Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆఫీసు డెస్క్ పైన వీటిని పెట్టుకోండి, కెరీర్ అద్భుతంగా మారుతుంది
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో కూడా జీవితంపై ప్రభావం చూపిస్తుంది. చిన్న చిన్న అంశాలే కదా అని నిర్లక్ష్యం చేసిన వాటి వల్ల కూడా జీవితం ప్రభావితం అవుతుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రశాంతంగా ఉండాలని, ఆనందంగా, సంతోషంగా సాగాలని అనుకుంటారు. దంపతుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
మంచి జీవితం కోసం, జీతం కోసం చాలా మంది ఉద్యోగులు బాగా కష్టపడుతుంటారు. అయినా సరైన ఫలితాలు రావు. ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. మిగతా వారి కంటే ఎక్కువగా కష్టపడ్డా గుర్తింపు ఉండదు. ఇలాంటి ఒడిదొడుకులు చాలా మంది జీవితాల్లో ఉంటాయి. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిన్న చిన్న పనులు చేయాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా కొన్ని నియమాలు పాటించడం వల్ల మంచి ఫలితం అందుకుంటారు. ఈ నియమాల ప్రకారం చాలా రకాల శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు తాము పని చేసే చోట, ఆఫీసు డెస్క్ పైన కొన్ని వస్తువులు ఉంచుకుంటే వాస్తు శాస్త్రం ప్రకారం మంచి జరుగుతుంది.
బాంబూ ప్లాంట్:
వాస్తు ప్రకారం పని చేసే డెస్క్ పైన వెదురు మొక్కను ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. బాంబూ ప్లాంట్ ప్రతికూలతను తొలగించి, అనుకూల శక్తిని ఆకర్షిస్తుంది. అందుకే బాంబూ ప్లాంట్ ను లక్కీ బాంబూగా పిలుస్తుంటారు. డెస్క్ పై ఉంచే బాంబూ ప్లాంట్ వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. విషయాలను సానుకూల దృక్పథంలో చూడటం మొదలవుతుంది. అది ఈ బాంబూ ప్లాంట్ అదృష్టాన్ని తీసుకువస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
బంగారు నాణెలు:
బంగారు నాణెలతో ఉన్న ఓడ తరహా బొమ్మలు గిఫ్ట్స్ షాపుల్లో కనిపిస్తుంటాయి. వీటిని డెస్క్ పైన పెట్టుకోవడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం మంచి జరుగుతుంది. వ్యాపారంలో కూడా డెస్క్ లపై వీటిని ఉంచుకోవడం వల్ల లాభాలు వస్తాయి. బంగారు నాణెల ఓడ సానుకూలతను తీసుకువస్తుంది. అనుకూలతను ఆకర్షిస్తుంది. దీనిని డెస్క్ పై పెట్టుకోవడం వల్ల కెరీర్ లో పురోగతి లభిస్తుంది. వృత్తి జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొనే వారు తప్పకుండా ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితాలను చూస్తారు.
గాజు వస్తువులు:
వాస్తు ప్రకారం డెస్క్ పైన గాజు వస్తువులు లేదా క్రిస్టల్ వస్తువులు ఉంచితే సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. స్పటికంతో చేసిన వస్తువులు, గాజుతో చేసిన పేపర్ వెయిట్ లు, క్రిస్టల్ బొమ్మలు ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇవి ప్రతికూల శక్తులను తొలగించి, అనుకూల శక్తులను ఆకర్షిస్తాయి.
పిరమిడ్:
ఆఫీసు డెస్క్ పైన పిరమిడ్ ఉంచుకోవడం మంచి చేస్తుంది. చెక్క, గాజు లాంటి వాటితో తయారు చేసిన పిరమిడ్ తరహా వస్తువులు సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి.
మరికొన్ని వాస్తు చిట్కాలు:
- ఆఫీసు డెస్క్ అయినా, వ్యాపారంలో డెస్క్ అయినా శుభ్రంగా ఉంచుకోవాలి. చిందరవందరగా ఉన్న డెస్క్, చెత్తాచెదారంతో ఉన్న డెస్క్ ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. చూడటానికి కూడా బాగుండదు. సరిగ్గా ఉంచిన డెస్క్ చూడగానే మనస్సుకు పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది.
- ఆఫీసులో వాయువ్య దిశలో కూర్చోవడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది. సహజమైన వెలుగు ప్రసరించే చోటును ఎంచుకోవడం మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications