Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ప్రపంచంలోనే అత్యంత చౌకైన హోటల్..ఒక రాత్రికి రూ.22 మాత్రమే..ఎక్కడుందో తెలుసా?
ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లాలన్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేవి రైలు, బస్సు లేదా విమాన టిక్కెట్లు. అవి బుక్ అయ్యాక మన బడ్జెట్ కు సరిపోయే మంచి హోటల్ కోసం వెతుకులాట మొదలవుతుంది. మధ్యతరగతి ప్రయాణికులు ఎప్పుడూ తక్కువ ధరలో మంచి హోటల్ రూమ్ దొరికితే బాగుండని ఆశిస్తారు.
కానీ చౌక అనే పదానికి కూడా ఓ హద్దు ఉంటుంది. అలాంటిది మీరు రోజూ తాగే ఒక కప్పు టీ ధరకే ఓ హోటల్‌లో రాత్రంతా బస చేయవచ్చంటే నమ్ముతారా? ప్రపంచంలోనే అత్యంత చౌకైన హోటల్ మీకు కేవలం 22 రూపాయలకే ఆశ్రయం కల్పిస్తోంది.

వైరల్ వీడియో.. వెలుగులోకి వచ్చిన నిజం
ఈ ఆశ్చర్యకరమైన హోటల్ గురించి ఐర్లాండ్ కు చెందిన ట్రావెల్ వ్లాగర్ డేవిడ్ సింప్సన్ తన ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. అతను షేర్ చేసిన వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లక్షలాది మంది ఈ వీడియోను చూసి నివ్వెరపోయారు. ఇంత తక్కువ ధరకు హోటల్ ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏంటి?
ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఈ హోటల్ మన దాయాది దేశం పాకిస్తాన్ లోని పెషావర్ లో ఉంది. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి అయ్యే ఖర్చు 70 పాకిస్తానీ రూపాయలు. మన భారత కరెన్సీలోకి మార్చుకుంటే ఇది కేవలం 22 రూపాయలకు సమానం.
భారతదేశంలోని చాలా నగరాల్లో ఒక మంచి టీ తాగాలన్నా ఇంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది. అలాంటిది ఒక రోజంతా ఉండటానికి ఇంత తక్కువ ధర వసూలు చేయడం నిజంగా వింతే.
ధర ఆకర్షణీయమే కానీ పరిస్థితులు భయానకం
అయితే ఈ ధరను చూసి ఆశపడితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ హోటల్ లోని పరిస్థితులు మిమ్మల్ని నివ్వెరపరుస్తాయి. ఇక్కడ విలాసవంతమైన గదులు, మెత్తటి పరుపులు ఉండవు. కనీసం ప్రత్యేకమైన గదులు కూడా ఉండవు.
హోటల్ మొత్తం చాలా మురికిగా, తీవ్రమైన దుర్వాసనతో నిండి ఉంటుంది. అతిథులు పడుకోవడానికి ఇచ్చేవి కేవలం పాత నవారు మంచాలు. ఒక పెద్ద హాలులో వరసగా మంచాలు వేసి ఉంటాయి, వాటిపైనే అతిథులు సర్దుకోవాలి. పరిశుభ్రత అనే మాటకు ఇక్కడ తావులేదు.
సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది..ఏమీ లేని నిరుపేదలకు, రోజువారీ కూలీలకు ఇంత తక్కువ ధరలో తలదాచుకోవడానికి ఓ చోటు దొరకడం గొప్ప విషయం అని ప్రశంసిస్తున్నారు.
మరికొందరు..ఇది హోటల్ కాదు, నరకం అని, ఒక బిచ్చగాడు కూడా ఇక్కడ ఉండలేడు అంటూ దాని దుస్థితిని ఎగతాళి చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ హోటల్ ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత చౌకైనదిగా రికార్డు సృష్టిస్తుండగా, మరోవైపు కనీస మానవ వసతుల లేమికి, పేదరికానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.



Click it and Unblock the Notifications