Latest Updates
-
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి!
Mifepristone: అబార్షన్ డ్రగ్ మిఫిప్రిస్టోన్ అందుబాటులో ఉంచాల్సిందే, అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు
అబార్షన్ డ్రగ్ అందుబాటు విషయంలో అమెరికా సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మిఫిప్రిస్టోన్ డ్రగ్ ను అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలిచ్చింది. గర్భనిరోధక మాత్రలు మిఫిప్రిస్టోన్ పై ఇటీవల టెక్సాస్ కోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

మరోవైపు మిఫిప్రిస్టోన్ డ్రగ్ ను 13 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచాలని వాషింగ్టన్ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు కోర్టులు వేర్వేరు తీర్పులు ఇవ్వగా మిఫిప్రిస్టోన్ వాడకంపై అమెరికాలో సందిగ్ధత నెలకొంది. తాజాగా యూఎస్ సుప్రీం కోర్టు గర్భనిరోధక మాత్రలను వాడొచ్చని, వాటిని ప్రతి చోటా అందుబాటులో ఉంచాలన్న తీర్పుతో సందిగ్ధత తొలగిపోయింది.
గతంలో అబార్షన్ పిల్స్ ను నిషేధిస్తూ టెక్సాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ లో ఉంచింది. వారం రోజుల పాటు దీనిపై ఎలాంటి విచారణ చేయకపోవడం వల్ల ఈ అంశాన్ని సంబంధిత సంస్థలు, వ్యక్తులు సుప్రీం కోర్టులో లేవనెత్తారు.
వైట్ హౌజ్ ఏమందంటే..:
'సుప్రీం కోర్టు టెక్సాస్ కోర్టు తీర్పుపై స్టే విధించడం వల్ల మిఫిప్రిస్టోన్ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు వీలు కలిగింది. దాని భద్రతకు కూడా ఆమోదముద్ర లభించినట్లు అయింది. చాలా రోజులుగా జరుగుతున్నా న్యాయ పోరాటం ఇన్నాళ్లకు ఫలితాన్ని ఇచ్చింది' అంటూ వైట్ హౌజ్ పేర్కొంది.
'అమెరికాలోని మహిళల హక్కుల కంటే ఈ నిబంధనలు, చట్టాలేమీ ఎక్కువ కాదు. స్త్రీల ఆరోగ్యాన్ని రాజకీయం చేస్తున్న వారిపై ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాం' అని జో బైడెన్ అన్నారు.
మిఫిప్రిస్టోన్ పిల్స్ ఎలా పనిచేస్తాయి:
మిఫిప్రిస్టోన్ పిల్స్ ను ఆర్‌యూ 486 అని కూడా పిలుస్తారు. శృంగారం చేసిన తర్వాత మిఫిప్రిస్టోన్ మాత్రలు వేసుకుంటారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది. ఇక మిసోప్రోస్టాల్ అనే మరో మాత్రను కూడా కొందరు వేసుకుంటారు. సంభోగం తర్వాత 48 గంటలు దాటిన తర్వాత ఈ మాత్రను వాడుతుంటారు. దీని వల్ల అండ విచ్ఛిత్తి జరిగి బ్లీడింగ్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
మిఫిప్రిస్టోన్ పిల్స్‌ను ఎప్పుడు ఆమోదించారు:
మిఫిస్ట్రాన్, మిసోప్రోస్టోల్‌ను అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2000 సంవత్సరంలో అనుమతి ఇచ్చాయి. గర్భం వచ్చిన తర్వాత 10 వారాల వ్యవధి వరకు ఈ మిఫిప్రిస్టోన్ మాత్రలను వాడొచ్చు. ఒకవేళ ఆ సమయం దాటితే మాత్రం వాక్యూమ్ యాస్పిరేషన్ పద్ధతితో గర్భాన్ని తొలగిస్తారు.
పెరిగిన మిఫిప్రిస్టోన్ పిల్స్ వాడకం:
అమెరికాలో 2020లో సుమారు 10 లక్షల మంది మహిళలు అబార్షన్ చేయించుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం దాంట్లో దాదాపు 53 శాతం మంది మిఫిప్రిస్టోన్ పిల్స్‌తోనే గర్భాన్ని తొలగించుకున్నారు. ఈ పిల్స్ వాడకం 2008లో 17 శాతం ఉండేది. 2017 నాటికి మిఫిప్రిస్టోన్ పిల్స్ వాడకం 39 శాతానికి పెరిగింది.
మిఫిప్రిస్టోన్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా:
మిఫిప్రిస్టోన్ పిల్స్ వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. వీటి వాడకం వల్ల తిమ్మిరి, దీర్ఘకాలిక భారీ రక్తస్రావం జరగొచ్చు. కొంతమందిలో వికారం, జ్వరం, వాంతులు కూడా ఉండవచ్చు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మిఫిప్రిస్టోన్ పిల్స్ తీసుకునే 100 మందిలో ఒకరికి శస్త్రచికిత్స అవసరమయ్యే భారీ రక్తస్రావం జరుగుతుంది.



Click it and Unblock the Notifications