Latest Updates
-
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా.. -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ..
Weird Things: ఈ విచిత్రమైన విషయాలన్నీ మనకు చాలా కామన్, అవేంటంటే?
భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలు, వైరుధ్యాల మిశ్రమం. శక్తివంతమైన అలాగే ఆసక్తికరమైన దేశం కూడా. ఇక్కడ ఉన్నన్ని ఆచారాలు, సాంప్రదాయాలు చాలా దేశాల్లో కనిపించవు. ఇక్కడ ఉన్నన్ని కుల, మతాలు, వైరుధ్యాలు ఎక్కడా ఉండవు. అయితే మన దేశంలో మనకు సాధారణంగానే కనిపించే వింతలు చాలానే ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..
1. ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు కనిపిస్తాయి:
భారత దేశం అతిపెద్ద లౌకిక దేశం. ఇక్కడ ఉన్నన్ని మత వైరుధ్యాలు మరెక్కడా ఉండవు. ఇక్కడ హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధం, జుడాయిజం, జైనమతం, సిక్కు సహా అనేక మతాల వారు భారత్ లో కనిపిస్తారు.

2. రెండో అతిపెద్ద ఇంగ్లీష్ మాట్లాడే దేశం:
భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ రెండూ అధికారిక భాషలు. ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంటుంది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా, భారత్ ది రెండో స్థానం.
3. ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం:
మిజోరాంలోని బాట్వాంగ్ గ్రామంలో ఓ కుటుంబం దాదాపు 100 గదులతో కూడిన ఇంట్లో నివసిస్తోంది. జియోనా చనా అనే వ్యక్తికి 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు. 14 మంది కుమార్తెలు, 33 మంది మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు. వీరి కుటుంబంలో మొత్తం 181 మంది సభ్యులు ఉంటారు. అయితే జియోనా చనా 2021 లో అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు.
4. మీసం పెంచుకునేందుకు అలవెన్స్:
మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని పోలీసులకు విచిత్రమైన అలవెన్స్ ఇస్తున్నారు. అదేంటంటే.. మీసం పెంచుకున్న పోలీసులకు అది మెయింటైన్ చేయడం కోసమని అలవెన్స్ ఇస్తుంటారు. మీసాన్ని పౌరషానికి ప్రతీకగా చూస్తారు.
5. ఆవులకు గుర్తింపు కార్డులు:
ఆవుల గుర్తింపు కోసం భారత ప్రభుత్వం ఐడీ కార్డులు ఇస్తుంది. ఆవులను కబేళాలకు తరలించకుండా ఈ ఏర్పాటు చేసింది. మనషులకు ఆధార్ కార్డు ఉన్నట్లే ఆవులను ప్రత్యేక ఐడీ కార్డులు ఉంటాయి.
6. సుగంధ ద్రవ్యాల దేశం:
భారత్ సుగంధ ద్రవ్యాల దేశం. మసాలా దినుసులు ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం భారత్. ఇక్కడ అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి. పసుపు, అల్లం, జీలకర్ర, నల్ల మిరియాలు, కొత్తిమీర, సోంపు లాంటి అనేక మసాలా దినుసులు ఇక్కడ లభిస్తాయి. విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి.
7. అతిపెద్ద జనాభా గల దేశం:
భారత్.. చైనాను దాటి అత్యధిక జనాభా గల దేశంగా అవతరించింది. ఐక్యరాజ్య సమితి ఇటీవలె ఈ విషయాన్ని వెల్లడించింది. 142.86 కోట్ల జనాభాతో భారత్ నంబర్ వన్ స్థానంలో ఉంది. చైనా జనాభా 142.57 కోట్లు.
8. విడాకుల శాతం అత్యంత తక్కువ:
పెద్దలు పెళ్లిళ్లు కుదర్చడం భారత్ లో పాటించే సాంప్రదాయం. పెద్దగా పరిచయం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇక్కడా చాలా సాధారణం. అయినప్పటికీ ఇక్కడ విడాకులు శాతం ఇతర దేశాలతో పోలి్తే చాలా చాలా తక్కువ. కేవలం 100లో ఒకరిద్దరు మాత్రమే విడాకులు తీసుకుంటారు.
9. అత్యధిక బంగారం ఉన్న దేశం:
భారత్ లో బంగారం వినియోగం అత్యధికంగా ఉంటుంది. పండగైనా, శుభకార్యమైనా బంగారం కొంటారు. అలా ప్రపంచంలోని 11 శాతానికి పైగా బంగారం భారతీయుల వద్దే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
10. అతిపెద్ద శాకాహార దేశం:
భారతీయుల్లో సగానికి పైగా శాకాహారులు. హిందూ మతంలో పెద్ద భాగం శాకాహారం పాటిస్తుంటారు. అలా భారత్ అతిపెద్ద శాకాహార దేశంగా ఉంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications