పనిచేసే చోట వెన్నుపోటు పొడవాలనుకునే వాళ్లు ఉంటారు, వారిని ఇలా హ్యాండిల్ చేయండి

వెన్నుపోటు పొడిచే వ్యక్తులు పైకి బాగానే మాట్లాడతారు. కానీ మన వెనక కత్తులు దూస్తారు. లేనిపోనివి చెబుతుంటారు. మన ఎదుగుదలను ఆపాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పని చేసే చోట, ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రతి చోట వెన్నుపోటు పొడిచే వాళ్లు ఉంటారు. వారిని మనం తీసేయలేము. వారితో జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగాల్సిందే. అలాంటి వారు ఒకరి ఎదుగుదలను చూసి తట్టుకోలేరు. ఈర్శ్య వారిని దహించివేస్తుంది. అసూయతో రగిలిపోతూ క్షణం కూడా ప్రశాంతంగా బతకలేరు. అలాంటి వారు మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. వారిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం తప్ప మనం ఏమీ చేయలేం.

backstabbers

వెన్నుపోటు పొడిచే వ్యక్తులు పైకి బాగానే మాట్లాడతారు. కానీ మన వెనక కత్తులు దూస్తారు. లేనిపోనివి చెబుతుంటారు. మన ఎదుగుదలను ఆపాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

backstabbers
  • పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేయాలి. వారి పట్ల స్పందించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంలో అతిగా స్పందించవద్దు. వారు చేసిన ఆరోపణలు నిజం కావని చెప్పడానికి ఆధారాలు ఉండేలా చూసుకోండి.
  • వెన్నుపోటు పొడిచే వ్యక్తి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. వారి ప్రవర్తనను విస్మరించవద్దు. అన్నీ గమనించండి.
  • కొన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. వాళ్లు ఏం చేస్తారో ముందే ఊహించి చెప్పడం వల్ల వాళ్లు వెనక తగ్గుతారు. ఒకటీ రెండు సార్లు ఇలా చేస్తే మీ జోలికి రావడానికి సాహసించలేరు.
  • వెన్నుపోటు పొడిచే వ్యక్తులు గాసిప్స్ ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. వాటిని నమ్మవద్దు. విని ఊరుకోండి.
backstabbers
  • కార్యాలయంలో ఎవరికైనా మీతో పని చేయడం ఇష్టం లేదని వారు చెబితే నేరుగా వారి దగ్గరికే వెళ్లి సమస్య ఏమిటో అడగండి.
  • మెంటర్ సలహాలను పాటించండి. వెన్నుపోటు పొడిచే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో స్నేహాన్ని పెంపొందించుకోవాలి.
  • పనితీరు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. పనిలో నాణ్యత ఉండాలి. పని సక్రమంగా చేస్తే ఎవరూ ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలి.
  • వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో, అతనికి మద్దతు ఇచ్చే వ్యక్తులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. వారి పట్ల వ్యతిరేకత చూపిస్తే వాళ్లు మరింతగా రెచ్చిపోతారు. స్నేహంగా మీకు వ్యతిరేకంగా వ్యూహాలు రచించే అవకాశం తక్కువ.

Story first published: Wednesday, December 28, 2022, 20:00 [IST]
Desktop Bottom Promotion