Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కాలికి నల్లతాడు ఎందుకు కట్టుకుంటారు? దాని ప్రయోజనాలు తెలిస్తే మీరూ కట్టుకుంటారు
ఈ మధ్యకాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది కాలికి నల్లని తాడును కట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు నల్ల దారం కడితే కలిగే ప్రయోజనాల వల్ల కట్టుకుంటే.. ఈ మధ్యకాలంలో ప్రయోజనాలతో స్టైలిష్ గానూ రకరకాల నల్ల దారాలను కాళ్లకు కట్టుకుంటున్నారు. అసలు కాళ్లకు నల్ల దారాలు కట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చెడు దృష్టి:
అసూయ పడే వారు సమాజంలో చాలా మంది ఉంటారు. ఎక్కువగా సంపాదిస్తున్నా, మంచి పేరు అందుకుంటున్నా, ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతున్నా ఇలా వారికి ఏ విషయంలోనైనా పైచేయి సాధిస్తే అసూయ పడి దిష్టి పెడుతుంటారు. ఈ మానవ దిష్టి అనేది శని దోషమంతా ప్రభావవంతమైనది. దీని వల్ల అనేక ప్రతికూలతలు ఎదురవుతాయని అంటుంటారు. అలాంటి వారి చెడు దృష్టి నుంచి తప్పించుకోవడానికి నల్ల దారం అద్భుతమైన పరిష్కారం. ఎడమకాలికి నల్ల దారం కట్టుకుంటే దిష్టి నుంచి తప్పించుకోవచ్చు.
2. శని దోషం తొలగిపోతుంది:
శనికి నలుపు రంగుకు సంబంధం ఉంటుంది. నలుపు రంగు అంటే శనికి ఇష్ట రంగు. నలుపు రంగు దారాన్ని కట్టుకోవాలని సూచిస్తున్నారు. నలుపు రంగు దారం కట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులు నిరోధించబడతాయి. అనుకూల పరిస్థితులు రావాలంటే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
3. ఆర్థిక సమస్యలు:
చాలా మందిని ఆర్థిక సమస్యలు వేధిస్తుంటాయి. కొద్దిగా ఎక్కువా తక్కువా ఆర్థిక సమస్యలు ప్రతి వ్యక్తికీ ఉంటాయి. కొందరు చాలా కష్టపడతారు. ఆ ఫలితానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అంటే ఆదాయం వస్తుంది. కానీ ఆ ఆదాయం చేతిలో నిలవదు. మంచి నీళ్ల ప్రాయంలా తరలిపోతుంది. అనవసర ఖర్చులు ఎక్కువవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చుల వల్ల అప్పుల పాలు కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు కుడి కాలిసి నల్ల దారం కట్టుకుంటే.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది.
4. రాహు - కేతు:
జాతకంలో రాహు, కేతు దోషాలు చాలా మందికి ఉంటాయి. ఈ రాహువు, కేతువు దోషాల వల్ల కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి రాహు- కేతు దోషాల నుంచి విముక్తి పొందడానికి ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమస్యలు తొలగిపోవడానికి నల్లని దారం మంచి పరిష్కారం.
5. జీవితంలో విజయం సాధిస్తారు:
అన్ని గ్రహాల్లోకెల్లా శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శని సంతోషంగా ఉంటే జీవితంలో అన్నీ అనుకూలిస్తాయి. శని ప్రభావం ప్రతికూలంగా ఉంటే జీవితంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలికి నల్ల దారం కట్టుకుంటే శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. దీని వల్ల తలపెట్టిన పనులు పూర్తవుతాయి. విజయాలు పొందుతారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications