Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్‌లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
ఫ్రిజ్‌పై ఈ వస్తువులు పెట్టారంటే లక్కే లక్కు, అదే ఆ వస్తువులు పెట్టారంటే ఇక అంతే పరిస్థితులు!
ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. ఉండేది గుడిసెలోనే అయినా ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మిషన్ కచ్చితంగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. అయితే ఫ్రిజ్ ను ఆహారాన్ని భద్రపరుచుకోవడానికి మాత్రమే కాకుండా స్టాండ్ గా కూడా ఉపయోగిస్తుంటారు చాలా మంది. ఫ్రిజ్ మీద అనేక రకాల వస్తువులు పెట్టేస్తుంటారు. కానీ ఫ్రిజ్ మీద అన్ని రకాల వస్తువులు పెట్టకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున లాభాల వస్తాయని, కానీ మరికొన్ని రకాల వస్తువులు పెడితే మాత్రం అష్ట దరిద్రమంతా ఇంట్లోకి వచ్చి చేరుతుందని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. ఫ్రిజ్ పైన ఉంచిన కొన్ని వస్తువులు ఆ ఇంట్లో వాస్తు దోషాన్ని సృష్టిస్తాయి. ఇక ఫ్రిజ్ ను ఇంట్లోని కిచెన్ లో పెట్టాలంటే వాస్తు ప్రకారం పెట్టాలి. అలాగే ఫ్రిజ్ పైన ఏ వస్తువులు ఉంచాలి, ఎలాంటివి ఉంచకూడదో కూడా తెలుసుకోవాలి. లేని పక్షంలో ఇంట్లో ధన నష్టం కలుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఫ్రిజ్ పైన ఏ వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు చూద్దాం.

1. ఫ్రిజ్ ఏ దిక్కున పెట్టాలి?
ఇంట్లో ఫ్రిజ్ పెట్టాలంటే వాస్తు ప్రకారం పెట్టాలి. అలాగే ఎప్పుడూ ఫ్రిజ్‌ని పశ్చిమ లేదా నైరుతి దిశలో ఉంచండి. ఫ్రిజ్‌ని గోడకు వ్యతిరేకంగా కాకుండా కనీసం ఒక అడుగు దూరంలో ఉంచాలి. ఫ్రిజ్‌ని ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది.
2. బంగారం, డబ్బు
చాలా మంది ఇంట్లో ఫ్రిజ్ పైన డబ్బు, బంగారం తదితరాలు ఉంచుతారు. ఇలా ఫ్రిజ్‌లో డబ్బును ఉంచితే డబ్బు నష్టమే. అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే.. డబ్బును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వ్యాపారంలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్ి వస్తుంది.
3. బహుమతులు, సావనీర్లు
కొంతమంది తమ ఇంట్లోని ఫ్రిజ్‌లో బహుమతులు, సావనీర్‌లు మొదలైనవాటిని ఉంచుతారు. కానీ అలా పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే ఇది ఆ ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుంది.
4. మందులు
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రథమ చికిత్స కిట్ ఉంటుంది. చాలా మంది ఆ మందుల క్యాబినెట్లను ఫ్రిజ్ పైన ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం మందులను ఫ్రిజ్ పైన పెట్టకూడదు. అలా వాడితే ఆరోగ్యం పాడవుతుంది.
5. వెదురు మొక్క
వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్కను ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. అందం కోసం చాలా మంది ఆ వెదురు మొక్కను ఫ్రిజ్ పైన పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం వెదురు మొక్కను ఇలా ఫ్రిజ్ పై పెడితే డబ్బు, ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఈ తప్పు చేయవద్దు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications