Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Lip Kiss Competition: వాలంటైన్స్ డే స్పెషల్ గా లిప్ కిస్ పోటీలు..మనదగ్గరే..అందరూ ఆహ్వానితులే!
ప్రతిఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమ,భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి వాలెంటైన్స్ డే ఒక ప్రత్యేక అవకాశం. ఫిబ్రవరి 7 వ తేదీ నుంచే వాలంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు లవ్ ని రోజుకో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు లవ్ బర్డ్స్. ఫిబ్రవరి 7ని రోజ్ డే, ఫిబ్రవరి 8ని ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9ని చాక్లెట్ డే, ఫిబ్రవరి 10ని టెడ్డీ డే, ఫిబ్రవరి 11ని ప్రామిస్ డే, ఫిబ్రవరి 12ని హగ్ డే, ఫిబ్రవరి 13ని కిస్ డే గా జరుపుకుంటారు. ఈ రోజులన్నీ వాలంటైన్స్ డేని మరింత రంగుల మయం చేస్తాయి.
ఈ ప్లేస్ లోనే లిప్ కిప్ కాంపిటీషన్
అయితే వాలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు వెస్ట్ బెంగాల్ లోని జల్పాయిగురి జిల్లాలోని మక్రేపారా ప్లే గ్రౌండ్ లో లిప్ కిస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రచారంలో వాస్తవమెంత ఉందో తెలియదు కానీ లిప్ కిస్ కాంపిటీషన్ కి సంబంధించిన ఇన్విటేషన్ లెటర్లు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ వైరల్ ఇన్విటేషన్ పేపర్లు చూసిన నెటిజన్లు కొందరు ఫిబ్రవరి 14న ఆ గ్రౌండ్ కి వెళ్లి తీరాల్సిందేనని సరదాగా వ్యాఖ్యానిస్తుండగా..ఇప్పటిదాకా విదేశాల్లోనే ఇలాంటి పోటీలు జరిగేవని ఇప్పుడు మనదేశంలోకి వెస్ట్రన్ కల్చర్ వచ్చేసిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కిస్పింగ్ కాంపిటీషన్ కాదు..మన సంస్కృతి కిల్లింగ్ కాంపిటీషన్ అని కొందరు విమర్శిస్తున్నారు.
రూల్స్ ఇవే
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిస్పింగ్ కాంపిటీషన్ ఇన్విటేషన్ లెటర్ లో..ఈ పోటీలో పాల్గొనడానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారం ఒంటరి వ్యక్తులకు ఆ కాంపిటీషన్ కి ఎంట్రీ ఉండదు..అదేవిధంగా 15 ఏళ్ల నుండి 90 ఏళ్ల వరకూ అందరూ ఆహ్వానిహతులేనంట.



Click it and Unblock the Notifications