Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే మంచిదేనా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..
ఇంట్లో జరిగే ఏ చిన్న విషయమైనా అది వాస్తుపై ప్రభావం చూపిస్తుంది. అలాగే వాస్తు శాస్త్రం ఇంట్లోని ప్రతి అంశంపై ప్రభావం చూపిస్తుంది. ఒక వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచకపోతే కూడా వాస్తు దోషం అంటుకుంటుంది. దాని వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ వస్తువులు ఏ దిక్కులో ఉంచాలో వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యుల మధ్య సాన్నిహిత్యం మెరుగుపడుతుంది. ఇలా చాలా లాభాలు ఉంటాయి.

రంగులు, వస్తువులు, మనుషులు, జీవులు అన్నీ వాస్తుపై ప్రభావం చూపిస్తాయని అంటారు నిపుణులు. ఇంట్లోకి వచ్చే ప్రతీది దాని అనుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అయితే కొన్ని రకాల జీవులు ఇంట్లోకి వస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే కొన్ని రకాల జీవులు ఇంట్లోకి రావడాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఇంటికి రావడం శుభప్రదంగా భావించే ఆ జీవులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండాకాలంలో ఇంట్లో చీమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఎర్ర చీమలు కనిపించడాన్ని శుభంగా భావిస్తారు. ఇంట్లో సంపద వెల్లివిరుస్తుందని నమ్ముతారు. ఇంట్లో ఎర్రచీమలకు చక్కెర, బెల్లం లాంటివి పెట్టే వాళ్లు కూడా ఉంటారు. మరి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే ఏమవుతుంది.. ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే మంచిదేనా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..
నల్ల చీమలు:
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు కనిపించడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఇలా నల్ల చీమలు కనిపిస్తే జీవితంలో ఆనందం, శ్రేయస్సు రాబోతున్నాయని అర్థం. అలాగే ఇంట్లోకి వచ్చిన నల్ల చీమలకు ఆహారం పెట్టడం మంచదని అంటారు జ్యోతిష్కులు. వరుస కట్టి ఇంట్లోకి వచ్చే నల్ల చీమల వల్ల ఇంట్లో నుంచి పేదరికం పోతుందని నమ్మకం.
ఇంట్లో సంపద వెల్లివిరిసి, బాధలు తొలగిపోతాయని అంటారు. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, దంపతుల మధ్య సంతోషం, ఆనందం వస్తుందని విశ్వాసం. ఇంటి నేలపై, గోడల వెంట నల్ల చీమలు కనిపించడాన్ని శుభప్రదంగానే భావిస్తారు.
పిచ్చుకలు:
ఇంట్లోకి పిచ్చుకలు రావడాన్ని శుభప్రదంగా చూస్తారు. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే వాటి వెంట సుఖసంతోషాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఇంట్లోకి పిచ్చుకలు రావడాన్ని శుభ సూచకంగా చూడాలని అంటారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయం పెరుగుతుందని విశ్వాసం. అలాగే జంట పిచ్చుకలు గనక ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో త్వరలోనే పెళ్లి జరగబోతుందని అర్థం అలాగే ఇంట్లోని కుటుంబసభ్యులకు సంతానం కలుగుతుందని అర్థం.
కాకి:
చాలా మంది కాకిని చూస్తే భయపడిపోతుంటారు. కొందరు కాకిని అశుభంగా భావిస్తారు. కానీ కాకి పితృ దేవతలకు ప్రతీక. కాకులు ఇంట్లోకి రావడాన్ని శుభంగా పరిగణించాలి. పితృ దేవతలు ఆశీర్వదించడానికి వచ్చారని అర్థం. కాకి ఇంట్లోకి రావడాన్ని అశుభంగా పరిగణించాల్సిన అవసరం లేదని అది మంచిదని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కాకి వచ్చి తల మీద తన్నితే.. ఏదో ప్రమాదం జరగబోతుందని, చెడు జరుగుతుందని అర్థం.



Click it and Unblock the Notifications