Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
వాస్తు ప్రకారం ఏ ఫోటోలు ఎక్కడ పెట్టాలో తెలుసా.. లేకపోతే ఇది చదవండి
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ ఫోటో ఎక్కడ ఉండాలి, ఎలాంటి పెయింటింగ్స్ ఏ వైపున ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉండొద్దన్నా, ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా, ప్రశాంతత వెల్లివిరియాలన్నా వాస్తు చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉండే ఇంట్లోని కుటుంబసభ్యులు ఆనందంగా, ఆర్థిక లాభాలతో, తలపెట్టిన పనులు విజయవంతం అవుతుంటాయి. వాస్తు ప్రకారం ఇంట్లో వేలాడదీసే ఫోటోలు, పెయింటింగ్స్ ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. అప్పుడే ఇంట్లో ప్రశాంతత వెల్లివిరుస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ ఫోటో ఎక్కడ ఉండాలి, ఎలాంటి పెయింటింగ్స్ ఏ వైపున ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాధా కృష్ణ పెయింటింగ్
పడకగదిలో రాధాకృష్ణుల పెయిటింగ్స్ ఉంచుకోవాలి. రాధాకృష్ణుల పెయింటింగ్ స్వచ్ఛమైన ప్రేమను అభివర్ణిస్తుంది. ఇద్దరు కలిసి నినసించే వ్యక్తుల మధ్య సామరస్యాన్ని పెంచుతుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. పెయింటింగ్‌ను గదికి నైరుతి దిశలో వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య ప్రేమ, నమ్మకం, నిజాయితీ పెరుగుతుంది.

2. కుటుంబసభ్యుల ఫోటోలు
కుటుంబసభ్యుల ఫోటోలను ఎక్కడైనా ఉంచుకోవచ్చు. పడకగది, హాలు, డ్రాయింగ్ రూముల్లో పెట్టుకోవచ్చు. నైరుతి వైపు ఉన్న గోడపై వేలాడదీస్తే కుటుంబసభ్యుల మధ్య ప్రేమ బలోపేతం అవుతుంది. కుటుంబసభ్యుల మధ్య బంధం బలపడుతుంది. పడకగదిలో ఉత్తరం లేదా తూర్పు మూలలో కుటుంబ చిత్రాలను ఉంచకుండా చూసుకోవాలి.

3. అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్
అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్ హాలులో ఉంచితే అందంగా ఉంటుంది. అందరికీ కనిపించేలా ఈ పెయింటింగ్స్ ఉంచాలి. పడకగదిలో మాత్రం ఈ చిత్రాలను ఉంచకూడదు. దీని వల్ల జంటల మధ్య కలహాలు పెరుగుతాయి. బెడ్రూములో ఇలాంటి చిత్రాలు ఉంచకూడదు.

4. చనిపోయిన వారి ఫోటోలు
చనిపోయిన కుటుంబసభ్యుల ఫోటోలు పడకగదిలో ఉంచకూదు. హాలులో పెట్టవచ్చు. అలాగే పూజా గదిలో కూడా ఉంచవచ్చు. చనిపోయిన వారిని దేవుడిలా కొలిచే సాంప్రదాయం హిందూమతంలో ఉంది కాబట్టి వారి ఫోటోలను పూజా గదిలో ఉంచుకోవచ్చు.

5. వార్ పెయింటింగ్స్
వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్రూములో వార్ పెయింటింగ్స్ ఉంచొద్దు. ఒంటరిగా ఉండే జంతువులు మనుషులు పెయింటింగ్స్ హృదయంలో ఒంటరితనాన్ని సృష్టిస్తాయి. అలాగే బెడ్రూములో యుద్ధాలను వర్ణించే చిత్రాలను తీసివేయాలి. హాలులో కూడా ఇలాంటి చిత్రాలు లేకపోవడమే ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

6. డార్క్ పెయింటింగ్స్
దెయ్యాలు, భూతాలు, చెడును వర్ణించే చిత్రాలు ఇంట్లో ఉంచుకోవద్దు. ఇవి ఇంట్లో ప్రతికూల ప్రకంపనలు సృష్టిస్తాయి. ఇలాంటి చిత్రాలను పడకగదిలో ఎట్టిపరిస్థితిలోనూ ఉంచుకోవద్దు. అలాంటి చిత్రాలు ఉంటే తక్షణమే తొలగించడం మంచిది. ఇలాంటి చిత్రాలు ఇంట్లో ఎక్కడ కూడా పెట్టుకోవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది.

7. బుద్ధ పెయింటింగ్స్
బుద్ధ పెయింటింగ్స్ సానుకూల దృక్పతాన్ని కలిగిస్తాయి. కానీ వాటిని పడకగదిలో మాత్రం పెట్టుకోవద్దు. పడకగదిలో దేవుళ్ల ఫోటోలు కూడా ఉంచవద్దు. దాని వల్ల ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది.

పిల్లల పడకగదిలో పెయింటింగ్స్:
వాస్తు ప్రకారం, పక్షులు, గుర్రాలు, కుక్క పిల్లలు, సీతాకోకచిలుకలు చిత్రాలను పిల్లల పడకగదిలో వేలాడదీస్తే అనుకూలంగాఉంటుంది. పిల్లలు నిద్రిస్తున్నప్పుడు జంతువులు రక్షించాలని వాస్తు సూచిస్తోంది.ఎదుగుదల దశలో ఉన్న పిల్లలకు, వారికి ముఖ్యమైన విషయాల చిత్రాలను కలిగి ఉండటం వారికి సానుకూల శక్తిని ఇస్తుంది.
విచారకరమైన భావోద్వేగాలు లేదా మానసిక స్థితి, హింసను వర్ణించే పెయింటింగ్‌లు పిల్లల ఎదుగుదలకుకూడా మంచిది కాదు. పిల్లల గదుల్లో సరస్వతీ దేవి చిత్రాన్ని ఉంచడం వల్ల పిల్లలకు అనుకూలంగాఉంటుంది.



Click it and Unblock the Notifications