అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..

పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు..అమ్మాయి,అబ్బాయి ఫోన్ లో మాట్లాడుతున్నారు. తర్వాత కలుసుకున్నారు. ఒక నెలలోనే ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. పెళ్లి చేసుకున్నాక అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటూ తమ జీవితం గురించి కలలు కంటూ ఉండేవాళ్లు. అయితే సడెన్ గా అన్నీ తల్లకిందులయ్యాయి. వీరి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి..నెటిజన్లు ఉచిత సలహాలు ఇచ్చేదాకా వచ్చేసింది.

అసలేం జరిగిందంటే..

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడ్డిట్ లో తాజాగా ఒక యువతి ఒక పోస్ట్ పెట్టింది. అందులోకి వివరాల ప్రకారం..ఆ అమ్మాయికి 27 ఏళ్లు.పెళ్లి చేయాలని నిర్ణయించి పెద్దలు ఒక సంబంధం చూశారు. అబ్బాయికి 28 ఏళ్లు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరూ బాగా దగ్గరయ్యారు.

Viral news woman cancels arranged marriage proposal over he is non virgin

అయితే ఒకరోజు మాటల మధ్యలో నీ గతం గురించి చెప్పు అని ఆ అమ్మాడు అడగంతో.. యువకుడు తాను గతంలో ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, దాదాపు 3 ఏళ్లు తాము ప్రేమించుకున్నాం కానీ కులం అనే కారణంతో తాము విడిపోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ విషయం విన్న తర్వాత ఆ అమ్మాయి తనకు వర్జిన్ కాని అబ్బాయి వద్దు అంటూ ఆ పెళ్లి ప్రపోజలు క్యాన్సిల్ చేసేసింది. అతడి నెంబర్ బ్లాక్ చేసింది.

పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!

అయినప్పటికీ రకరకాల మార్గాల ద్వారా ఆమెను కాంటాక్ట్ చేస్తూ తనను పెళ్లి చేసుకోవాలని కోరడం మొదలెట్టాడు. దీంతో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం రెడ్డిట్ లో పోస్ట్ పెట్టిన ఆ అమ్మాయి..వర్జిన్ కాని అబ్బాయిని తాను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని, ఏదో ఒక రోజు సమస్య అవుతుందని తెలిసి కూడా వేరే కులం అమ్మాయితో అతడు ఎందుకు డేటింగ్ చేశాడు, నేను వద్దు అంటున్నా కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నన్పు వెంటపడుతున్నాడు అంటూ ఆమె తన పోస్ట్ లో తెలిపింది.

Viral news woman cancels arranged marriage proposal over he is non virgin

అతడిని పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా తన నిర్ణయం అని అతడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటూ ఆ పోస్ట్ లో తెలిపింది. ఇక, ఆ అమ్మాయి పోస్ట్ చదివిన తర్వాత నెటిజన్లు తమకు తోచిన ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్లకి ఉంటాయి అంటూ ఆ అమ్మాయి నిర్ణయానికి కొందరు సపోర్ట్ చేస్తుండగా...అసలు నువ్వు వర్జిన్ వేనా అని ప్రశ్నిస్తూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. నువ్వు వర్జిన్ అయితే..వర్జిన్ ని డిమాండ్ చేయవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Story first published: Tuesday, October 20, 2026, 23:22 [IST]
Desktop Bottom Promotion