Latest Updates
-
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.!
లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఇంట్లో ఎక్కడ ఫోటోలను పెట్టాలో తెలుసా?
హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీ దేవిని సంపదకు, శ్రేయస్సుకు అధిపతిగా చూస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, ధనలాభం సిద్ధించాలన్నా లక్ష్మీ దేవి కటాక్షం కోసం పూజిస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆర్థికంగా, శ్రేయస్సు పరంగా బాగుంటుందని హిందువుల విశ్వాసం. అయితే లక్ష్మీ కటాక్షం అందరికీ సిద్ధించదు. వారి వారి గ్రహాల ప్రభావం, చెడు కర్మలు సహా వివిధ కారణాల వల్ల లక్ష్మీ దేవి వారిని అనుగ్రహించదు. అలాంటి కారణాల్లో ఇంట్లోని ఫోటోలను తప్పుగా ఉంచడం కూడా ఒకటి.
వాస్తు ప్రకారం ఇంట్లో చేసే చిన్న చిన్న పనులు కూడా మన జీవితంపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే ఇంట్లో లక్ష్మీ దేవి ఫోటోను ఉంచే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. తెలియకుండా అయినా సరే కొన్ని పొరపాట్లు చేయకూడదు. అలాంటి తప్పుల వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభించకపోగా, ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మరి ఇంట్లో లక్ష్మీ ఫోటోలను ఎలా ఉంచాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉంచితే వాస్తు ప్రకారం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోలను ఎక్కడ ఉంచాలి?
లక్ష్మీ దేవి ఫోటోను ఇంట్లో ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఈశాన్య మూల. ఈశాన్య మూలలో లక్ష్మీ ఫోటోను ఉంచడం వీలు కాకపోతే తూర్పు లేదా ఉత్తరం వైపున ఉంచవచ్చు. ఇంట్లో పూజా గదిలో ఉంచడానికి శ్రేష్టమైన ప్రాంతం. పూజ చేసే ఫోటోలు తూర్పు, లేదా ఉత్తరం వైపు చూస్తున్నవై ఉండాలి. అలాగే ఎట్టిపరిస్థితుల్లో లక్ష్మీ దేవి ఫోటోలు దక్షిణ దిశలో ఉంచవద్దు. అలాగే లక్ష్మీదేవి ఫోటో దగ్గర విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచడం మంచిది. పూజా గదిలో అయినా, ఇంట్లోని హాలులో అయినా ఒకటికి మించి లక్ష్మీ ఫోటోలు ఉంచకపోవడమే ఉత్తమం.
ఎలాంటి ఫోటోలను ఉంచాలి?
లక్ష్మీ దేవి ఫోటోల్లో దాదాపుగా రెండు చేతులతో సంపదను ప్రసాదించడం కనిపిస్తుంది. అది లక్ష్మీ దేవి స్వభావాన్ని చెబుతుంది. సానుకూల శక్తులను ప్రతిబింబించే ఎరుపు, బంగారు చీరను ధరించి కనిపిస్తుంది. అలాగే పెద్ద తామర పువ్వుపై కూర్చొని ఉంటుంది. ఫోటోల్లో కనిపించే తామర పువ్వు అన్ని అసమానతలను సవరించి మంచి చేస్తుంది. బురదలో పెరిగే తామర పువ్వు.. కష్టాలు ఎదుర్కొన్నా తగిన ప్రతిఫలం తప్పక ఉంటుంది అనే సూక్తిని తెలియజెబుతుంది. జీవితంలో సత్కార్యాలు చేసే వారికి లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుందని అంటారు.
లక్ష్మీ విగ్రహం:
ఇంట్లో లక్ష్మీదేవి నిలువెత్తు విగ్రహం పెట్టవద్దు. లక్ష్మీదేవి అలా ఉండటం శ్రేయస్కరం కాదు. నిలబడి ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధించదని నమ్మకం. అలాగే లక్ష్మీదేవి వాహనం గుడ్లగూడ అని తెలిసిందే. అయితే లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహాన్ని ఆమె వాహనమైన గుడ్లగూబతో ఉండకుండా చూసుకోవాలి. కమలంపై కూర్చున్న లక్ష్మీదేవినే పూజించాలి. అలాంటి ఫోటో లేదా విగ్రహమే సంపదను, శ్రేయస్సును ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎలాంటి ఫోటోలు కొనాలి?
* తామరపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను కొనాలి.
* ఫోటోలో లక్ష్మీదేవి పాదాలు కనిపించకుండా ఉండాలి.
* లక్ష్మీదేవికి ఇరువైపులా ఏనుగులతో ఉన్న ఫోటో చాలా మంచిది.
* ఏనుగులు తమ తొండాలతో నాణేలను కురిపిస్తే, అది ఇంటికి సంపదను, డబ్బును ఆకర్షిస్తుంది.
* ఫోటోలో లక్ష్మీదేవి చిరునవ్వుతో తన చేతుల్లోంచి సంపదను కురిపిస్తూ ఉండాలి.
* గుడ్లగూబ వాహనం ఉన్న లక్ష్మీదేవి ఫోటోలు కొనవద్దు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications