Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒళ్లుగగుర్పొడిచే ఈ ఆటలు మనుషులకు బదులు జంతువులే ఆడతాయి
భారత్.. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయలకు నెలవు. సాంప్రదాయ ఆటలు దేశ వారసత్వాన్ని చాటి చెబుతాయి. దేశవ్యాప్తంగా మనుషులతో పాటు జంతువులూ ఆడే ఆటలు చాలానే ఉన్నాయి. ఈ ఆటలు కొన్నింటిలో మనుషుల పాత్ర కేవలం పక్కన కూర్చొని ఆట చూడటం అంతే. కొన్ని అసాధారణమైన ఆటలు చూస్తే గగుర్పాటుకు గురవ్వడం సహజం. బుల్ రేసింగ్, కోళ్ల కొట్లాట, మేకపోతుల ఫైట్.. లాంటివి ఆటలు సాంప్రదాయంగా వస్తున్నాయి. దేశ చారిత్రక ఆచారాలను, సాంప్రదాయాలను ప్రతిబింబించే కొన్ని జంతు క్రీడలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కంబాలా:
కర్ణాటకలో ఆడే ఈ ఆట దేశవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్. కంబాలాగా పిలిచి ఈ ఆటలో రెండు ఎద్దులే ప్రధాన పోటీ దారులు. విప్ విల్డింగ్ హ్యాండర్లు కూడా ఎద్దులతో పాటు ఉంటారు. రెండు ఎద్దులు, వాటిని నియంత్రించేందుకు ఓ వ్యక్తి... ముగ్గురు కలిసి కట్టుగా, జట్టుగా ఆడి.. వేగంగా పరిగెత్తి విజయం సాధించాల్సి ఉంటుంది. గగుర్పాటుకు గురి చేసే ఈ ఆటలో ప్రమాదం కూడా చాలా ఎక్కువే.
2. పోతుల ఫైట్:
కేరళ గ్రామీణ ప్రాంతాల్లో ఈ రామ్ ఫైటింగ్ ఇప్పటికీ ఆడుతుంటారు. ఇందులో కొమ్ములు తిరిగిన రెండు మేకపోతులు తమ శక్తినంతా దారబోసి తలలో భీకరంగా దాడి చేసుకుంటాయి. ఆ ఆట కోసం ప్రత్యేకంగా మేక పోతులను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. వాటికి బలవర్దకమైన ఆహారం అందించి పుష్టిగా తయారు చేస్తారు. వాటికి పోరాటంలో శిక్షణ ఇప్పించి రామ్ ఫైటింగ్ కు సిద్ధం చేస్తారు.
3. ఎలిఫెంట్ పోలో:
రాజస్థాన్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈ క్రీడ కనిపిస్తుంది. సాధారణంగా పోలో క్రీడ అంటే గుర్రాలపై కూర్చొని హాకీ ఆడటం. అయితే ఈ ఎలిఫెంట్ పోలో క్రీడలో గుర్రాల స్థానంలో ఏనుగులు ఉంటాయి. ఈ ఎలిఫెంట్ పోలో క్రీడలో ఏనుగులపై ఇద్దరి వ్యక్తులు కూర్చుంటారు. ఒకరు ఏనుగును కావాల్సిన వైపు నడిపిస్తే.. మరొకరు చేతిలో స్టిక్ తో బంతిని గోల్ పోస్టు వైపు కొడతారు.
4. బుల్ రేస్:
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బుల్ రేస్ లు నిర్వహిస్తుంటారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాయ్‌పూర్ లాంటి ప్రాంతాల్లో ఎద్దులతో రేస్ లు నిర్వహిస్తారు. ఎద్దులకు చిన్న బండి కట్టి దాంట్లో ఉండి రేస్ లో పాల్గొంటారు. మరికొన్ని చోట్ల ఎద్దులు భారీ బరువు ఉండే రాళ్లను లాగుతుంటాయి. తమిళనాడులో జల్లికట్టు ఆట కూడా దేశంలో చాలా ప్రసిద్ధి.
5. కోడి పందాలు:
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఆట. ఏటా జనవరి మాసంలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా స్థానికులు కోడి పందేలు నిర్వహిస్తారు. వీటి కోసం ప్రత్యేకంగా కోళ్లను తీర్చిదిద్దుతారు. వాటికి జీప్పు, బాదం లాంటి డ్రైఫ్రూట్స్, మంచి పోషకాహారం అందిస్తారు. పందెం సమయంలో వీటి కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతారు. రెండు కోళ్లు హోరాహోరీగా పోరాడి ఒకదాని దెబ్బలకు, కత్తి పోట్లకు మరొకరి ప్రాణాలు విడిచేంత వరకు పోరాడుతూనే ఉంటాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications