Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నాన్‌స్టిక్ ప్యాన్‌లు వాడితే క్యాన్సర్.. పరిశోధనల్లో భయంకరమైన వాస్తవాలు..!
నాన్ స్టిక్ వంటపాత్రలను ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా హానికరమని చెబుతున్నారు. ఇవి చూడటానికి అందంగా, కొనడానికి కాస్లీగా ఉన్నా వీటివల్ల నష్టమే ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. ఈ నాన్‌స్టిక్ వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయ్. వాటిపై మనం వంటను వేగంగా చేయగలుగుతున్నాం, అందులో వేసిన కూరగాయలు, రైస్ కొన్ని నిమిషాల్లోనే ఉడికిపోతుంది. నాన్‌స్టిక్‌లో ఉష్ణోగ్రత శాతం చాలా ఎక్కువగా వుంటుంది. 260 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటితే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని రిపోర్టులు చెబుతున్నాయ్.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరి ఇళ్లల్లో నాన్‌స్టిక్ ప్యాన్లనే వంటల్లో ఉపయోగిస్తున్నారు. నాన్‌స్టిక్ వల్ల వంటపాత్రల్లో నూనె తక్కువగా ఉపయోగిస్తారు, శరీరంలో కొవ్వు పదార్థాలు కూడా తక్కువగా ఉండేలా వంటకాలు ఉంటాయని నాన్‌కస్టిక్ తయారు చేసే కంపెనీ వారు వాదిస్తున్నారు.
నాన్‌స్టిక్‌ల వల్ల వంట చాలా రుచిగా అవుతుందని ప్రముఖ చెఫ్‌లకు కూడా మంచి అభిప్రాయమే ఉంది. కానీ నాన్‌స్టిక్‌పై ఉండే టెఫ్లాన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయ్.
మనం నాన్‌స్టిక్ ప్యాన్‌లు వాడుతాము కాని అది ఎంతటి ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేయబడిందో మనలో చాలా తక్కువ మందికి తెలుసు. నాన్ స్టిక్‌పై ఉండే టెఫ్లాన్‌ను కొర్బన్, ఫ్లోరిన్‌ను కలిపి తయారు చేస్తారు. ఈ రసాయనం క్యాన్సర్‌కు కారణమవుతుందని పరిశోధనలు రుజువు చేశాయ్. టెఫ్లాన్‌ను మొదటిసారిగా 1930లో తయారు చేసారు. అప్పటి నుంచి దీన్ని నాన్‌స్టిక్ ప్యాన్‌లపై పూతపూసి మార్కెటింగ్ చేస్తున్నారు.
నాన్‌స్టిక్‌లను ఉపయోగించడం చాలా సులభం. చాలా తేలికగా వంటను వండుకోవచ్చు. స్టవ్‌పైన పెట్టిన కొన్ని నిమిషాలకే అన్నం కూర ఉడికిపోతాయ్. కొంత టేస్టీగా కూడా ఉంటుంది. అయితే దీనికంతటికీ కారణమయ్యే టెఫ్లాన్ మాత్రం ఆరోగ్యానికి చాలా హానికరమని అంటున్నారు. పురుషుల్లో, స్త్రీలలో సంతానలేమి సమస్యలను కూడా తీసుకొని వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు థైరాయిడ్ సమస్యలు, క్రోనిక్ కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధి, వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

నాన్‌స్టిక్‌ను ఉపయోగించేవారు ఆ ప్యాన్‌ను ఎక్కువ సమయం స్టవ్‌పైన పెట్టకూడదు. ప్యాన్ ఎక్కువ సేపు మంటపై ఉండడం వల్ల పాలిమర్ ఫ్యామ్ లాంటి విషపు కెమికల్స్ తయారై విడుదలౌతాయ్. మీడియం హీట్ పైనే ప్యాన్‌లో వంట చేయాలి. మీరెప్పుడూ ఎక్సస్ట్ ఫ్యాన్ ఆన్‌లోనే వుంచాలి.
నాన్‌స్టిక్‌కి బదులుగా స్టైన్‌లెస్ స్టీల్ పాత్రలను ఉపయోగించవచ్చు. కొన్ని మట్టి పాత్రలను కూడా ఉపయోగించవచ్చు. సిలికన్ కుక్‌వేర్ ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలిగించదు. పూర్వం మట్టి పాత్రలో వండుకొని ఆరోగ్యంగా ఉండేవారు, ఇప్పుడు నాన్‌స్టిక్ అభివృద్ధికి సూచిక అయినా వండుకోవడానికి ప్రమాదకరంగా మారడం ఆశ్చర్యం కలిగించే అంశం.
నాన్ స్టిక్ ప్యాన్‌లను జాగ్రత్తగా ఉపయోగిస్తే ఎక్కువ నష్టాన్ని తగ్గించవచ్చు. కొందరు ఎటువంటి ప్రమాదం లేదని హెచ్చరిస్తారు. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల క్యాన్సర్ కారకమయ్యే క్రిములు, కెమికల్స్ కూడా నశించిపోతాయంటారు. కానీ వీటిలో ఏ వాస్తవం లేదని తాజాగా ల్యాబ్స్‌లో చేసిన పరిశోధనలు మనకు రుజువు చేస్తున్నాయ్. నాన్‌స్టిక్ ప్యాన్‌ల వాడకం ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిది.



Click it and Unblock the Notifications