Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వరుణ్‌తేజ్ లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ ప్లేస్‌లో వెడ్డింగ్ వెన్యూ!
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ఈ ప్రేమ పక్షులు రీసెంట్ గా జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో వీరి వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబసభ్యులు, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు. ఎంగేజ్‌మెంట్ సింపుల్ గా కానిచ్చేసినప్పటికీ.. పెళ్లి మాత్రం ఓ రేంజ్ లో చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. ఈ మేరకు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే వివాహ వేదిక కూడా నిర్ణయించేశారట.
మెగా కుటుంబంలో ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. వరుణ్ లావణ్య ఎంగేజ్‌మెంట్ ఆ తర్వాత రామ్‌చరణ్ ఉపాసనలకు పాప జన్మించడం, ఆ బుజ్జాయి నామకరణం మహోత్సవం, ప్రస్తుతం వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకతో మెగా ఇంట్లో సంబర వాతావరణం నెలకొంది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి హైదరాబాద్ లో, ఇండియాలో కాకుండా ప్రస్తుతం ట్రెండ్ కు అనుగుణంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెడ్డింగ్ వెన్యూ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. వరుణ్ లావణ్య ప్రేమకు పునాది పడిన ఇటలీలోనే వీరిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటలీలోని ఓ ఫేమస్ ప్లేస్ లో వీరిద్దరూ ఏడడుగులు వేయనున్నారట.

ఆగస్టు 24వ తేదీన పెళ్లి జరగనుందని సమాచారం. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విదేశాల్లో పెళ్లి షాపింగ్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. పెళ్లి తేదీకి నెలకు పైగా సమయం ఉండటంతో పెళ్లి ఏర్పాట్లు అన్నీ సాఫీగా సాగుతున్నాయి. త్వరలోనే మెగా కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక విమానంలో ఇటలీ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని మెగా కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా మిస్టర్, అంతరిక్షఁ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. మిస్టర్ మూవీ షూటింగ్ ఇటలీలోనే జరిగిందే. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇద్దరు అభిప్రాయాలు కలవడంతో ఫ్రెండ్‌షిప్ కాస్త ప్రేమగా మారింది. అలా ఎంగేజ్‌మెంట్ చేసుకుని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయింది వరుణ్ లావణ్యల జంట.

పెళ్లికి ముంద లావణ్య వరుణ్ అన్ని విషయాలు మాట్లాడుకుని క్లారిటీ తెచ్చుకున్న తర్వాత నిశ్చితార్థం వరకు వెళ్లినట్లు సమాచారం. ఈ పెళ్లి విషయంలో లావణ్య పలు కండీషన్లు కూడా పెట్టినట్లు ఎంగేజ్‌మెంట్ తర్వాత వార్తలు వినిపించాయి. వరుణ్ తో పెళ్లి తర్వాత లావణ్య సినిమా ఇండస్ట్రీని వదులుకోబోనని చెప్పేసిందట. అయితే హీరోయిన్ గా కాకుండా ప్రొడక్షన్ వైపు వెళ్తానని చెప్పిందట ఈ అందాల రాక్షసి. అలాగే లావణ్య త్రిపాఠికి భరత నాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లి అయిన తర్వాత ఏదైనా వేదికపై భరతనాట్యం చేసే అవకాశం వస్తే.. దానికి వరుణ్ ఒప్పుకోవాలని ముందు కండీషన్ పెట్టిందట ఈ బ్యూటీ. ఈ కండీషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎంగేజ్‌మెంట్ ఓకే అన్నదని టాక్.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications