Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బెస్ట్ బిజినెస్ ఇదే : కుంభమేళా డబ్బులతో ఖరీదైన కారు కొన్న బాబా..ఒంటి చేత్తోనే డ్రైవింగ్..వీడియో
ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26,2025 వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహాకుంభ మేళా జరిగిన విషయం తెలిసిందే. ఈ మహాకుంభ మేళా జరుగుతున్న సమయంలో చాలామంది తమ చిత్ర విచిత్ర విన్యాసాలు, రకరకాల కారణాలతో చాలా పాపులర్ అయ్యారు. కుంభమేళా కొందరి జీవితాలను కొత్త మలుపు తిప్పింది. కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా అనే అమ్మాయి తన బ్యూటీ కారణంగా రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. పెద్ద సెలబ్రిటీస్ ప్టేటస్ వచ్చింది.
చాలామంది బాబాలు కూడా కుంభమేళాలో ఫేమస్ అయ్యారు. 20 ఏళ్లుగా ఓ చేతిని ఎప్పుడూ ఓ చేయిని పైకి ఎత్తిపెట్టే ఉండే ఓ బాబా కూడా కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు..తాజాగా ఈ బాబా ఓ ఖరీదైన కారు కొన్నారు. అది కూడా కుంభమేళా సమయంలో వచ్చిన డబ్బులతో ఖరీదైన కారుని ఆయన కొనడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా బాబాలకు డబ్బుమీద వ్యామోహం ఉండదని, ల్యాండ్స్ మీద ఇష్టం ఉండదని, ఫేమ్ అంటే నచ్చదని, అనుచరులు ఉండాలని కోరుకోరని అంటుంటారు. అయితే ప్రస్తుతం కొంతమంది బాబాలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నారు. కొందరి బాబాల శృంగార వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే తాజాగా కుంభమేళాలో గట్టిగా సంపాదించిన బాబా ఎస్ యూవీ కారుని కొనడంకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో..కుంభమేళా ఫేమస్ బాబా ఓ షోరూమ్ లో SUV కారు డెలివరీ తీసుకుంటున్నట్లు ఉంది. కారు తాళం తీసుకుని దానిని షోరూమ్ నుంచి బయటకు తీసుకొని పోయినట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే రోడ్డుమీద కారు నడుపుతున్నప్పుడు బాబా తన ఒక చేయిని ఎత్తే ఉంచి ఒక చేత్తోనే కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఉంది.బెస్ట్ బిజినెస్ ఫరెవర్ అంటూ కుంభమేళా ట్యాగ్ ను జత చేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా దీనిని చూసిన నెటిజన్లు..ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
బాబాజీలు డ్రైవింగ్ కూడా చేస్తారా అని కొందరు..ఒక చేత్తో నడుపుతున్నాడు కదా గేర్లు ఎలా మారుస్తాడు అని ఇంకొందరు..ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఒంటి చేత్తో డ్రైవింగ్ చట్టబద్దమేనా?..సన్ రూఫ్ ఉన్న కారు కొంటే చేయి ఎత్తి ఉంచేదానికి బాగుండేదిని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాబా కారు కొనడంలో తప్పేముందని మనికొందరు ఆయనని సమర్థిస్తున్నారు.



Click it and Unblock the Notifications