Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Viral Video : వారణాసి ఐపీఎస్ ఆఫీసర్‌గా 9 ఏల్ల బాలుడు.. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బుల్లి ఐపీఎస్..!
చిన్న వయసులో ఎన్నో కలలు కంటాం. కానీ జీవితం గడుస్తున్న కొద్దీ ఆ లక్ష్యాలను మనము చేరుకోలేకపోవచ్చు. కొందరు మాత్రమే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మరికొందరు ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే ఆరోగ్యం సహకరించదు. పెద్దైన తరువాత ఐపీఎస్ ఆఫీసర్ అవుదామనుకొంటే అప్పుడే బ్రెయిన్ వ్యాధికి గురైతే ఆ చిన్ని మనసు ఎంతగాయపడుతుంది. ఇక తాను ఐపీఎస్ ఆఫీసర్ జీవితంలో అవ్వలేనని తెలిసి ఆ చిన్ని గుండె తరుక్కుపోతుంది.
ఇలా నిజజీవితంలో ఐపీఎస్ ఆఫీసర్ కావాలని వారనాసిలో నివసిస్తున్న 9 ఏళ్ల రన్‌వీర్ భారతి అనుకున్నాడు. కానీ బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఉత్తరప్రదేశ్‌లోకి మహమన క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న వారానాసికి చెందిని ఐపీఎస్ ఆఫీసర్ ఆ బాలుడి కలను నిజం చేద్దామని అనుకున్నారు. అప్పటికే రన్‌వీర్ భారతి స్టోరీ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. దీంతో రన్‌వీర్ కు కొంత సమయం వరకు ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలను అప్పగించారు. రన్వీర్ భారతికి ఐపీఎస్ ఆఫీసర్ దుస్తులు వేసి, చేతిలో లాఠీ, ఐపీఎస్ బ్యాచ్ ఇలా ఐపీఎస్ ఆఫీసర్‌కు డ్రెస్‌ను బాలుడికి వేసారు.

పోలీస్ కమీషరేట్ ఆపీస్ లోపలా బయట రన్వీర్ భారతి పలు పోలీసు అధికారులతో ఫోటోలు దిగాడు.
వారణాసిలోని వారనాసి జోన్ ఏడీజీ పుయూష్ మోర్డియా ఈ బాలుడికి ఈ అవకాశాన్ని కలిగించారు. ఐపీఎస్ చేపట్టిన ఈ చోరవను సోషల్ మీడియాలో చాలా మంది అభినందిస్తున్నారు.
పిల్లల కలను ఇలా నెరవేర్చడానికి గతంలో చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా ముందుకు వచ్చారు. పిల్లలు ఎన్నో కలలు కంటారు. కానీ ఆ కలలను నెరవేర్చుకోవడానికి ఎంత కష్టపడినా ఆరోగ్యం సహకరించదు. ఇప్పుడు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ బాలుడు ఎంత ప్రయత్నించినా కొన్నేళ్లే బతకడం వల్ల జీవితంలో ఇక ఎప్పటికీ ఐపీఎస్ ఆఫీసర్ కావడం అసాధ్యం. ఈ అసాధ్యాన్ని కూడా పియూష్ మోర్డియా లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు నిజం చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజెన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ పియూష్ మోర్డియాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి ఆఫీసర్ల వల్ల ఎందరో పిల్లల కలలు నెరవేరుతాయని అంటున్నారు.



Click it and Unblock the Notifications