Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
MRO In Kantara Getup: కాంతారా గెటప్ లో విజయనగరం ఎమ్మార్వో.. కుమ్మేశాడుగా
విజయనగరంలోని కొత్తవలస తహసీల్దార్ ప్రసాదరావు కాంతార గెటప్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
MRO In Kantara Getup: కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన కాంతారా సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా రికార్డులను బద్దలు కొట్టింది. క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ మూవీ మొత్తానికి హైలెట్ గా నిలిచింది. అందులో రిషబ్ శెట్టి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. చివర్లో భూతకోళ గెటప్ లో రిషబ్ శెట్టి చూసిన వారు అంత ఈజీగా మర్చిపోరు.

ఇప్పుడు అదే గెటప్ లో విజయనగరంలోని కొత్తవలస తహసీల్దార్ ప్రసాదరావు కాంతార గెటప్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రసాదరావు తన సుదీర్ఘమైన ఏకపాత్రాభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. నాలుగు రోజులుగా గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఆరో ఎడిషన్ జరుగుతోంది. ఇందులో రెవెన్యూ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఇందులో భాగంగా కొత్తవలస తహసీల్దార్ ప్రసాదరావు చేసిన ఏకపాత్రాభినయం ఈ ఈవెంట్ కే హైలెట్ గా నిలిచింది.
కాంతారా గెటప్ వేసి తన ప్రతిభతో అందరినీ మంత్రముగ్దులను చేసిన ప్రసాదరావును ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ప్రశంసించారు. ఈ పోటీల్లో ప్రసాదరావుకే ప్రథమ బహుమతి అందించారు. కొత్తవలస ఎమ్మార్వో ప్రసాదరావు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Click it and Unblock the Notifications