Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రిలాక్సేషన్ కోసం బుక్ చేసుకుంటే.. రక్తం కళ్లచూసింది!..వైరల్ వీడియో చూడండి
డబ్బులుంటే కొండమీద కోతి అయినా దిగి వస్తుందని మన పెద్దలు చెప్పే సామెతలాగానే ఈ రోజుల్లో డబ్బులంటే ఇంట్లో కూర్చొని ఉంటే చాలు ఏది కావాలన్నా దగ్గరకే వచ్చేస్తుంది. ఫుడ్ దగ్గర నుంచి మసాజ్ ల వరకు అన్నీ ఆన్ లైన్ యాప్స్ ద్వారా ఇంటి వద్దకే సేవలు పొందడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది.
కానీ ఒక్కోసారి ఆ సౌకర్యమే మన పాలిట శాపంగా మారుతుందని ముంబైలో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. ప్రశాంతత కోసం మసాజ్ థెరపిస్ట్ ను బుక్ చేసుకున్న ఒక మహిళకు ఆ అనుభవం పీడకలగా మారింది. కేవలం బుకింగ్ రద్దు చేసుకున్నందుకు జరిగిన గొడవ భౌతిక దాడుల వరకు వెళ్ళింది.

అసలేం జరిగింది?
పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్ అయిన 46 ఏళ్ల షెహనాజ్ వాహిద్ సయ్యద్ ముంబైలోని వడాలా ప్రాంతంలో తన 18 ఏళ్ల కొడుకుతో కలిసి నివసిస్తోంది. అయితే జనవరి 21,2026న మధ్యాహ్నాం తన భుజం నొప్పి నివారణ కోసం ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ అర్బన్ కంపెనీ(Urban Company)యాప్ ద్వారా మసాజ్ సర్వీస్ బుక్ చేసుకుంది.
బుకింగ్ చేయడంతో సమయానికి ఒక మహిళా థెరపిస్ట్ వాహిద్ సయ్యద్ ఇంటికి చేరుకుంది. అయితే ఆ థెరపిస్ట్ ప్రవర్తన, ఆమె తెచ్చిన పోర్టబుల్ మసాజ్ బెడ్ బాగోలేదు అని,తనకు అసౌకర్యంగా ఉందని తనకు సర్వీస్ వద్దంటూ బుకింగ్ క్యాన్సిల్ చేసి రీఫండ్ ఇవ్వమని కోరింది వాహిద్ సయ్యద్.
వైరల్ అవుతున్న వీడియోలో..థెరపిస్త్ వీడియో రికార్డ్ చేస్తుండగా.. తన ఇంటి నుండి వెళ్ళిపోమని బాధితురాలు థెరపిస్ట్ బ్యాగ్ ను బయట పెట్టడానికి ప్రయత్నిస్తుండగా, థెరపిస్ట్ ఆవేశంగా బ్యాగ్ లాక్కోవడం కనిపిస్తుంది. ఆ వెంటనే థెరపిస్ట్, ఇంటి యజమానురాలిపై విరుచుకుపడి, ఆమెను బలంగా నెట్టివేసింది.
ఇద్దరూ ఘర్షణ పడుతుండగా, థెరపిస్ట్ ఆ మహిళ జుట్టును గట్టిగా పట్టుకుని లాగుతున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఇదంతా వాహిద్ సయ్యద్ కుమారుడు పక్కనే నిలబడి వీడియో రికార్డ్ చేశాడు.
బాధితురాలు చెబుతున్న వివరాల ప్రకారం.. థెరపిస్ట్ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ, జుట్టు పట్టుకుని ఈడ్చి, ముఖంపై విచక్షణారహితంగా కొట్టింది. గోళ్ళతో రక్కి, కిందకు తోసేసింది. అడ్డుకోబోయిన బాధితురాలి కొడుకును కూడా థెరపిస్ట్ వదలలేదు.
వీడియో రికార్డ్ చేస్తున్న బాధితురాలి కొడుకు..ఈమె పిచ్చిది.. నా ఇంట్లోకి చొరబడి మా అమ్మను కొడుతోంది.. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తున్నా అని ఆవేదనగా అరవడం వీడియోలో వినబడుతోంది.
పోలీసుల దర్యాప్తు
ఘటన జరిగిన వెంటనే బాధితురాలి కుటుంబం 100కు డయల్ చేసినప్పటికీ, పోలీసులు వచ్చేలోపే నిందితురాలు అక్కడి నుంచి పరారైంది. అయితే దర్యాప్తులో ఒక విస్తుగొలిపే విషయం బయటపడింది. యాప్ లోని సాంకేతిక లోపం వల్ల నిందితురాలి పేరు, గుర్తింపు వివరాలు తప్పుగా నమోదయ్యాయని తేలింది.
ప్రస్తుతం వడాలా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఆన్ లైన్ సేవల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ఇంటి లోపలికి అపరిచితులను అనుమతించేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది.



Click it and Unblock the Notifications