Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
Weird Tradition: విదేశీయులకు వింతగా అనిపించే మన దేశ ఆచారాలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కుల, మతాలతో సంబంధం లేకుండా వారి వారి సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తుంటారు. అందులో కొన్ని మనకు చాలా వింతగా, విచిత్రంగా అనిపిస్తుంటాయి. కొన్ని ఆచారాలు చూస్తే ఇదేంటి ఇలా చేస్తున్నారు అని మనసులో అనిపిస్తుంది.
అవి పాటించే వారికి కొత్తగా అనిపించకపోయినా, కొత్తగా చూసే వారికి వింతగా అనిపించడం సహజం. అలాంటి కొన్ని భారతీయ ఆచారాలను విదేశీయులు చూస్తే వింతగా ఫీలవ్వడం పక్కా. విదేశీయులకు వింతగా అనిపించే మన దేశ ఆచారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాళ్లను తాగి ఆశీస్సులు తీసుకోవడం:
భారత దేశ వ్యాప్తంగా పాటించే ఆచారం ఇది. పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికి వంగి వారి కాళ్లకు తాకుతాం. వాళ్లు మన తలపై చేయి పెట్టి దీవిస్తుంటారు. పెద్దలకు మనం ఇచ్చే గౌరవం కూడా. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలా కాళ్లు తాకి ఆశీర్వాదాలు అడుగుతాం. అయితే విదేశాల్లో ఇలా పెద్దలను ప్రత్యేకంగా గౌరవించే ఆచారం ఉండదు. మరి ఇది వారికి వింతగానే అనిపిస్తుంది కదా..
పెద్దలను పిలిచేటప్పుడు బంధుత్వం కలపడం:
పెద్దలను పిలిచేటప్పుడు అంకుల్, ఆంటీ, తాత అంటూ సంబోధిస్తూ పిలవడం మనకు చాలా సహజం. వారితో ఎలాంటి బంధుత్వం లేకపోయినా, వారిని చూడటం అదే తొలిసారి అయినప్పటికీ అలా అంకుల్, ఆంటీ అని పిలవడం మనకు చిన్నప్పటి నుంచి అలవాటైన పిలుపు.
తల్లిదండ్రులతో కలిసి ఉండటం:
చాలా దేశాల్లో తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ఉండటం అనేది ఉండదు. ఒక వయస్సు వచ్చాక పిల్లలు ఇల్లు వదిలి వెళ్లిపోతుంటారు. ప్రత్యేక సందర్భాల్లో, శుభకార్యాల వేళ మాత్రమే అందరూ కలుస్తుంటారు. భారత్ లో మాత్రం తల్లిదండ్రులతో కలిసి జీవించడం సహజం.
నీటితో శుభ్రం చేసుకోవడం:
చాలా దేశాల్లో టాయిలెట్‌కు వెళ్తే టాయిలెట్ పేపర్ వాడి శుభ్రం చేసుకుంటారు. భారత్ లో మాత్రం నీటిని వాడతారు. ఇక్కడ పేపర్లు వాడటం వింత, అక్కడి వారికి నీటిని వాడి శుభ్రం చేసుకోవడం వింత.
కుల విధానం:
భారత్ లో ఎన్నో మతాలు, ఆ మతాల్లో వివిధ కులాలు. విదేశాల్లో క్లాస్ సిస్టమ్ ఉంటుంది. కానీ క్యాస్ట్ సిస్టమ్ ఉండదు. మన దగ్గరు స్థాయి భేదం ఉండదు కానీ, కుల భేదం ఉంటుంది.
పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు:
పెద్దలు పెళ్లి కుదర్చడం మన దగ్గర చాలా సహజం. అయితే విదేశాల్లో కాదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పిల్లలు ఎవరికి నచ్చిన వారిని వాళ్లు చేసుకుంటారు. పెళ్లికి తల్లిదండ్రులను అతిథులుగా ఆహ్వానిస్తారు. ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు పెరిగినప్పటికీ.. కుటుంబసభ్యుల అనుమతి కోసం ప్రయత్నించడం సహజం. ప్రేమ పెళ్లి కూడా పెద్దలకు నచ్చాలని భావిస్తాం. వాళ్లు ఒప్పుకుంటారా, లేదా అనేది వేరే విషయం.
డ్రై డే:
మన దగ్గర గాంధీ జయంతి రోజు, పెద్ద పెద్ద పండగల రోజు ప్రభుత్వ సెలవు ప్రకటిస్తుంది. కానీ ఆరోజు వైన్ షాపులకు కూడా సెలవు ఇస్తుంది. పబ్లిక్ హాలిడే రోజుల్లో మద్య నిషేధం మన దగ్గరే ఉంటుంది.



Click it and Unblock the Notifications