Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కారును గాడిదలకు కట్టి బ్యాండ్ సెట్ తో షోరూమ్ వరకు ఊరేగించిన ఓనర్, గాడిదలు మేలు
కొత్త కారు తీసుకుని భార్యతో కలిసి హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చెయ్యలని ఓ వ్యాపారి అనుకున్నాడు. లక్షల రూపాయలు ఇచ్చి షోరూమ్ లో కారు తీసుకున్నాడు. కొత్త కారుతో ఆ వ్యాపారి విసిగిపోయాడు. గాడిదలకు కారు కట్టేసి గాడిదల ముందు బ్యాండ్ సెట్ పెట్టుకుని ఊరేగింపుగా ఆ కారును కార్ల షోరూమ్ దగ్గరకు తీసుకెళ్లడంతో ఆ కార్ల షోరూమ్ యాజమాన్యం బిత్తరపోయింది.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో రాజ్ కుమార్ అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఉదయ్ పూర్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కార్ల షోరూమ్ కు వెళ్లిన రాజ్ కుమార్ మంచి కారు సెలెక్ట్ చేసుకున్నాడు. కారు ఖరీదు రూ. 18 లక్షలు. రూ. 18 లక్షలు పోయినా పర్వాలేదు. కారు నచ్చింది అని రాజ్ కుమార్ భార్య చెప్పడంతో ఆతను ఖుషీ అయ్యాడు.

భార్య ఇష్టపడిన కారును రాజ్ కుమార్ ఇటీవల కొనుగోలు చేశాడు. కార్ల షోరూమ్ లో కారు డెలవరీ తీసుకున్న టైమ్ సరిగాలేదో, లేక రాజ్ కుమార్ కు గ్రహాలు అనుకూలించలేదో తెలీదు కాని ఆ కారు పదేపదే రిపేర్లు రావడం మొదలుపెట్టింది. షోరూమ్ లో తీసుకున్న కారు రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ నిలిచిపోవడం మొదలుపెట్టింది.
ప్రతిసారి కార్ల షోరూమ్ కు ఫోన్ చేస్తున్న రాజ్ కుమార్ మెకానిక్ ను పిలిపించుకుని కారు రిపేర్ చేయించుకుని తిరగడం మొదలుపెట్టాడు. అయితే కారు వచ్చిన వేళావిశేషం బాగాలేకపోవడంతో ఆ కారు నడిరోడ్డు మీద వేగంగా వెలుతున్న సమయంలో మోరాయించడంతో ఆ కారు యజమాని రాజ్ కుమార్ కు ఓపిక నశించిపోయింది.
రెండు గాడిదలను అద్దెకు తీసుకున్న రాజ్ కుమార్ అతని కారును ఆ గాడిదలకు తాళ్లతో కట్టేశాడు. గాడిదల ముందు పెద్ద బ్యాండ్ సెట్ పెట్టించి డప్పులు, వాయిద్యాలతో ఆ కారును గాడిదలలో ఈడ్చుకుంటూ కారు షోరూమ్ దగ్గరకు వెళ్లారు. మీరు నాకు రూ. 18 లక్షలకు అమ్మిన కారును చివరికి ఈ గాడిదలు ఈడ్చుతున్నాయి, ఇక నాకు ఓపికలేదు అంటూ రాజ్ కుమార్ కారు షోరూమ్ యాజమాన్యం ముందు అసహనం వ్యక్తం చేశాడు.
పదేపదే కారు రిపేర్ కు గురౌతున్నదని, షోరూమ్ నిర్వహకులు, కారు సర్వీస్ సెంటర్ నిర్వహకులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేసినా వారు మాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే గాడిదలకు ఆ కారు కట్టి నేరుగా వారి షోరూమ్ దగ్గర వదిలేశానని, ఇలాంటి కారు తనకు వద్దని వ్యాపారి రాజ్ కుమార్ స్థానిక మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు గాడిదలకు కారు కట్టి బ్యాండ్ సెట్ తో కార్ల షోరూమ్ దగ్గరకు వెలుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Click it and Unblock the Notifications