Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పడగ్గదిలో, వంటింట్లో ఈ పనులు చేయడం మానుకోండి, లేకపోతే ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణ శైలి, అలాగే ఇంట్లో ఉంచే వస్తువులు, చెట్లు, వేలాదీసే వస్తువులు అన్నీ వాస్తు ప్రకారం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం కట్టిన ఇంట్లో, అన్ని వాస్తు ప్రకారం వ్యవహరించగలిగితే ఆ ఇంట్లో ప్రశాంతత, సమృద్ధి ఉంటాయి. అలాంటి ఇంట్లో నివసించే వారి జీవితంల చాలా సానుకూలంగా, సాఫీగా సాగిపోతుంది. ఏ దిక్కులో ఎలాంటి వస్తువులు ఉంచాలో, ఎలాంటి వస్తువులను ఏ దిక్కులో ఎట్టిపరిస్థితుల్లో ఉంచకూడదో కచ్చితంగా పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతికూల శక్తులు బాధించవు. అనుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించి అన్ని పనులను విజయవంతం చేస్తాయి.

కొన్ని సార్లు వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. చేతిలో డబ్బు నిలవకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం లేకపోవడం, దంపతుల మధ్య తరచూ కలహాలు లాంటివి జరుగుతుంటాయి. దీనికి కారణం, కొన్ని వస్తువులను వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా ఉంచడం వల్ల ఇలా జరుగుతుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో, పడక గదలో కొన్ని రకాల పనులు చేయకూడదు. ఆ పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. మరి పడగ్గదిలో, వంటింట్లో ఎలాంటి పనులు చేయాలో, చేయకూడదో ఇప్పుడు చూద్దాం.
పడగ్గదిలో చేయకూడని పనులు:
పడగ్గది అంటే దంపతులకు చెందినది. సాన్నిహిత్యాన్ని పెంపొందించే గది అది. అలాంటి గదిలో వివిధ పనులు చేయడం వల్ల అందులోని సానుకూల శక్తిని మనమే బయటకు వెళ్లగొట్టిన వాళ్లం అవుతాం. కొందరు డైనింగ్ టేబుల్ వద్ద, హాలులో కూర్చొని భోజనం చేయకుండా పడగ్గదిలోకి వెళ్లి భోజనం చేస్తుంటారు. బెడ్ పై కూర్చొని మాట్లాడుకుంటూ లేదా సినిమాలు చూస్తూ తింటుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అస్సలే చేయకూడదు.
వాస్తు ప్రకారం పడక గదిలోని మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది. దీని వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అందుకే పెద్దలు కూడా మంచంపై కూర్చొని తినకూడదని చెబుతుంటారు. అలాగే కొందరు బెడ్రూములో నీటి గ్లాసులను, తాగేసిన టీ, జ్యూస్ కప్పులను తర్వాత పెట్టేయవచ్చులే అని పక్కనే పెట్టుకుంటారు. ఇలా ఎంగిలి కప్పులను బెడ్ రూములో పడక పక్కనే పెట్టుకోవడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు. అలాగే సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు లాంటివి కూడా దిండు కింద పెట్టుకుని పడుకోవద్దు. దీని వల్ల సమస్యలు ఎదురవుతాయి.
వంటగదిలో చేయకూడని పనులు:
వంటిల్లు ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి. వాస్తు ప్రకారం అలా చేస్తేనే మంచిది. అలాగే వంటింట్లో భోజనం వండుకోవాలి కానీ భోజనం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వండిన వంటకాలు తినాలనుకుంటే ప్లేటులో పెట్టుకుని బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ పై లేదా హాలులో కూర్చొని తినాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
రాత్రి తిన్న వంట పాత్రలను, ఎంగిలి ప్లేట్లను అలాగే సింక్ లో పడేసి ఉదయమే తోముకుంటాం అనుకుంటారు చాలా మంది. వంటగదిలో అలా ఎంగిలి పాత్రలను ఉంచకూడదు. వంటగదిలో లక్ష్మీదేవి ఉంటుందని హిందువుల విశ్వాసం. కాబట్టి ఎంగిలి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వంటగదికి ఎదురుగా బాత్రూమ్ ఉండకూడదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications