Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మనిషి పడుకునే విధానాన్ని బట్టి అతను ఎలాంటి వారో చెప్పేయొచ్చు.. మీ భార్య ఎలాంటిదో ఇలా తెలుసుకోండి!
ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి వ్యక్తి లక్షణాలు ఇంకో వ్యక్తి లక్షణాలతో కొద్దిగా భిన్నంగా ఉంటాయి. కళ్ళు, ముక్కు, పెదవులు, చెవులు, ముఖం మొదలైన అవయవాల ఆకృతి మరియు నిర్మాణం మాత్రమే కాకుండా, వ్యక్తి యొక్క కొన్ని అలవాట్లు కూడా వేరే వ్యక్తితో భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి నిద్రించే పొజిషన్ ఆ వ్యక్తి ప్రవర్తన మరియు స్వభావాన్ని తెలియజేస్తుంది.
అధ్యయనాల ప్రకారం, నిద్రించే పొజిషన్, లక్షణాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. అసలు ఎలా పడుకుంటే ఆ వ్యక్తికి ఎలాంటి స్వభావం ఉంటుంది? పడుకునే పొజిషన్ ప్రకారం ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వీపు మీద పడుకుంటే
మీరు వీపు మీద పడుకున్నట్లైతే మీరు సత్యానికి విలువనిచ్చే, బలంగా ఉండే వ్యక్తి అని అర్ధం. మీరు అనవసరమైన గొడవలకు దిగరు. నిజాయితీని నమ్ముకుంటారు. అలాగే ఇతరుల నుంచి ఎక్కువగా నిజాయితీని కోరుకుంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరు గాసిప్ లేదా ప్రతికూల చర్చను అస్సలు పట్టించుకోరు. మీరు అనుభవం సాధించే వృద్ధికి విలువ ఇస్తారు. మీ జీవితం అర్థవంతంగా ఉండాలని మీరు కోరుకుంటారు.
పక్కకు తిరిగి పడుకున్నట్లైతే..
మీకు పక్కకు తిరిగి పడుకునే స్వభావం కలిగి ఉన్నట్లయితే.. మీరు స్నేహపూర్వకంగా ఉంటారు. అలాగే ఎవరితోనైనా స్నేహపూర్వకంగా మాట్లాడతారు. మీరు ఇతరులతో సులభంగా కలిసిపోయే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అయితే, మీరు మీ గురించి విషయాలను అందరితో పంచుకోరు. కానీ మీకు దగ్గరగా ఉన్న వారితో మాత్రమే అన్ని విషయాలను పంచుకుంటారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీ సహాయక స్వభావం మీ సంబంధాలను బలంగా ఉంచుతుంది.
బోర్లా పడుకున్నట్లైతే
మీరు బోర్లా పడుకునే వ్యక్తి ఉన్నట్లయితే మీరు మీ మనసులోని మాటలను బయట పెట్టడానికి అస్సలు భయపడరు. ఈ గుణం మిమ్మల్ని కొందరు తప్పుగా అర్ధం చేసుకునేలా చేస్తుంది. అలాగే మీరు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. మీకు ఆత్మవిశ్వాసం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీ మనసులో ఎప్పుడూ ఎదో ఒక చింత గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అవి మీకు అభద్రతా భావాన్ని కలిగివుండేలా చేస్తుంది. మీకు విమర్శలను అంత సులభంగా అంగీకరించరు. మీరు ధైర్యవంతులై ఉంటారు. అలాగే మీకు ధృడ సంకల్పం ఉంటుంది. మీకు ఎంత కష్టమొచ్చినా మీ జీవితాన్ని ముందుకు సాగించేస్తారు.



Click it and Unblock the Notifications