుగు సీరియల్స్
ఊటీ చిత్రం తరువాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్న నిఖిల్‌కు 'మానై మంత్రాలయ' అనే సీరియల్ బ్రేక్ ఇచ్చింది. ఈ సీరియల్‌తో నిఖిల్ జీవితం టర్న్ అయ్యింది. ఈ సీరియల్‌తో కన్నడ ప్రజలకు ఆయన ఎంతగానో చేరువయ్యారు. ఆ తరువాత స్టార్ మాలో గోరింటాకు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సీరియల్ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత 'అమ్మకు తెలియని కోయిలమ్మ' సీరియల్ కూడా నటించి మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు.
మొదటి నుంచే కింగ్..
బిగ్‌బాస్-8లో రెండో కంటెస్టెంట్‌గా వచ్చిన నిఖిల్ మొదటి నుంచే టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ వచ్చారు. ఇంట్లో ఇచ్చిన ప్రతి టాస్కులోనూ గట్టి పోటీ ఇచ్చారు. అలాగే నామినేషన్లలో మంచి మంచి పాయింట్స్ చెబుతూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ వచ్చారు. అలాగే తన నామినేషన్‌లో కూడా సభ్యులకు మంచిగా సమాధానాలు చెబుతూ.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
విడిపోయిన కంటెస్టెంట్లను దగ్గర చేయడంతో పాటు టాస్కుల్లో రాణించడం, ట్రోలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడం వంటివి నిఖిల్‌కు గొప్ప పేరును తీసుకొచ్చాయి. సహనం కోల్పోకుండా నిఖిల్ ఆట ఆడిన తీరు నిజంగా ప్రశంసనీయమని చెప్పుకోవచ్చు. దీంతో నిఖిల్ బిగ్‌బాస్-8 విజేతగా నిలవడంతో పాటు బిగ్‌బాస్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ 54 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకున్నారు.



Click it and Unblock the Notifications