Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
Jagannath Temple Mysteries: పూరీ జగన్నాథ ఆలయం గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే!
ఒడిషా రాష్ట్రంలోని పూరీలోని జగన్నాథ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది హిందువుల నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం విష్ణుమూర్తి అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది. బలభద్రుడు(అన్న), సుభద్ర (చెల్లి) లతో కలిసి ఇక్కడ కొలువై ఉంటారు.
పూరీ పేరు వినగానే జగన్నాథ ఆలయంలో పాటుగా ప్రతి ఏటా అక్కడ జరిగే రథయాత్ర గుర్తుకొస్తుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పూరీకి వస్తారు. ఈ ఏడాది జూన్ 27 నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవగా..జులై5,2025న ముగుస్తుంది. అయితే పూరీ రథయాత్ర జరుగుతున్న నేపథ్యంలో పూరీ ఆలయం గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను, నిజాలను ఇక్కడ చూడండి.

పూరీ ఆలయం గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే
-పూరీ జగన్నాథ మందిరం బయట నిలబడితే దగ్గర్లోని సముద్రపు అలల శబ్దం గట్టిగా,క్లియర్ గా వినబడుతుంది. అదే మీరు జగన్నాథ ఆలయం సింహద్వారంలోకి అడుగుపెట్టడానే మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఇదొక అద్భుతమనే చెప్పొచ్చు.
-పూరీ జగన్నాథ ఆలయం గోపురం పైన నీలచక్రం అని పిలువబడే ఒక పెద్ద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది అష్టధాతువులతో (8 లోహాలు) తయారు చేయబడింది. పూరీ పట్టణంలో ఏ ప్రదేశం నుండి చూసినా, ఆలయంపై ఉన్న సుదర్శన చక్రం మీ వైపే తిరిగినట్లు కనిపిస్తుంది. ఇది ఆ చక్రం యొక్క ప్రత్యేకత.
-జగన్నాథ ఆలయం మీదుగా పక్షులు ఎగరవు. ఆలయంపై పక్షులు, విమానాలు ఎగరవన్నది ప్రసిద్ధ నమ్మకం, అంతుచిక్కని రహస్యాలలో ఒకటి.
-జగన్నాథ ఆలయం టాప్ లో ఉండే ఓ జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడటం మరో రహస్యం. సాధారణ సైన్స్ కూడా అది అసాధ్యం అని చెబుతుంది..కానీ ఏ శక్తి వల్ల అది ఇలా జరుగుతుందనేది అంతుచిక్కని రహస్యం.
-వేల సంవత్సరాలుగా ఆలయంపైన ఉండే జెండాను మార్చేందుకు పూజారులు ఆలయం పైకి ఎలాంటి గేర్ సాయం లేకుండా ఎక్కుతారు. అయితే ఈ సంప్రదాయం మిస్ అయితే గుడిని 18 ఏళ్ల పాటు మూసివేస్తారంట.
-జగన్నాథ ఆలయం మెయిన్ డోమ్ ఓపెన్ గాను ఉన్నప్పటికీ దాని నీడ కంటికి కనబడదు. ప్రపంచంలో ఏ నిర్మాణం నీడ అయినా కింద కనబడుతుంది. అయితే ఈ ఆలయ డోమ్ నీడ మాత్రం కనబడదు.
-జగన్నాథ ఆలయం దగ్గర ఉన్న 32 కిచెన్స్ ద్వారా ప్రతిరోజూ 2వేల నుంచి 20వేల మందికి ఫుడ్ ని అందిస్తారు. అయితే ఎప్పుడూ కూడా ఒకరికి సరిపడా లేదు అని కానీ లేదా ఫుడ్ వృద్ధా అయినట్లు కానీ ఎక్కడా రికార్డ్ లేదు. అయితే ఇదెలా సాధ్యం అనేది ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. అంత ఖచ్చితంగా ఎలా సరిపోతుందనేది రహస్యమే.



Click it and Unblock the Notifications











