Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ వస్తువులు చేజారాయంటే.. దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకున్నట్లే!
కొన్ని కొన్ని సార్లు మన చేతిలో ఉన్నవి అనుకోకుండా జారి పడిపోతుంటాయి. ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా సరే కింద పడిపోతుంటాయి. అయితే ఇవి మనం కావాలని చేయకపోయినప్పటికీ.. వీటి వల్ల కల్గే ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. మనం చేసే ఈ చిన్న తప్పులే కొన్ని సార్లు మన జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. గాజు గ్లాసు పట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామో వంట గదిలో ఉండే కొన్ని వస్తువుల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా చేతిలో నుంచి కొన్ని వస్తువులు జారి పడిపోతే మీ భవిష్యత్తుకు ఓ హెచ్చరిక అని వాస్తు పండితులు వివరిస్తున్నారు. ఒకవేళ ఈ వస్తువులు కనుక జారి పడిపోతే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. ఒకరి చేతి నుంచి ఏదైనా వస్తువు కింద పడితే ఎలాంటి అశుభం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉప్పు పడిపోకూడదు:
చాలా మంది వంట చేస్తుండగా... ఉప్పు చేజారుతుంటుంది. కానీ ఇది చాలా తప్పు. ఉప్పు లక్ష్మీ దేవికి ప్రతిరూపం. శనిబాధలు తొలగించుకునేందుకు చాలా మంది ఉప్పును దానం చేస్తుంటారు. అలాంటి ఉప్పు చేారిదంటే రానున్న కొద్ది రోజుల్లో డబ్బుకు కొరత ఏర్పడతుందని అర్థం. అంటే త్వరలోనే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని సూచన. అలాగే ఎక్కువ మొత్తంలో ఉప్పు ఒలికిపోతే పతనానికి దగ్గరగా ఉన్నారని.. అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరిక అని కూడా చెబుతుంటారు.
2. పాలు ఒలికిపోకూడదు:
చేతిలోంచి పాలు కిందపడిపోకూడదు. ఇలా కనుక జరిగితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతుంటారు. పాలు చిందించడమంటే ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య విబేధాలకు సూచన అని వాస్తు పండితులు వివరిస్తున్నారు. అయితే గృహ ప్రవేశం రోజు పాలు పొంగితే మంచిదే అనే అనుమానం వస్తోంది... గృహ ప్రవేశం రోజు పాలు పొంగిస్తే చాలా మంచిదే. కానీ తరచుగా అలాగే జరగడం, పాలు చేజారడం జరిగితే మాత్రం కుటుంబంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది.
3. నల్లమిరియాలు:
వంటింట్లో ఉండే నల్ల మిరయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి పొరపాటున చేజారినా రాబోయే రోజుల్లో మీ సన్నిహితులు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉండొచ్చు.
4. ఆహారం కిందపడొద్దు:
కడుపు నింపే ఆహార ధాన్యాలైన బియ్యం, పప్పులు, పిండి వంటివి అస్సలే చేజారకూడదు. ఇవి కిందపడితే అన్నపూర్ణాదేవిని అవమానించినట్లే. పొరపాటున ఇవి కింద పడ్డాయంటే ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఆవరించబోతున్నాయని అర్థం. అందుకే ఆహారం తినే ముందు మొదటి ముద్దను కళ్లకు అద్దుకొని తినాలి. పెట్టి అన్నం మొత్తాన్ని పూర్తిగా తినేయాలి. ఒకవేళ తరచుగా అన్నం విడిచి పెడుతుంటే మాత్రం రానున్న రోజుల్లో ఆర్థిక, ఆహార ఇబ్బందులు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
5. పూజాఫలకం;
పూజా ఫలకం కిందపడిందంటే అస్సలు మంచిది కాదని పురాణాల్లో ప్రస్తావించారు. ఇలా కనుక జరిగిందంటే కుటుంబంలో పెద్ద సంక్షోభం ఏర్పడబోతుందని అర్థం. అలాంటి సందర్భాల్లో దేవుడి దగ్గర దీపం వెలిగించి ఆ సంక్షోభాన్ని తొలగించమని దేవుడిని కోరుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు



Click it and Unblock the Notifications