Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Vastu Tips for New Year 2023: కొత్త సంవత్సరాన్ని ఈ వాస్తు చిట్కాలతో ఆహ్వానిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది
కొత్త సంవత్సరం విజయవంతంగా సాగాలంటే చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం, శ్రేయస్సు సిద్ధిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరం అయినా బాగుండాలని కొందరు, కొత్త ఏడాది కూడా సాఫీగా, ఆనందంగా సాగాలని మరికొందరు కోరుకుంటున్నారు. 2023 సంవత్సరం తొలి రోజు నుండి ఆనందోత్సహాలతో సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే 2023 కొత్త ఏడాది చాలా సంతోషంగా సాగుతుంది.

కొత్త సంవత్సరం విజయవంతంగా సాగాలంటే చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం, శ్రేయస్సు సిద్ధిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరాన్ని ఎలా స్వాగతించాలి?
* కొత్త సంవత్సరాన్ని మొదటి రోజు కాబట్టి, తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఉత్తరం లేదా తూర్పు దిక్కున ఉండే కిటికీలు తెరవడం ద్వారా సానుకూలతను ఇంట్లోకి ఆహ్వానించాలి.
* ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి.
* బూజు లాంటివి ఉంటే క్లీన్ చేసుకోవాలి. కిటికీలు, అద్దాలు, ఫ్యాన్‌లు, మంచాల కింద కూడా శుభ్రం చేసుకోవాలి.
* దేవతా విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి.
* కొత్త సంవత్సరం రోజు వీలైతే ఒక మొక్కను నాటడం మంచిది.
* కొత్త సంవత్సరాన్ని తీపిగా ఆహ్వానించడానికి మిఠాయిలు, స్వీట్లు తయారుచేసుకుంటే బాగుంటుంది.
* సూర్యుడికి, భూమాతకు నీరు సమర్పించి వేడుకోవాలి.
* ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేసుకోవడం ద్వారా పాజిటివ్ వైబ్స్ వస్తాయి.
* కొత్త సంవత్సరం తొలి రోజు ఏదైనా దేవాలయానికి వెళ్లి ఇష్టదైవాన్ని పూజించడం మంచిది.
* ఇది బ్రాండ్ న్యూ ఇయర్ కాబట్టి కొత్తగా, స్వచ్ఛంగా ఉండేలా చూసుకోండి.

కొత్త సంవత్సరంలో వీటిని ఇంటికి తీసుకువస్తే అంతా మంచే జరుగుతుంది:
లోహపు తాబేలు:
తాబేలు ఇంటికి శుభప్రదం. లోహపు తాబేలును ఇంట్లో ఉంచడం ద్వారా ఆనందం, శ్రేయస్సు సిద్ధిస్తాయి. వీటి వల్ల సంపద వస్తుంది. ఇంటిపై ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి.

పిరమిడ్:
ఇంట్లో సానుకూలతను కాపాడుకోవడం ముఖ్యం. ఇది వ్యాపారంలో శ్రేయస్సును తీసుకువస్తుంది. పిరమిడ్ తీసుకువచ్చి పూజాగదిలో ఉంచుకోండి.

గోమతీ చక్రం:
గోమతీ చక్రం ఇంట్లోని చెడును తొలగిస్తుంది. కుటుంబసభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూస్తుంది. ఇంటి దోషాలను తొలగిస్తుంది.

నెమలి ఈకలు:
ఇవెంతో శుభప్రదమైనవి. ఇవి ఇంటికి సానుకూలతను, అదృష్టాన్ని తీసుకువస్తాయి.

తులసి మొక్క:
శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని తులసి మొక్క తీసుకువస్తుంది. ఇంటికి తులసి మొక్క తీసుకురావడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

ముత్యాల శంఖం:
ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా చూస్తుంది. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ముత్యాల శంఖం ఉంచుకోవడం వల్ల సంబంధాలు బాగుంటాయి. కుటుంబసభ్యుల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications