Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
పెళ్లిలో తల్లికి నో ఎంట్రీ, కాళ్లు కడిగిన పాలు తాగాలి- విచిత్ర వివాహ ఆచారాల గురించి తెలుసా?
భారత్ లో ఎన్నో సంస్కృతులు, ఇంకెన్నో ఆచారాలు. ప్రాంతాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని బట్టి సాంప్రదాయాలు మారుతూనే ఉంటాయి. విశాలమైన భారత దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎన్నో ప్రాంతాలున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు అనేకానేక ఆచారాలు పాటిస్తుంటారు.
ప్రతి 20 కిలోమీటర్లకు ఆచార వ్యవహారాల్లో చిన్నపాటి తేడాలు గమనించవచ్చునట. పెళ్లి వేడుకనే తీసుకుంటే ఒకే ప్రాంతంలోని కొందరు ఒకరకంగా, మరికొందరు ఇంకోలా వివాహ కార్యాన్ని జరిపిస్తుంటారు. అలా భారత్ లో వింతగా, విచిత్రంగా అనిపించే కొన్ని వివాహ ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. వధూవరుల తల్లులు పెళ్లికి రావొద్దు:
కాళ్లు కడిగి కన్యాదానం చేయాల్సింది తల్లిదండ్రులు. పెళ్లి శుభకార్యంలో తల్లిదండ్రులు కీలకం. అయితే సాంప్రదాయ బెంగాలీ వివాహాల్లో మాత్రం తల్లులకు నో ఎంట్రీ అట. కొడుకు పెళ్లైనా, కూతురు పెళ్లైనా తల్లి వివాహానికి హాజరుకాకూడదు. ఇక్కడ పాటిస్తున్న ఆచారం ఇది. తల్లులు పెళ్లికి వస్తే చెడు ప్రభావం పడుతుందని వారి నమ్మకం. పిల్లల వైవాహిక జీవితంలో కలహాలు వస్తాయని భావిస్తారు. చాలా కాలం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
2. కాళ్లు కడిగిన పాలు తాగాలి:
గుజరాతీ వివాహాల్లో ఒక విచిత్రమైన ఆచారాన్ని పాటిస్తుంటారు. ఎక్కడి పెళ్లిలో అయినా కాబోయే అల్లుడి కాళ్లు కడుగుతుంటారు. కాళ్లు కడిగి కన్యాదానం చేస్తుంటారు. గుజరాతీ వివాహాల్లో కూడా కాబోయే మామగారు వరుడి కాళ్లు కడుగుతారు. పాలు, తేనె కలిపిన మిశ్రమంతో కాళ్లు కడుగుతారు. దీనిని స్థానికంగా మధుపర్క అని పిలుస్తారు. అయితే కాళ్లు కడగడం అయ్యాక.. ఆ కడిగిన పాలను వరుడు తాగాల్సి ఉంటుంది. అదే సాంప్రదాయం.
3. టమోటాలతో స్వాగతం:
చాలా ప్రాంతాల్లో వరుడిని పెళ్లి వేదిక మీదకు ఆహ్వానించడానికి పూలు చల్లుతుంటారు. యూపీలోనూ ఇలాంటి ఆచారం ఉంది. ఉత్తరప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాల్లో అయితే పూలకు బదులు టమోటాలు వాడతారు. వరుడిపై టమోటాలు విసిరి కొడతారు. కేజీల కొద్ది టమోటాలు తీసుకువచ్చి వరుడిని నిండా ముంచేస్తారు. ఇలా చేస్తే పెళ్లి బంధం కలకాలం నిలిచి ఉంటుందని అక్కడి స్థానికుల విశ్వాసం.
4. దండలు మార్చుకుంటే పెళ్లి అయినట్లే:
అస్సాంలోని రభా తెగ ప్రజల వివాహ ఆచార పద్ధతులు చాలా సింపుల్ గా ఉంటాయి. ఎంత సింపుల్ అంటే.. పెళ్లి కొడుకు, కూతుళ్లకు చెరో పూల దండలు ఇస్తారు. వాళ్లు వాటిని ఒకరి మెడలో ఒకరు వేసుకుంటారు. అంతే.. పెళ్లి అయిపోయినట్లే. కన్యాదానాలు లేవు, పూజాపునస్కారాలు లేవు, అక్షింతలు చల్లుకోవడాలు లేవు, తాళి కట్టడం కూడా లేదు. చాలా సింపుల్ కదా.
5. పెళ్లికి ముందు ఏడాది వెలివేస్తారు:
కొన్ని ఆదివాసీ తెగలు విచిత్రమైన సాంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. స్త్రీ, పురుషులకు వివహం ఖాయం అయ్యాక.. వారిద్దరిని కలిపి రహస్య ప్రదేశంలో ఉంచుతారు. ఎవరితోనూ మాట్లాడొద్దు. ఎవరినీ కలవొద్దు. అలా ఓ సంవత్సరం పాటు ఎవరికీ తెలియని ప్రాంతంలో ఉండాలి. ఏడాది గడిచాక తమ ప్రాంతానికి వస్తే వారిద్దరి పెళ్లికి పెద్దలు అనుమతిస్తారు. తర్వాత ఘనంగా పెళ్లి జరిపి, విందు ఏర్పాటు చేస్తారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications